.
బీజేపీలో బండి వర్సెస్ ఈటల ఎపిసోడ్‌కన్నా… కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యాఖ్యలు ఎక్కువ కలకలాన్ని క్రియేట్ చేస్తున్నాయి, కారణం అవి తనలోని ఫ్రస్ట్రేషన్‌ను, అత్యాశ ధోరణిని వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి… అంతేకాదు, బలంగా ఉన్న పార్టీ స్థితిని సీనియర్లే చేజేతులా చెడగొడుతున్న పోకడల్ని స్పష్టం చేస్తున్నాయి…
తెలంగాణ ఇచ్చాక కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాలేక, పదేళ్లపాటు కేసీయార్ చేతిలో ఘోరమైన దెబ్బలు తినీ తినీ, ఎట్టకేలకు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక…. ఇక దాన్ని ఎలా నిలుపుకోవాలో, మళ్లీ కేసీయార్ బలం పుంజుకోకుండా ఎలా పార్టీని రక్షించుకోవాలో సీనియర్ నేతలకే తెలియకపోతే ఎలా అనే ప్రశ్న పార్టీ శ్రేణులను వెంటాడుతోంది…
Ads
మళ్లీ బీఆర్ఎస్ పుంజుకుంటే ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతం… ఈ సోయి కూడా లోపించింది కొందరు సీనియర్ నేతల్లో..! కాంగ్రెస్ పార్టీలో వర్గాలు, వ్యక్తుల సమరం పెద్ద ఆశ్యర్యమేమీ కాదు, కానీ అది చివరకు మొత్తంగా పార్టీ మనుగడకే ఎసరు పెట్టే స్థాయికి చేరితే ప్రమాదమే…
ఒక ముఖ్యమంత్రి తన వెనుకబడిన సొంత జిల్లాకు వెళ్లినప్పుడు… మళ్లీ ఈ పాలమూరు బిడ్డే, పదేళ్లూ సీఎంగా నేనే అని వ్యాఖ్యలు చేశాడు… దీనిపట్ల రాజగోపాలరెడ్డి అభ్యంతరాలే అర్థరహితం… 1) ఓ నాయకుడికి పదేళ్లపాటు సీఎంగా ఉండాలనే సంకల్పం, ఆశ ఉండటంలో తప్పులేదు, అదేమీ దాచుకోవడం లేదు, ప్రజలకే చెబుతున్నాడు, ఆ దశలో తనను బలపరచాలని అడుగుతున్నాడు, తప్పేముంది..?
2) ప్రతిపక్షాలు ఏవేవో ప్రచారం చేస్తాయి, ప్రయత్నాలు చేస్తాయి, కలవరం వద్దు, మనమే పదేళ్లపాటు అధికారంలో ఉంటామని చెప్పడం ద్వారా వాళ్లలో భరోసాను, ధైర్యాన్ని, కమిట్మెంట్‌ను నింపడానికి ప్రయత్నిస్తే తప్పేమిటి..?
3) పార్టీ హైకమాండే సుప్రీం, కానీ అది ప్రజలు ఆశీర్వదించాకే కదా… జనంలో అది నిలుపుకోవడానికి మేం ఇస్తున్న హామీలు, అమలు చేస్తున్న పథకాలు, చేపట్టే ప్రాజెక్టులు పదేళ్లపాటూ కొనసాగుతాయి, నేనే ఉంటాను, అమలయ్యేలా చూస్తాను, చేస్తాను అని జనానికి చెప్పుకోవడంలో తప్పేముంది..? అది పార్టీకే కదా ఉపయోగం…
ఏ కోణంలో చూసినా సరే ఆ వ్యాఖ్యలు బీఆర్ఎస్ క్యాంపు ప్రచారం చేస్తున్నట్టు సెల్ఫ్ డబ్బా కాబోదు… రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు సహజం… కారు, సర్కారు, పదహారు అని ఇదే బీఆర్ఎస్ క్యాంపు ప్రచారం చేసుకోలేదా అప్పట్లో లోకసభ ఎన్నికల్లో..? ప్రతిసారీ అధికారంలోకి వచ్చేది మేమే అని బీజేపీ చెప్పుకోవడం లేదా..? మళ్లీ నేనే ప్రధాని అని మోడీ చెప్పుకోలేదా గతంలో..?
పైగా ఇప్పుడు ‘అసలైన కాంగ్రెస్’ అంటూ మరొక పేరు కాయిన్ చేసి, ఇంకో అర్థరహిత ప్రచారం జరుగుతోంది… కాంగ్రెస్ ఓ సముద్రం, వస్తుంటారు పోతుంటారు నాయకులు… అంతెందుకు..? ఇదే రాజగోపాలరెడ్డి బీజేపీ నుంచి రాలేదా..? అక్కడ ఎందుకు ఒక్క సంవత్సరం కూడా ఇమడలేకపోయినట్టు..? ఒక కుటుంబం ఒక అవకాశం ఒక పదవి అనేది కదా కాంగ్రెస్ పదే పదే అమల్లోకి తెద్దామని అనుకుంటున్న సూత్రం…
మరి ఒకే కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు… అందులో ఒకరు ఆల్రెడీ మంత్రి… అలాంటప్పుడు రాజగోపాలరెడ్డికి మంత్రి పదవి ఎలా సాధ్యం..? దీన్ని అత్యాశ ధోరణి అనరా..? ఆశలు తప్పుకాదు, కానీ పరుగెత్తేవాడి కాళ్లలో కట్టెలు పెట్టడం తప్పు… ఇలాంటి ధోరణులు పార్టీకే చేటు… మీనాక్షి నటరాజన్, మీకేమైనా అర్థమవుతోందా..?!
Share this Article