.
కొన్ని విషయాలు రాజకీయాలకు అతీతంగా విశ్లేషించుకోలేం… రాజకీయాలకు లంకె పెట్టకుండా ఉండలేం… అంతేకాదు, కొందరు ఏవేవో ముసుగులతో మేధావులుగా ఫేక్ మాస్కులతో చెలామణీ అవుతుంటే నిశ్చేష్టులమై ఉండిపోతాం కూడా…
ముందుగా ఓ పోస్టర్ చూడండి… గతి తప్పిన బీఆర్ఎస్ మేధావివర్గం సంకల్పించిన ఓ మేధో సమావేశం (??) బాపతు పోస్టర్… పెద్దగా జాలి కలగడం లేదు గానీ… మరీ పింక్ ఇంటలెక్చువల్స్ మరీ ఇలా దిగజారాలా అనే బాధ…
Ads
ఈరోజు ది గ్రేట్ ప్రకాశ్ రాజ్ ప్రముఖ వక్తగా… తెలంగాణ జాతిపిత కొత్తపల్లి జయశంకర్ స్మారకోపన్యాసం చేస్తాడట… ఇది ఆర్గనైజ్ చేస్తోంది తెలంగాణ వికాస సమితి… ఫాఫం… తను వైషమ్యాల సుడిలో వైవిధ్య భారతం అనే ఓ సంక్లిష్టమైన సబ్జెక్టు మీద జాతికి మార్గదర్శనం చేస్తాడట…
జాలి కలిగేది తనపై కాదు… సదరు ఆర్గనైజర్ల మీద… అదే బీఆర్ఎస్ కల్చరల్ వింగ్ మీద… ప్రకాశ్ రాజ్ అనైతిక, అరాచక సంబంధాలు వదిలేయండి, తను సీపీఎం బ్యాచ్… ఓ పర్వర్టెడ్ పర్సనాలిటీ… కేవలం బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి ప్రకాశ్ రాజ్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రేమించే జాబితాలో చేరాడా..? ఫాఫం…
తన మెదడే కురచ… పైగా అత్యంత ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్… సొసైటీ పట్ల ఏమాత్రం కన్సర్న్ లేదు, మన్నూమశానం ఏమీ లేదు… ఉత్తదే షో పుటప్… మా ఎన్నికల్లో కూడా సినీజనం తన్ని తరిమేశారు.,. అలాంటి కేరక్టర్ ఇప్పుడు బీఆర్ఎస్ మేధోవర్గంలో ఎలా చేరాడు..?
తను ఎలా మేధావి..? జాతి వైషమ్యాలు- వైవిధ్య భారతం మీద ప్రసంగించేంత సీన్ ఉందా తనకు..? ఫాఫం బీఆర్ఎస్… కాకపోతే ఇదే ప్రకాశ్ రాజ్ కేసీయార్‌కు ఒక దశలో సన్నిహితుడు… (ఎవడైనా స్వల్పకాలమే…)… అప్పట్లో కర్నాటక జేడీఎస్ గ్యాంగుకు కేసీయార్‌కు సంధాన కర్త… తరువాత ఉద్దవ్ ఠాక్రేకూ కేసీయార్ కూ నడుమ సంధాన కర్త…
సరే, ఈ సంధానాల వెనుక మర్మాలు, అనైతిక పొత్తులు, సహకారాల గురించి తరువాత చెప్పుకుందాంలే గానీ… ఈ ప్రోగ్రాంలో హరగోపాల్ పాల్గొంటున్నాడు… ఫాఫం, ప్రముఖ సామాజికవేత్త అనేది కరెక్టేనేమో గానీ.,. బీఆర్ఎస్ వేదికను పంచుకోవడం ద్వారా పదేళ్ల కేసీయార్ పాలనను, ప్రజాస్వామిక విలువల అణిచివేతను ఎండార్స్ చేస్తున్నావా సారూ… పిటీ…
రాష్ట్ర సీపీఎం కూడా ఓ క్లారిటీ ఇవ్వాలి… సోకాల్డ్ ప్రకాశ్ రాజ్ బీఆర్ఎస్ వేదికను పంచుకోవడం మీద… మీకు వోకేనా..? బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ బద్ధవ్యతిరేకత… సో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఏ సంబంధాలూ అక్కర్లేదని అంటున్నారా..? మరి మొన్న నవతెలంగాణ ఫంక్షన్‌కు రేవంత్‌రెడ్డిని ఎందుకు ఆహ్వానించినట్టు..? ఎందుకు రాసుకుని పూసుకుని తిరిగినట్టు… ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎవరు ప్రజల చెవుల్లో రఫ్లీషియా పూలు పెడుతున్నారు..!!
తెలుగుదేశం పార్టీకి ఓ సోషల్ స్ట్రాటజీ ఉంటుంది… తన సామాజికవర్గం కోణంలో కూడా… రకరకాల మేధోసంఘాలు, ప్రజాసంఘాల్లో కూడా తమవాళ్లను ఇంజక్ట్ చేస్తుంది, తనే స్టార్ట్ చేస్తుంది, తనే నడిపిస్తుంది… వాళ్లలోవాళ్లే వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తారు, ప్రధాన మీడియా కూడా వాళ్లదే కదా… ఓ దశ వచ్చాక అందరూ ఒకటే…
ప్రకాశ్‌రాజ్‌కు ఇది అర్థమయ్యేంత బుర్ర లేదు సరే… ఇదే బాటలో ఉన్న బీఆర్ఎస్ స్ట్రాటజీ హరగోపాల్‌కు అర్థం కాలేదా..? తనను తనే మరీ ప్రకాశ్ రాజ్ స్థాయికి దిగజార్చుకుంటున్నాడా ఫాఫం..!! మరీ శివసేన ఠాక్రేకు బ్రోకర్‌గా పనిచేసే ప్రకాశ్ రాజ్ స్థాయికి…. వాటీజ్ దిస్ ప్రొఫెసర్..!?
.
ఇంకా తను సిగ్గుపడాల్సింది ఏమిటంటే… మొదట హరగోపాల్ ఆహ్వానితుడు కాదు… ప్రకాష్ రాజ్ పోస్టర్ కింద నెటిజనం బూతులకు దిగడంతో… విధిలేక హరగోపాల్ పేరుపెట్టి కాస్త కవర్ చేసుకుంటోంది brs క్యాంప్… అర్థమైందా నీకు హరా గోపాలా…
Share this Article