.
ఒక టైమ్ వస్తుంది… జాతకం మళ్లీ వెలుగుతుంది… నిత్యా మేనన్ కథా ఇలాంటిదే… లావైపోయి, వచ్చిన పాత్రల్ని తిరస్కరిస్తూ… మంచి నటసామర్థ్యం ఉండీ, కెరీర్‌లో నష్టపోయిన ఆమెకు ఇప్పుడు ఓ మంచి హిట్ దక్కింది…
విజయ్ సేతుపతితో కలిసి నటించిన సార్ మేడమ్ (తమిళంలో తలైవాన్ తలైవి) మంచి వసూళ్లు సాధిస్తోంది తమిళంలో… 34 కోట్లు నాలుగు రోజుల్లో… శాటర్ డే, సండే వసూళ్లు 17 కోట్లు… నిజానికి ఇది చిన్న చిత్రమే… ఐతేనేం, తమిళులకు నచ్చింది..,
Ads
తెలుగులోనూ ఒకేసారి విడుదల చేద్దామనుకున్నారు… కానీ మనవాళ్లు థియేటర్లు దొరకనిస్తే కదా… అసలే డిప్యూటీ సీఎం సినిమా ఉంది బరిలో.,. హరిహర వీరమల్లు… దాంతో విధిలేక లేటుగా, వచ్చే ఫస్ట్ తారీఖున తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు… సరే, ఆ థియేటర్ల పంచాయితీ కథ అటుంచితే… అసలు ఏమిటీ ఈ సినిమా…
ఓ భిన్నమైన కథ… భార్యాభర్తల నడుమ అపార్థాలు, గొడవలు ఎట్సెట్రా… నిత్యా, సేతుపతిల (ఆకాశవీరుడు, మహారాణి) నటనే నిలబెట్టింది ప్లస్ కథ ట్రీట్‌మెంట్ కూడా..! హీరో ఓ పరాఠా మాస్టర్… వాటి మేకింగ్‌తోపాటు మరికొన్ని రెసిపీల సీన్లు కూడా సినిమాలో ఓ ఆకర్షణీయమైన అంశమే… భోజనప్రియులకు ఈ సీన్లన్నీ బాగుంటాయి కూడా…
హీరోయిన్‌ను హీరో ఇంటికి తీసుకురావడాన్ని హీరో సోదరుడు వ్యతిరేకించడంతో ప్రారంభమయ్యే కథ… సగటు తెలుగు టీవీ సీరియల్‌లోలాగే… అత్త, ఆడపడుచు ఎట్సెట్రా ఆడపాత్రలతో ఘర్షణ అధికం అవుతుంది… భార్యాభర్తల బంధం ఒడిదొడుకులకు గురవుతుంది… చివరకు విడాకుల దరఖాస్తు దాకా… సేమ్, సీరియళ్లలోలాగే మగపాత్రలవి ప్రేక్షకపాత్రలే…
ఐతేనేం, దర్శకుడు పాండ్యరాజ్ తన మార్క్ కథనంతో రక్తికట్టించాడు… ఈమధ్య మొనాటనీ వస్తున్న యోగిబాబు కూడా కాస్త వన్ లైనర్లతో నవ్విస్తాడు… ఏదో తెలుగు టీవీలో కుకూ విత్ జాతిరత్నాలు అని ఓ హిట్ సీరియల్ వస్తోంది కదా… (తమిళంలో కూడా)… ఇదీ ఆ బాపతే అనుకొండి… నవ్వులు ప్లస్ వంటలు…
హీరో పెద్ద స్టారు, సిక్స్ ప్యాక్ గట్రా బాపతు కాదు… హీరోయిన్ ఒబేసిటీ… ఐనా ఆ పాత్రలకు నప్పారు… వాళ్ల నటనతో మెప్పిస్తారు… మొహల్లో ఉద్వేగ ప్రదర్శన అంటే ఏమిటో ఇద్దరూ పోటీలుపడి, మంచి కెమిస్ట్రీతో చూపిస్తారు…
2022లో వీళ్లిద్దరూ 19(1)(A) అని ఓ మలయాళ సినిమా చేశారు జంటగా… దానికి ఈ సినిమా కథ, పోకడ పూర్తి భిన్నం.., అప్పటిలాగే ఇద్దరూ జంటగా రక్తికట్టించారు కూడా..!! సీరియస్ కథ కాదు, సరదాగా చూడొచ్చు అని తమిళ రివ్యూలు చెబుతున్నాయి…
Share this Article