.
మోహన్‌లాల్ నటించిన, ప్రకాష్ వర్మ దర్శకత్వం వహించిన తాజా జ్యువెలరీ యాడ్, ప్రస్తుత సాంస్కృతిక వాతావరణంలో, సంప్రదాయ ప్రకటనలకు ఒక వినూత్నమైన భిన్నత్వం… నిజంగా ఎక్సలెంట్…
వివాదాస్పద పాల కంపెనీలు, గుట్కాలకు కూడా యాడ్స్ చేసే మన హీరోలు మోహన్‌లాల్‌లాగా ఒక్కటంటే ఒక్క యాడ్ ఇలాంటిది చేయగలరా..? ఇంపాజిబుల్… ఊహించలేం…
Ads
ఇప్పుడు నటుడిగా కూడా మారిన ప్రకాష్ వర్మ అనే వెటరన్ యాడ్ ఫిలిమ్ డైరెక్టర్ ఈ భిన్నమైన యాడ్‌కు దర్శకత్వం వహించాడు… (తుడరమ్ సినిమాలో నటించాడు)… వెరీ క్రియేటివ్ యాడ్… మోహన్‌లాల్ తన స్త్రీలింగ స్వభాన్ని ప్రదర్శించడమే వెరయిటీ… మామూలుగా యాడ్స్‌లో కూడా హీరోయిజం (సోకాల్డ్ మగతనం) ఎక్స్‌పోజ్ అవుతుంటాయి కదా… ఇందులో ఆడతనాన్ని ఆలింగనం, ఆవాహన చేసుకునే మగతనం…
అర్థం కాలేదా..? ఈ వాణిజ్య ప్రకటన ఒక పరిచయ సన్నివేశంతో ప్రారంభమవుతుంది.. ఒక పెద్ద స్టార్ ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరణ కోసం సెట్‌కు చేరుకుంటాడు… అయితే, ఒక ఆభరణం అదృశ్యం కావడంతో కథ అనూహ్య మలుపు తిరుగుతుంది… అందులో మోహన్‌లాల్ ప్రమేయం ఉందని సూచనలు ఉన్నప్పటికీ, “ఎందుకు” అనే ప్రశ్న ఆకర్షణీయమైన రహస్యంగా మిగిలిపోతుంది…
ఈ “ఎందుకు” అనేది యాడ్ యొక్క నిజమైన హైలైట్ పాయింట్… మోహన్‌లాల్ అభిమానులకు ‘కమలదళం’, ‘వానప్రస్థం’ వంటి చిత్రాలలో తెలిసిన ఒక కోణాన్ని వెల్లడిస్తుంది – ఇది సాధారణ పురుషత్వ చిత్రణలను అధిగమించే సున్నితత్వం ప్లస్ లోతు…
ఈ ప్రయోగం ‘మెన్ ఆఫ్ ప్లాటినం’ వంటి పురుషుల ఆభరణాల ప్రచారాలకు పూర్తి భిన్నంగా ఉంది, ఎంఎస్ ధోనీ, సూర్యకుమార్ యాదవ్ వంటి క్రికెట్ తారలు కూడా జువెల్లరీ యాడ్స్ చేశారు… కానీ అవి ‘మగతనం’ పరిధుల్లోనే ఉంటాయి… ఇలా ఆడకోణాన్ని చూపించరు… ఇదే మోహన్‌లాల్ మలబార్ గోల్డ్‌కు బ్రాండ్ అంబాసిడర్… ప్లస్ జోష్ అలుక్కాస్ కూడా మగ స్టార్స్‌ను తమ యాడ్స్‌కు ఉపయోగించుకుంటున్నాయి…
కానీ ఓ మగమనిషి తనలోని ఆడతనాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ, మహిళలు ధరించే నగల్ని తనూ ధరించి, మురిసిపోతూ ప్రేక్షకులకు కనిపించడం ఇదే తొలిసారి… తన క్యారవాన్‌లో నగల్ని ధరించి ఆనందంగా ఫీల్ అవుతుంటే, దర్శకుడు ప్రకాష్ వర్మ రావడంతో బ్రేక్ పడుతుంది…
మన సినిమాలు ‘యానిమల్’, ‘మనోస్పియర్’ వంటి హైపర్- మాస్కులైన్ (సూపర్ మగతనం) కథనాలతో ఆధిపత్యం చూపించే ఈ రోజుల్లో ఓ మగ స్టార్ తనలోని ఆడతనం కోణాన్ని ఇలా ధైర్యంగా, అంతే సున్నితంగా ప్రదర్శించడం బాగుంటుంది…
మన మగ తారలు ఆడ వేషాలు వేయడం కొత్తేమీ కాదు, జీవించారు… ఉదాహరణకు కమలహాసన్… కానీ ఈ యాడ్ ఆడ వేషం వేయదు, మగలోని ఆడకోణాన్ని సున్నితంగా ప్రదర్శిస్తుంది…
ఈ యాడ్ లింగ మూస ధోరణులను నేర్పుగా బద్దలు కొట్టినప్పటికీ, ఇది నగల మార్కెట్‌కు సంబంధించి ఒక పెద్ద, ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తుతుంది… : ఒక పురుషుడు, అది మోహన్‌లాల్ అయినా సరే, ఇష్టపడిన నగల్ని మహిళలు ఇష్టపడతారా..? ఇది సరైన మార్కెటింగ్ కోణమేనా..? ఒక నగ మహిళలకు ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటారు గానీ, ఎవరో మగాడు ధరిస్తే ఎలా ఉంటుందో చూడాలని కోరుకుంటారా..? తరువాత ఆ నగల డిజైన్లను ఇష్టపడతారా..?
ఈ ప్రకటన అందం ప్లస్ కోరికలను మనం చూసే విధానాన్ని ధైర్యంగా పునర్నిర్వచిస్తుంది.., అలంకరణ వస్తువు పట్ల ఆకర్షణ అనేది సంప్రదాయిక లింగ పాత్రలను అధిగమించగలదని సూచిస్తుంది… నిజానికి ఈ యాడ్ కంటెంట్, క్రియేటివిటీని సరళంగా చెప్పడం కష్టం, వీడియో చూసి ఫీలవడం తప్ప, అర్థం చేసుకోవడం తప్ప..!
ఎవరో మిత్రుడు చెప్పినట్టు… మన సినిమాలు మన హీరోల మగ జన్యు లక్షణాల్ని మరీ YY తరహాలో చూపిస్తాయి… కానీ నిజంగా మగ అంటే XY జీన్స్ కదా… ఇందులోనూ X ఉందని చెప్పడమే ఈ యాడ్ వెరయిటీ… ఇంట్రస్టింగ్…
Share this Article