.
జొమాటో, స్విగ్గీ… యాప్స్ ఓపెన్ చేసి, ఎన్నెన్ని డిష్షులు, ఎన్ని రెస్టారెంట్లు వెతికినా సరే… ఇదే కథ…
.
బిర్యానీ సింగిల్ 250 రూపాయలు అట… ఫుల్ అయితే 350 అట… వీడమ్మా భడవా అనుకుని, దమ్ వెజ్ బిర్యానీ సెలెక్ట్ చేసి, పేమెంట్ ఫిగర్ చూస్తే…
.
రెస్టారెంట్ ఫీజు, జీఎస్టీ, ప్లాట్‌ఫామ్ ఫీజు, మన్నూమశానం అన్నీ కలిపి 385 రూపాయలు… ఫుడ్ డొనేషన్, డెలివరీ పార్టనర్ టిప్ మినిమం 15 కలిపితే 400 చూపిస్తోంది…
.
ఒక్క డిస్కౌంట్ కూపనూ కనిపించలేదు… రకరకాల కార్డులు, పేమెంట్ యాప్స్… వాటికీ ప్యాకేజీలు… టోటల్ బిల్లు 600 రూపాయలు దాటితే 60 డిస్కౌంట్ అంటాడు ఒకడు… 800 దాటితే 100 డిస్కౌంట్ అంటాడు మరొకడు…
.
ఛ, కిలోమీటర్ లోపు దూరమే కదా… మనమే వెళ్తే పోలా అనుకుని, బండి తీసుకుని, నేరుగా సదరు రెస్టారెంటుకే ఇద్దరూ వెళ్తే…. అక్కడ మంచి ఆంబియెన్స్.., ఉల్లి ముక్కలు, నిమ్మకాయ బద్దలు… ఉప్పు, పెప్పర్… మినరల్ వాటర్… ఒక రైతా, ఒక గ్రేవీ… కంఫర్ట్ సీటింగు, ఎదురుగా టీవీ…
.
అదే దమ్ వెజ్ బిర్యానీ ఆర్డరిస్తే, 20 నిమిషాల్లో సర్వ్ చేశాడు… మెల్లిగా ఎంజాయ్ చేస్తూ రెండు గంటలపాటు రిలాక్స్… బిల్లు తెచ్చాడు… సేమ్ 385 రూపాయలు… ఇన్‌క్లూడింగ్ ఆల్… టిప్పుగా ఓ 15 రూపాయలు సర్వారాయుడికి ఇచ్చి, ఇల్లు చేరితే… ఆహా…
.
ఇప్పుడు చెప్పండి… ఏది బెటర్..? ష్, నిజం చెప్పొద్దూ… రెస్టారెంటులోనే ఎక్కువ క్వాంటిటీ ఇచ్చాడు… ఇంకాస్త కర్డ్ రైతా బ్రో అనడగ్గానే తెచ్చి ఇచ్చాడు… పార్శిల్ అంటే అందులో ముప్పావు వంతు ఫుడ్డు కూడా ఉండదు, నో ఉల్లి, నో లెమన్…
.
Ads
వాడు సింగిల్, ఫుల్ ఆర్డర్ వేర్వేరు తీసుకుంటాడు ఆన్‌లైన్ యాప్స్‌లో… ఫుల్ అని క్లిక్ చేసి, ఎక్కువ డబ్బు కట్టినా సరే, వాడు సింగిలే పంపిస్తాడు… నో అప్పీల్స్, నో క్వశ్చన్స్… పైగా అదెప్పటి ఫుడ్డో కూడా తెలియదు… ఆన్‌లైన్ ఆర్డర్ అనగానే ప్రతి రెస్టారెంటూ తక్కువ ఫుడ్డు, ఎక్కువ రేట్లు…
.
ఇదంతా నిజమే… ఒక్క పదం కూడా అబద్ధం లేదు…
.
Share this Article