.
ఇంతకీ కాళేశ్వరం కమిషన్ ఏం తేల్చింది…? ప్రధాన బాధ్యుడిగా కర్త, కర్మ, క్రియ కేసీయారే అని తేల్చేసిన కమిషన్ చివరలో తన రిపోర్టులో ఏం చెప్పింది..?
జాతిపిత, తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు, అపర చాణుక్యుడు, అపర భగీరథుడు, నదికి కొత్త నడకలు నేర్పిన విశ్వ ఇంజీనర్ కేసీయార్ మాత్రమే కాళేశ్వరం బాగోతాలన్నింటికీ సూత్రధారి… నిన్ను అంతవాడిని చేసిన తెలంగాణ సమాజానికి ఇదా నువ్వు ప్రదర్శించిన కృతజ్ఞత దొరవారూ..,? ఇంత విశ్వాసఘాతుకం, , జాతిద్రోహం అవసరమా..?
Ads
రేపు తెలంగాణలో కాళేశ్వరం మీద తెలంగాణ భవన్‌లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడట… మేం శుద్ధపూసలం, మాకెలాంటి పాపమూ అంటలేదు, మేం తోపులం, మేం రత్నాలం, మేం జాతిరత్నాలం అని చెప్పుకుంటాడు, అంతేకదా… అవినీతి నిజం… అక్రమాలు నిజం… అవకతవకలు నిజం… ఆ ఇంజినీర్లను తంతేనే వందల కోట్లు రాలుతున్నయ్, ఇక అసలు పెద్ద తలకాయలు ఎంత సంపాదించి ఉంటారు..?
అసలు ప్రాణహిత- చేవెళ్లను బొందపెట్టి… డబ్బుల కోసం… అదీ అంతులేని సంపద కోసం… తెలంగాణ సమాజాన్ని దోచుకోవడం కోసం… తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, తన మీద పెట్టుకున్న ఆశల్ని సమాధి చేస్తూ… కాళేశ్వరం చేపట్టి, అమలు చేసిన తీరు నభూతో నభవిష్యతి…
కాళేశ్వరం కమిషన్ 600 పేజీల రిపోర్టు ఇస్తే, దాన్ని 60 పేజీలకు కుదించారు అధికారులు… అందులో చివరి పేజీ ఇదుగో…
దీనికి తెలుగు అనువాదం ఏమిటయ్యా అంటే… ఎఐ భాషలో… “సారాంశం: ఈ మొత్తం ప్రాజెక్ట్ ‘‘విపరీతమైన, విచ్చలవిడిగా, ఆర్థిక అవకతవకలతో కూడుకున్నది’’…
‘‘తెలంగాణ రాష్ట్రానికి జీవనాడిగా భావించబడిన కాళేశ్వరం ప్రాజెక్ట్, రాజకీయ నాయకుల వ్యక్తిగత నిర్ణయాలు, అనవసర ప్రభావం కారణంగా…, పాలన, ప్రణాళిక, సాంకేతిక పర్యవేక్షణ, ఆర్థిక క్రమశిక్షణలో తీవ్రమైన వైఫల్యాల వల్ల ప్రజా ధనం భారీగా వృథా అయింది…’’
నువ్వు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన తరుణం వచ్చింది కేసీయార్… తప్పించుకోలేవు… తప్పించుకుని ఎక్కడో అజ్ఞాతంగా దాగున్నా సరే తెలంగాణ సమాజం నీమీద పెట్టుకున్న నమ్మకాలు, ఆశలు భగ్నమై భగభగమంటోంది ఈ నిర్వాకాలు చూసి… ఈ నివేదిక చూసి…!!
ప్రాజెక్టులు, రాజకీయ నాయకులు, కంట్రాక్టులు, కమీషన్లు, అడ్డగోలుగా అవినీతి, అవకతవకలు, అక్రమాలు, ఆబగా మీదపడి మింగేయడం ఈ దేశంలో ఎక్కడా కొత్త కాదు… ఈ దేశం ఖర్మ… కానీ మరీ ఈ రేంజులోనా..? రేప్పొద్దున బనకచర్ల కూడా అంతేనంటావా..? చూద్దాం..!!
ఇప్పుడిక బీజేపీ హైకమాండ్ దీన్ని ఎలా వాడుకుంటుందో చూడాల్సి ఉంది.., వాళ్ల చేతికీ అస్త్రమే కదా… ఎమ్మెల్యేల కొనుగోలు నాటకంతో ఏకంగా పార్టీ జాతీయ కార్యదర్శినే జైలులోకి నెట్టాలని చూశాడు కదా కేసీయార్ అనే ఆర్టిస్టు… మోడీ, షా… పాతవన్నీ గుర్తున్నాయా..? జాతీయ స్థాయిలో బదనాం చేసిన దొరవారి ప్లాన్లు..!?
Share this Article