.
ఎంత డబ్బున్నా విధి ముందు నిలబడదు… ఆ తండ్రి 20 సంవత్సరాల పోరాటం ఓడిపోయింది..,.
“ప్రిన్స్ అల్వలేద్ బిన్ ఖలీద్ ” ప్రపంచంలోని ఒక అత్యంత ధనవంతుడు, సౌదీ రాజవంశానికి చెందిన ఒక యువరాజు, 2005 లో లండన్ లో ప్రమాదవశాత్తూ గాయపడి, మెదడు నరాలు దెబ్బతిని, అప్పటినుండి కోమాలోనే ఉండి… నిన్న అనగా జులై 19 న మరణించాడు…
Ads
దాదాపు 20 ఏళ్ళు కోమాలో ఉండటం వలన అతన్ని “స్లీపింగ్ ప్రిన్స్ అఫ్ సౌదీ” అని పిలుచుకునేవాళ్ళు. 20 ఏళ్లుగా ఆ తండ్రి అనుభవించిన కష్టం ఎవరికీ రాకూడదు, డాక్టర్లు ఎప్పుడో బ్రెయిన్ డెడ్ అని ధ్రువీకరించినా… శరీరంలో చిన్న చిన్న కదలికల వలన… ఆ తండ్రి కన్నప్రేమ చంపుకోలేక… ఏనాటికైనా తన కొడుకు కోలుకుంటాడని ఆశపడ్డాడు…
ఒకానొక సమయంలో మీడియా తన కొడుకు గురించి అడిగితే “ఆ దేవుడు తీసుకుళ్ళాలనుకుంటే, అప్పుడే (2005) తీసుకెళ్ళేవాడు, ఆయనకి తీసుకెళ్లడం ఇష్టం లేకే వాడి ప్రాణాలు ఇంకా ఉన్నాయి’’ అని చెప్పడం కన్నతండ్రి స్వచ్ఛమైన ప్రేమకి నిదర్శనం..,
అప్పటినుండి 20 ఏళ్ళుగా ఆ కుటుంబం పిల్లాడు కోలుకుంటాడని ఎదురుచూస్తూనే ఉంది. చనిపోయిన యువరాజు వయస్సు కేవలం 36 ఏళ్ళు,.. అంటే 16 సంవత్సరాలకే యాక్సిడెంట్ అయ్యి 20 ఏళ్ళు కోమాలో ఉన్నాడు…
అది అత్యంత ధనిక రాజవంశం కాబట్టి ఇలా ఇన్నేళ్లూ చూసుకోగలిగింది… కానీ మనలాంటి సామాన్యులకే అలాంటి పరిస్థితి వస్తే, తట్టుకోవడం కష్టం కదా… (గోపు విజయకుమార్ రెడ్డి)
Share this Article