Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గత సంబంధాలన్నీ గుండె పగిలిన అనుభవాలే… నేనిప్పుడు ఒంటరిని…’’

July 23, 2025 by M S R

.

నళిని సుకుమారన్ నిత్య… నిత్యా మేనన్ అసలు పేరు అదే… అసలు మేనన్ అని అప్పుడెప్పుడో ఏదో అవసరం కోసం తగిలించుకున్నానని చెప్పింది ఓసారి… 35 ఏళ్లు…

కేరళ రూట్స్… మలయాళ కుటుంబం… కానీ ఎప్పుడో బెంగుళూరులో స్థిరపడ్డారు… పుట్టుక నుంచి చదువు, కెరీర్ నిర్మాణం దాకా అన్నీ కన్నడమే… నటి మాత్రమే కాదు, గాయని, వెబ్ సీరీస్, షార్ట్ ఫిలిమ్స్, టీవీ షోలు, చివరకు అదేదో సినిమాకు కొరియోగ్రఫీ కూడా చేసింది…

Ads

ఇవి ఎందుకు చెప్పుకోవడం అంటే… ఓ డిఫరెంట్ పర్సనాలిటీ ఆమె..! ఏది ఇష్టమైతే అది చేస్తుంది… ఓ ఫిక్స్‌డ్ రొటీన్ ఫార్మాట్‌లో జీవితాన్ని గడపటానికి ఇష్టపడదు… ఎడాపెడా సినిమా అవకాశాలు రావడం లేదనే బాధా ఉండదు, వెంపర్లాట కూడా ఉండదు…

పాత్ర నచ్చితే చేస్తుంది… లేదంటే ఓ పేద్ద దండం పెడుతుంది… కాకపోతే లావు అయిపోవడంతో ఆమె సినిమా కెరీర్ దెబ్బతిందనేది నిజం… దాన్నీ ఒప్పుకోదు, నా బరువు, నా కంఫర్ట్, నడుమ మీకేం నొప్పి అంటుంది క్రిటిక్స్‌ను ఉల్టా…

ఇప్పుడు ‘సార్, మేడమ్’ సినిమాతో విజయ్ సేతుపతితో… త్వరలో ఇడ్లీ కడై సినిమాతో ధనుష్‌తో తెర మీదకు వస్తోంది… జాతీయ అవార్డు కొట్టింది… సో, మళ్లీ వార్తల తెరమీదకు వస్తోంది… జీవితం పట్ల తన దృక్పథం వేరేగా ఉంటుంది…

సార్ మేడమ్ (తలైవన్ తలైవి సినిమా) ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది… ప్రేమ, సంబంధాలు, పెళ్లి గురించి ఆసక్తికర వివరాలు చెప్పుకొచ్చింది…

‘‘చిన్నతనంలోనే తనకు ఓ తోడు కావాలని భావించాను… కుటుంబం, తల్లిదండ్రులు, సమాజం పెళ్లి తప్పనిసరి అనే భావనను కలిగిస్తాయి… ఇప్పుడు నేను వేరు, భిన్నమైన జీవితాన్ని గడపవచ్చని అర్థం చేసుకున్నాను… ప్రతి ఒక్కరికీ తమకు నిజమైన తోడు, సోల్ మేట్ దొరకాలని ఏమీ లేదు…

అంతెందుకు, అంతటి రతన్ టాటాకే పెళ్లి కాలేదు, ఎస్, పెళ్లి జరిగితే గొప్పదే, జరగకపోయినా గొప్పదే, బాధ లేదు… అదంత ప్రధానమూ కాదు… నా గత సంబంధాలు నాకు గుండె పగిలే అనుభవాలనే (హార్ట్ బ్రేకింగ్) మిగిల్చాయి…

వోకే, ఇప్పుడు నాది ఓపెన్ పాథ్… స్వేచ్ఛగా ప్రయాణించగల మార్గం… ఇప్పుడు నేను ఎవరితోనూ లేను… నో రిగ్రెట్స్, నో పెయిన్..’’ అంటోంది… నిజమే, తన ఆలోచనల సరళి తనను ఎప్పుడూ ఓ బందిఖానాలో బంధించి ఉంచలేదు… తను బంధింపబడదు…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎయిర్ ఇండియా బోయింగ్ ప్రమాదంపై సవివర సాంకేతిక విశ్లేషణ 2
  • ఎయిర్ ఇండియా బోయింగ్ ప్రమాదం సవివర సాంకేతిక విశ్లేషణ -1
  • ఫాఫం సాక్షి..! అస్త్రాలు దొరుకుతున్నా ఏదో అంతుపట్టని అలసత్వం..!!
  • తెరపైకి హఠాత్తుగా బాబు, కేసీఆర్, పురంధేశ్వరి, రేవంత్‌రెడ్డి పేర్లు..!!
  • రేవంత్‌రెడ్డి ఫ్రీబస్సు బహుళ ప్రయోజనాల్ని ఇలా భిన్నంగా చూడాలి..!!
  • ఉపరాష్ట్రపతి ధన్కర్ రాజీనామా వెనుక ఇవీ అసలు కారణాలు..!!
  • గత సంబంధాలన్నీ గుండె పగిలిన అనుభవాలే… నేనిప్పుడు ఒంటరిని…’’
  • టి.కృష్ణ ఇంకొన్నాళ్లు బతికి ఉంటే… ఎన్ని ‘ప్రతిఘటన’లు పేలేవో..!!
  • తెలుగు డబ్బింగ్ వెర్షన్లకూ యథాతథంగా అవే తమిళ టైటిళ్లు..!
  • ‘‘పొలిటికల్ లాబీయింగుతోనే అమితాబ్‌కు ఆ జాతీయ అవార్డు’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions