Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలే పార్టీలో ఈటల ఎదురీత… ఈలోపు కాళేశ్వరం రిపోర్ట్ షాక్…

August 4, 2025 by M S R

.

ఫాఫం… ఈటల రాజేందర్…! ఎందుకు పాపం అనుకోవాలంటే… తెలంగాణ ఉద్యమంలో కేసీయార్‌ సమకాలీనుడు… ఎక్కడెక్కడో బతికి, తీరా టీఆర్ఎస్ క్యాంపులోకి వచ్చిన అవకాశవాది కాదు… ట్రూ ఉద్యమకారుడు…

అప్పట్లో వీర సమైక్యవాదులు, తెలంగాణ వ్యతిరేకులైన వైఎస్ మార్క్ వెక్కిరింపులను, కిరణ్‌కుమార్‌రెడ్డి బాపతు దబాయింపులను కూడా తను సూటిగా ఫేస్ చేశాడు… అదే కేసీయార్ కక్షగట్టి వేధిస్తే, రక్షణ కోసం బీజేపీలోకి వచ్చాడు, కానీ బేసిక్‌గా పీడీఎస్‌యూ భావజాలం, అంటే బీజేపీ వ్యతిరేక భావప్రవాహం…

Ads

సరే, తనది కాని పార్టీలో ఏదో తన్లాడుతున్నాడు… బండి సంజయ్, ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు వంటి సంప్రదాయిక, సంఘ్ ఎమర్జ్‌డ్ లీడర్లకూ తనకూ పడటం లేదు… ఈ లొల్లి కేంద్ర పార్టీ దాకా వెళ్లింది… ఈలోపు అనుకోని పిడుగులా ఈటల మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పడింది…

అదేమంటున్నదీ అంటే..?



కమిషన్ గుర్తించిన లోపాలకు బాధ్యులు...

అప్పటి ముఖ్యమంత్రి ( కె.చంద్రశేఖర్ రావు): మూడు బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, పూర్తి, నిర్వహణ,  మెయింటెనెన్స్లో జరిగిన అవకతవకలు, అక్రమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా బాధ్యత వహిస్తారు…” ఈ అవకతవకలకు, ఈ మూడు బ్యారేజీలకు కలిగిన నష్టానికి కారకుడు…

అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ( టి. హరీశ్ రావు): ముఖ్యమంత్రితో పాటు, తను కూడా నిపుణుల కమిటీ నివేదికలను ఉద్దేశపూర్వకంగానే పరిగణనలోకి తీసుకోలేదు..

అప్పటి ఆర్థిక శాఖ మంత్రి  ఈటల రాజేందర్): ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక ఆర్థిక నిర్ణయాల గురించి తనకు తెలియదని చెప్పి.., “కొత్తగా ఏర్పడిన రాష్ట్రపు ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిబద్ధత, సమగ్రత లోపించిందనట్లు” నిరూపించుకున్నాడు…

ఈటల



తనపైకి ఏ మరక రాకుండా ఉండటానికి… కమిషన్ ఎదుట హాజరైనప్పుడు కేబినెట్ నిర్ణయాలు వంటి విషయాల్లో అప్పటి ప్రభుత్వానికి పరోక్షంగా సర్టిఫికెట్ ఇచ్చాడు… తను లోపల కమిషన్‌కు ఏం చెప్పాడో గానీ మీడియా ఎదుట బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడలేకపోయాడు…

కాళేశ్వరం ఏటీఎం అని మోడీ సహా అందరూ తిట్టారు… ఇప్పటికైనా రేవంత్ రెడ్డి దీన్ని సీబీఐకి అప్పగిస్తే… కత్తి తన చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ మహా ఇదిగా ఉంది… రేప్పొద్దున బీఆర్ఎస్ విలీనం ప్రసక్తి వస్తే టరమ్స్ తను డిక్టేట్ చేయాలనేది బీజేపీ కోరిక… ఇది ఈటలకు సరిగ్గా అర్థమైనట్టు లేదు…

తీరా కమిషన్ కాళేశ్వరం అక్రమాలు, అవకతవకల బాధ్యుల్లో ఒకడిగా ఈటలను కూడా ఫిక్స్ చేసేసరికి… అసలే బీజేపీలో సంప్రదాయవాదులతో ఒత్తిడి, వ్యతిరేకతను ఎదుర్కొంటున్న తను ఇంకా డిఫెన్స్‌లో పడిపోయాడు… తనకు ఇది మైనసే…

అసలే తను హిందుత్వ వాది కాదు… కరడుగట్టిన బీజేపీ భావజాలంలో ఈరోజుకూ ఫిట్ కాలేకపోతున్నాడు… దీనికితోడు ఇప్పుడిక కాళేశ్వరం మరక… అకస్మాత్తుగా బండి సంజయ్‌కు అప్పర్ హ్యాండ్‌ వచ్చేసినట్టుంది…

నిజానికి ప్రస్తుతం బీజేపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరి బాట వాళ్లదే… ఓ టీమ్ వర్క్ లేకుండా పోయింది… కాస్త రాంచందర్‌రావు అధ్యక్షుడయ్యాక పాత ఏబీవీపీ, బీజేవైఎం బ్యాచులు మళ్లీ యాక్టివ్ అవుతున్నట్టు కనిపిస్తోంది… మరి ఈ పరిణామాలన్నింటినీ ఈటల ఎలా ఫేస్ చేస్తాడో చూడాలిక..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రజాదేవుళ్లు కదా కరుణించాల్సింది… వాళ్ల సేవ అవసరం కదా కేసీయార్..!!
  • వాట్ ఏ మ్యాచ్..! ఆశ్చర్యకరంగా గెలుపు… అదే మరి క్రికెట్ అంటే..!!
  • అసలే పార్టీలో ఈటల ఎదురీత… ఈలోపు కాళేశ్వరం రిపోర్ట్ షాక్…
  • కల్వకుంట్ల షర్మిలక్క..! పూర్తిగా దారితప్పిన బిడ్డ… ఫాఫం, కేసీఆర్..!!
  • ఆ పాటలో ఆమె చదువుతున్న ఆ పుస్తకం ఏమిటి..? 30 ఏళ్ల మిస్టరీ..!!
  • మరీ ఇది యండమూరి నవలా..? నిజమేమిటో తనే చెప్పాలిక…!!
  • కొత్త ఎఐ పంచాయితీ… కథలూ, క్లైమాక్సులూ మార్చేసి రీరిలీజులు…
  • కుకూ జాతిరత్నాలు… టీవీ సెలబ్రిటీలు సరదాగా రక్తికట్టిస్తున్నారు…
  • ఆ చెత్త మొహాల పారితోషికాల్ని కట్ చేయండి, వందల మంది బతుకుతారు…
  • యోగీ భాయ్… ఎవరో గానీ నిన్ను ముందుజాగ్రత్తగా తొక్కేస్తున్నారు భయ్యా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions