.
Nàgaràju Munnuru ..........
== ఈ కేసులో దోషి ఎవరు? ==
భోపాల్‌కు చెందిన రాజేష్ విశ్వకర్మ… ఇతనికి తల్లిదండ్రులు లేరు.., కుటుంబానికి వ్యవసాయ భూమి కూడా లేకపోవడంతో ఒక దినసరి కూలీగా పనిచేస్తున్నాడు… జవాబుదారీతనం లేని, ఉదాసీనమైన భారతీయ న్యాయ వ్యవస్థకు బలైన నిర్భాగ్యుడు రాజేష్…
Ads
గత సంవత్సరం జూన్ నెలలో అతని పొరుగున ఉన్న ఒక మహిళ తనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సహాయం చేయమని రాజేష్‌ను కోరింది… మానవత్వం కలిగిన ఒక మంచి వ్యక్తిగా అతను ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చేర్పించి, ఆపై కూలి పనికి వెళ్లిపోయాడు…
ఆరోజు సాయంత్రం ఆ మహిళ మరణించింది… మరుసటి రోజు ఉదయం ఆమెను హత్య చేసిన నేరం మీద పోలీసులు రాజేష్‌ను అరెస్టు చేసి నేరుగా జైలుకు పంపారు…
న్యాయవాదిని నియమించుకోవడానికి రాజేష్ వద్ద డబ్బు లేదు… 13 నెలలుగా, అతను జైలులో ఉన్నాడు.., విచారణ లేదు, న్యాయ సలహా లేదు, కుటుంబంతో మాట్లాడే అవకాశం లేదు… ఈ నేరంలో అతని ప్రమేయం లేదని తేల్చింది పోలీసు దర్యాప్తు కాదు…
కోర్టు అతనికి న్యాయ సహాయం కోసం రీనా వర్మ అనే ఒక న్యాయవాదిని నియమించగా, ఆమె అనేక ప్రయత్నాల తర్వాత అతనిని నిర్దోషిగా నిరూపించి జైలు నుండి విడుదల చేయించింది…
కానీ ఈ స్వేచ్ఛ అతనికి ఉపశమనం కలిగించలేదు… అతని అరెస్టు తర్వాత, పోలీసులు అతని అద్దె గదికి తాళం వేశారు… ఇప్పుడు అతను ఇంటి యజమానికి 13 నెలల అద్దె చెల్లించాలి… అతను నిర్దోషిగా ప్రకటించబడినప్పటికీ, అతనికి ఎవరూ పని ఇవ్వడానికి ఇష్టపడటం లేదు… వారికి, అతను జైలు నుండి వచ్చిన వ్యక్తి మాత్రమే…
ఏ వివేకవంతమైన, న్యాయమైన చట్ట వ్యవస్థ కల దేశంలోనైనా, రాజేష్ ప్రభుత్వంపై నష్టపరిహారం కోసం దావా వేయగలడు, లక్షలాది రూపాయల పరిహారం పొంది గౌరవప్రదమైన జీవితాన్ని గడపగలడు. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో అతనికి ఒక్క పైసా కూడా రాదు…
గాయానికి అవమానం కూడా తోడైనట్టు అతని సోదరి జైలు నుండి రాజేష్ ఆధార్ కార్డు, ఫోన్‌ను తిరిగి పొందడానికి ₹500 లంచం చెల్లించాల్సి వచ్చింది… Sorry Rajesh…
Share this Article