.
తీటకు గోకితే గోకుగానీ ఏకగోత్రాన్ని గోకకు… పాత రంకులు కాస్తా బయటకొస్తయ్ అంటారు పెద్దలు… ఇదీ అలాగే ఉంది… బీజేపీ ఎంపీ సీఎం రమేష్… తను రాజకీయ నాయకుడికన్నా ప్రధానంగా వృత్తిపరంగా కంట్రాక్టర్… పైగా సేమ్ కేటీఆర్ సామాజికవర్గం…
సూది కోసం సోదికెళ్తే అన్నట్టుగా… కేటీఆర్ నిన్న ఎక్కడో మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీలో 1665 కోట్ల రోడ్డు కంట్రాక్టును రేవంత్ రెడ్డి సీఎం రమేష్‌కు ఇచ్చాడని, దీనిపై రాహుల్ గాంధీ జవాబు చెప్పాలని ఏదేదో ఆరోపించాడు… అది రివర్స్ కొడుతోంది…
Ads
కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూములు తాకట్టు పెట్టి, రుణాలు ఇప్పించిందీ బీజేపీ ఎంపీ సీఎం రమేషేననీ, అంతేకాదు, ఎఫ్ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా ప్రభుత్వానికి రుణం ఇప్పిస్తానని తను హామీ ఇచ్చి, ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీని రేవంత్ సర్కారుకు పరిచయం చేసింది రమేషే అని కేటీఆర్ ఆరోపణ… (ఆ భూముల్ని ఎవరికీ తాకట్టు పెట్టలేదని రేవంత్ రెడ్డి అధికారిక ప్రకటన చేశాడు)…
ఆ కంపెనీ ఆ భూములను తాకట్టు పెట్టించి పదివేల కోట్ల రుణం ఇప్పించిందనీ, దీనికి ఆ టీఐఏ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూ.169 కోట్లను బ్రోకరేజీ కింద చెల్లించిందనీ… అలా ఫాయిదాా చేశాడు కాబట్టి రమేష్‌కు క్విడ్ ప్రో కో తరహాలో అనుచిత లబ్ధి చేకూర్చేందుకు రేవంత్ ఆ రోడ్డు కంట్రాక్టు ఇచ్చాడని ఆరోపించాడు…
1. రోడ్డు కంట్రాక్టులు నామినేషన్ల పద్దతిలో అప్పగించరు… 2. కాంపిటీటీవ్ బిడ్డింగ్ ఉంటుంది… 3. కేటీఆర్ బినామీ కంట్రాక్టు సంస్థలు ఏమైనా ఉంటే, అవీ ఆ బిడ్డింగులో కూడా పాల్గొనవచ్చు… 4. ఇందులో రాహుల్ గాంధీ పేరును ఎందుకు లాగుతున్నట్టు..? 5. ఎఫ్ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా ఒక ఎంపీ సాయం చేయగలడా..? అదొక సంక్లిష్టమైన ఆర్థిక నిర్వహణ కట్టుబాటు… 6. అసలు సీఎం రమేష్‌కూ కేటీఆర్‌కూ ఎక్కడ బెడిసింది..? తననెందుకు లాగుతున్నాడు..?
….. ఇలా బోలెడు ప్రశ్నలు, సో వాట్, బురదే కదా, చల్లితే చాలు, కడుక్కోవడం కుర్చీ మీద ఉన్నవాడి పని అన్నట్టుగా సాగుతున్నయ్ కేటీఆర్ విమర్శలు… సరే, చేస్తే చేశాడు గానీ, మరీ సీఎం రమేష్ అనే స్వగోత్రుడిని గోకాడు… దాంతో రమేష్ ఇంకొన్ని జనం తెలుసుకోవాల్సిన కథలన్నీ ఏకరువు పెడుతూ బట్టలు విప్పేస్తున్నాడు… అనకాపల్లిలోని తన ఆఫీసులో మాట్లాడుతూ…
‘‘ప్రభుత్వం ఏదైనా కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తారో పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన నీకు తెలియదా… అసలు ఆ కంపెనీతో నాకు సంబంధమే లేదు…’’ అని ఖండిస్తూ… నాలుగు నెలల క్రితం ఢిల్లీలో నా ఇంటికి వచ్చిన నీవు మాట్లాడావో గుర్తుందా అంటూ ఆ పాత విషయాలు, బీజేపీ ఎదుట మోకరిల్లడానికి కేటీఆర్ ఢిల్లీలో చేసిన రాయబేరాలు వెల్లడించాడు…
‘‘మీ ప్రభుత్వంలో చేసిన అవినీతి బయటకు రాకుండా, కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బిజెపి పార్టీలో మీ పార్టీని కలపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పావు, అవునా? కాదా? నేను మా పార్టీ పెద్దలతో చర్చించాక.., మీది అవినీతి పార్టీ అనీ, తెలంగాణలో మీ పని అయిపోయిందనీ, అందుకని మీతో మాకు పని లేదని చెప్పాను కదా, అందుకేనా ఇక ఇలాంటి విమర్శలు చేస్తున్నావు..?
కేవలం 300 ఓట్ల మెజార్టీతో నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యేగా గెలిచావో నన్ను చెప్పమంటావా? తుమ్మల నాగేశ్వరావు లాంటి నాయకుడిని మీ పార్టీ ఎందుకు వదిలేసుకుందని నిన్ను అడిగితే, మా పార్టీకి కమ్మ నా కొడుకులు అవసరం లేదనీ… రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మా పార్టీలో రెడ్డిలు కూడా రేవంత్ వెనకాల వెళ్లిపోయారనీ, ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తున్నామని నువ్వు నాతో చెప్పావా లేదా?
మీ పార్టీ పదేళ్ల పాలనలో తెలంగాణలో సుమారు 7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు? అవి ఎవరెవరికి ఇచ్చారు? అందులో తెలంగాణ వాళ్లు ఎంతమంది? ఆంధ్రా వాళ్ళు ఎంతమంది అన్నది నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి… అనవసరంగా నన్ను కెలికితే ఇంకా మీ గురించి చాలా నిజాలు చెప్పాల్సి వస్తుంది…’’ అని సీరియస్‌గా కౌంటర్ ఇచ్చాడు… మీడియా సమక్షంలో చర్చిద్దాం వోకేనా అని సవాల్ విసిరాడు.,.
కాగల కార్యం సీఎం రమేష్ తీర్చాడన్నట్టు… ఇప్పుడు తనపై కేటీఆర్ చల్లిన బురదను రేవంత్ రెడ్డి కడుక్కోనక్కర్లేదు… నేనున్నాను కదా అంటూ సీఎం రమేష్ కేటీఆర్‌ను ‘కడిగేయడానికి’ అన్ని పాత బాగోతాల వివరాలతో సహా రెడీగా ఉన్నాడు…!!
(1) తాను జైలులో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చర్చలు జరిగాయని సాక్షాత్తూ కవితే బహిరంగ వ్యాఖ్య చేసింది… 2) హరీష్, కేటీఆర్ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో కవిత విడుదలకు, బీజేపీలో విలీన ప్రతిపాదనలతో సీరియస్ ప్రయత్నాలు చేశారనీ వార్తలొచ్చాయి.,. 3) గతంలో ప్రధాని మోడీ కూడా దాదాపు ఇదే అర్థమొచ్చే వ్యాఖ్యలు చేశాడు… 4) ఇప్పుడు సీఎం రమేషు కూడా అదే చెబుతున్నాడు… నా సాయమూ అడిగారు అంటున్నాడు… పదేళ్ల క్రితం కాంగ్రెస్‌లో విలీన ప్రయత్నాలు, అధికారం పోయాక ఇప్పుడేమో బీజేపీలో విలీన ప్రయత్నాలు… అసలు కేటీఆర్ నిజాలు చెప్పాల్సింది ఈ విషయాలపై కూడా…)
ఇప్పుడు క్లారిటీ రావల్సింది ఏమిటంటే..? 1) కేటీఆర్ కేవలం 300 వోట్లతో గెలిచినప్పుడు ఎవరు సహకరించారు..? ఎలా..? ఎందుకు..? 2) బీజేపీలో ఎందుకు బీఆర్ఎస్‌ను విలీనం చేద్దామని సీరియస్ రాయబేరాలు నడిపారు..? 3) బీజేపీ ఆ ప్రయత్నాల్ని ఎందుకు తిరస్కరించింది..? 4) సీఎం రమేష్ దగ్గర ఇంకా ఏమేం బాగోతాల వివరాలున్నాయి..? 5) 2024లో కూడా సీఎం రమేష్ బీఆర్ఎస్ ముఖ్యులకు చాలా సీరియస్ కౌంటర్లు ఇచ్చాడు… అసలేం జరుగుతోంది..?
Share this Article