.
శ్రీహరికోట, భారతదేశం – జూలై 28, 2025 :: భారతదేశం, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, భారతదేశ పట్టుదలనూ స్పష్టంగా చాటిచెప్పే కీలక ఘట్టానికి శ్రీహరికోట వేదిక కానుంది… అత్యాధునికమైన నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (NISAR) ఉపగ్రహం జూలై 30న ప్రయోగానికి సిద్ధంగా ఉంది…
బిలియన్ డాలర్ల విలువైన ఈ భూ పరిశీలన ఉపగ్రహం, ప్రపంచంలోని అతి పురాతన, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారానికి నిదర్శనం… ఇది విపత్తుల అంచనా, వాతావరణ పర్యవేక్షణలో గణనీయమైన ముందడుగు వేయనుంది…
‘నాసాకు అసూయ, భారత్‌కు గర్వం’గా అభివర్ణించబడుతున్న ఈ NISAR ఉపగ్రహాన్ని భారతదేశానికి చెందిన GSLV మార్క్- 2 ద్వారా ప్రయోగిస్తున్నారు… ఈ రాకెట్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ ఇంజిన్‌తో నడుస్తుంది… 1990ల ప్రారంభంలో అప్పటి సోవియట్ యూనియన్‌పై ఆంక్షలు, ఒత్తిళ్లు తెచ్చి ఈ సాంకేతికతను భారతదేశానికి నిరాకరించడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది…
Ads
భారీ అంతర్జాతీయ ఒత్తిడి, సాంకేతిక నిరాకరణలు ఉన్నప్పటికీ, ఇస్రో శాస్త్రవేత్తలు దాదాపు రెండు దశాబ్దాలు కష్టపడి క్రయోజెనిక్ ఇంజిన్ సాంకేతికతలో ప్రావీణ్యం సంపాదించారు… ఈ పట్టుదలే ఇప్పుడు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్‌కు గర్వకారణంగా మారింది… స్వదేశీ ఇంజిన్‌తో కూడిన రాకెట్ చారిత్రక ప్రయోగాన్ని వీక్షించడానికి అగ్రశ్రేణి నాసా అధికారులు కూడా హాజరవుతారు…
2,392 కిలోల బరువున్న NISAR ఉపగ్రహం ప్రతి 12 రోజులకు ఒకసారి ప్రపంచాన్ని స్కాన్ చేయడానికి రూపొందించబడింది… ఇది అన్ని వాతావరణ పరిస్థితులలో, పగలు రాత్రి డేటాను అందిస్తుంది, ఇది అనేక రకాల అనువర్తనాలకు కీలకం…
భూమి ఉపరితలంలో సంభవించే చిన్న మార్పులను (భూకంపాలు, కొండచరియలు విరిగిపడటాన్ని అంచనా వేయడానికి), మంచు పలకల కదలికలు, వృక్షసంపద డైనమిక్స్ వంటి వాటిని గుర్తించగల సామర్థ్యం దీనికి ఉంది… ఈ డేటా రాబోయే ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రాణనష్టాల్ని తగ్గించడానికి గేమ్-ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది…
NISAR మిషన్‌లో ఆశ్చర్యకరమైన విషయం భాగస్వాములైన ఇరు దేశాల ఖర్చులలో పెద్ద తేడా… NASA సుమారు $ 1.15 బిలియన్లు ఖర్చు చేయగా, ISRO కేవలం $100 మిలియన్లు (సుమారు 800 కోట్ల రూపాయలు) మాత్రమే వెచ్చించింది…
సంకెళ్ళ నుండి సహకారం వరకు: ఒక పూర్తి సర్కిల్
గతంలో, US భారతదేశ అంతరిక్ష కార్యక్రమంపై ఆంక్షలు విధించింది… 2008లో ఇండో- US పౌర అణు ఒప్పందంతో మాత్రమే ఆ కాలం ముగిసింది… గత ఆంక్షలు గుర్తున్నప్పటికీ, ISRO 2008లో చంద్రయాన్-1పై రెండు అమెరికన్ పరికరాలను ఉచితంగా చంద్రునిపైకి పంపింది…
ఇటీవలే యాక్సియం-4 మిషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాయి ఇస్రో- నాసాలు… ఈ NISAR ఉమ్మడి భాగస్వామ్యపు శాటిలైట్‌లో SAR అనే కొత్త టెక్నాలజీని వాడుతున్నారు… ఇందులో రెండు రకాల రాడార్లు ఉన్నాయి… ఇవి దట్టమైన అడవుల్లో కూడా సమాచారాన్ని సేకరించగలవు… భూ పొరల్లో కదలికలు, భూమిపై తేమ శాతాన్ని కూడా కచ్చితంగా అంచనా వేయగలుగుతుందంటే నిసార్ శాటిలైట్ ఎంత కీలకమైనదో అర్థం చేసుకోవచ్చు…
చివరగా... నాసా తన ఉద్యోగుల సంఖ్యను కుదిస్తోంది... ఇస్రో కొత్తగా రిక్రూట్ చేసుకుంటోంది...
Share this Article