నిన్న మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం…. ఒక జగన్, ఒక కేసీయార్, ఒక మమత, ఒక హిమంత్ బిశ్వ…. వీళ్లందరినీ కాంగ్రెస్ ఎలా చేజార్చుకున్నదో… ఎలా నష్టపోయిందో, ఇప్పటికీ బుద్ధిరాకుండా ఎలా ఉండిపోయిందో…!! కేసీయార్ తన టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సర్వసన్నద్దమైన స్థితిలో దిగ్గీరాజా అనే బుద్ధిహీనుుడు మొత్తం చెడగొట్టాడు… జగన్ ఇష్యూను చేజేతులా సోనియాయే సరిగ్గా టాకిల్ చేయలేదు… ఫలితం :: ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ దీనావస్థ..! మమతను అలాగే దూరమైంది… హిమంత్ కథ చదివాం కదా… ఈ వర్గం నేతలు రాహుల్ నివాసానికి వెళ్తే పెంపుడుకుక్కతో ఆడుకుంటూ వీళ్లను పట్టించుకోలేదు… ఫలితం :: తమకు కంచుకోట వంటి అస్సాం చేజారింది… ఇక చేతికి వస్తుందనే నమ్మకమూ లేదు… ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన మరో కేరక్టర్ పేరు… జ్యోతిరాదిత్య సింథియా…
అస్సోం సీఎంగా హిమంత్ బిశ్వ శర్మ ప్రమాణం అయిపోయాక… ఇప్పుడు అందరి దృష్టీ జ్యోతిరాదిత్య సింథియా మీదకు మళ్లింది…! తదుపరి సీఎం అతనేనా… ఎందుకంటే..? 1) ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి ఎదిగిన తనవాళ్లనే ఎంకరేజ్ చేయాలనే పిడివాదంలో లేదిప్పుడు బీజేపీ… కేసీయార్ భాషలో చెప్పాలంటే అహోబిలం మఠమేమీ కాదు, ప్యూర్ పొలిటికల్ పార్టీ… ఎవరు పనికొస్తారు..? ఎంతమేరకు పనికొస్తారు..? ఎలా పనిచేయించుకోవాలి..? అంతే… మొన్నటిదాకా అస్సోం సీఎంగా ఉన్న సోనోవాల్ గానీ, ఇప్పుడు సీఎం కుర్చీ ఎక్కిన హిమంత్ గానీ సంఘ్ పరివార్ ఉత్పత్తి కాదు… ఔట్ సైడర్స్… అస్సాం గణపరిషత్, కాంగ్రెస్ వర్కర్స్… అయితేనేం… ఈ అయిదేళ్లూ హిమంత్ను పరీక్షించింది… తను ప్రూవ్ చేసుకున్నాడు… ఈశాన్యం మొత్తాన్ని హైజాక్ చేసి, బీజేపీ దొడ్లో కట్టేశాడు… ఫలితం అస్సాం సీఎం పదవి… సేమ్, సింథియా… ఇప్పుడు పరీక్ష కాలంలో ఉన్నాడు… ఆల్రెడీ విధేయతను, పనితీరును కాస్త నిరూపించుకున్నాడు కూడా…
Ads
సేమ్, హిమంతుడిని వదులుకున్నట్టుగానే… సింథియాను వదులుకోవడంలోనూ రాహుల్ అపరిపక్వతే కారణం… రాజీవ్ గాంధీ, మాధవరావు సింథియా రిలేషన్స్ ఎలా ఉండేవో గానీ… రాహుల్, జ్యోతిరాదిత్య కూడా దోస్తులే కావచ్చు… కానీ రాహుల్ కథ, బాట వేరు కదా… అప్పటి సీఎం కమల్‌నాథ్ ప్రభుత్వం మీద సింథియా పలుసార్లు కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదులు చేశాడు… రాహుల్ గాంధీకి చెప్పాడు… సీఎం కావాలనే తన కోరికనూ పరోక్షంగా వెల్లడించాడు… కానీ రాహుల్ పట్టించుకోలేదు… వినిపించుకోలేదు… సరిగ్గా అక్కడ పట్టేసింది బీజేపీ సింథియాను… 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ శిబిరంలోకి వెళ్లిపోయాడు సింథియా… ఫస్ట్ టెస్టు పాసయ్యాడు… ఆ దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం కూలింది… పాత సీఎం చౌహాన్ మళ్లీ గద్దెనెక్కాడు… ఆయన సజావుగా గద్దెనెక్కడంతో సింథియా రెండో టెస్టు పాసయ్యాడు… ఉపఎన్నికలొచ్చినయ్… 22 మందిలో 15 మందిని మళ్లీ గెలిపించుకున్నాడు సింథియా… మూడో టెస్టు పాసయ్యాడు… కాకపోతే హిమంత్ మొత్తం ఈశాన్య బాధ్యతల్ని మోశాడు… సింథియా కేవలం మధ్యప్రదేశ్‌కే పరిమితం…
నిజానికి హిమంతుడితో పోలిస్తే సింథియాకు బీజేపీతో పరోక్ష సంబంధాలున్నయ్… సంఘ్ పరివార్‌తో మంచి సంబంధాలున్న రాజకుటుంబానికి చెందినవాడు తను… భార్య కూడా బరోడా రాజకుటుంబానికి చెందిన వ్యక్తే… జ్యోతిరాదిత్య తాత జివాంజీరావు హిందూ మహాసభ పట్ల సానుకూలంగా ఉండేవాడు… జ్యోతిరాదిత్య బామ్మ విజయరాజే సింథియా బీజేపీ మనిషే… జనసంఘ్ నుంచి బీజేపీగా ఏర్పడిన సంధికాలంలో మహారాజ పోషకురాలు ఆమె… జ్యోతిరాదిత్య ఆంటీల్లో వసుంధర బీజేపీ సీఎం మొన్నమొన్నటివరకూ… యశోధర మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఉండగా, ఆమె వారసుడు దుష్యంత్ సింగ్ బీజేపీ ఎంపీ… సో, పరిస్థితులు ఇలాగే సానుకూలంగా ఉంటే… రాబోయే రోజుల్లో సింథియా కల నెరవేరవచ్చు..!!
Share this Article