.
ఏదో ఉంది కేదారనాథ్ గుడిలో… ఆ నిర్మాణంలో, ఆ సన్నిధిలో… మనకు అర్థం కాని మిస్టరీ…
ఎస్, భారతీయ వాస్తు పరిజ్ఞానం మన గుళ్ల నిర్మాణంలో ఉంది… వందలేళ్లు అలా చెక్కుచెదరకుండా ఉన్న బృహదాలయాలు ఎన్నో… ఎన్నెన్నో…
Ads
ప్రత్యేకించి కేదారనాథ్… ఎవరు నిర్మించారనే వివరాలే సరిగ్గా తెలియవు… 8వ శతాబ్దం అంటుంటారు… అంటే ఈ గుడి వయస్సు 1200 ఏళ్లు దాటి… చెక్కుచెదరకుండా నిలిచిన మన ఓల్డ్ ఆర్కిటెక్చర్ నాలెడ్జికి శిఖరమెత్తు ప్రతీక…
అసలు ఆ గుడి నిర్మాణస్థలమే ఓ మిస్టరీ… దాన్ని ఎందుకు ఎంచుకున్నారు అప్పటి నిర్మాణ స్థపతులు అనేది మిస్టరీ… ఈరోజుకూ అది గుడి నిర్మాణానికి ప్రతికూలమైనదే… ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్‌నాథ్ కొండ… మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో కరచ్‌కుండ్…
మూడో వైపు 22,700 అడుగుల ఎత్తులో భరత్‌కుండ్ ఉన్నాయి.. ఈ మూడు పర్వతాల గుండా ప్రవహించే ఐదు నదులు మందాకిని, మధుగంగ, చిర్గంగ, సరస్వతి, స్వరందరి…
చలికాలంలో విపరీతమైన మంచు కురిసే చోటు… వర్షాకాలంలో నీరు అతి వేగంతో ప్రవహించే ప్రదేశం… అది ప్రవాహ స్థలి… ఈరోజుకూ మనం అక్కడికి వాహనాల్లో వెళ్లలేం…
మరి అంతటి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా కట్టారు…? కేదారనాథ్ దేవాలయంలోని రాళ్లపై లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షను నిర్వహించినప్పుడు… దానిలో 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని పరీక్షలో తేలిందట…
ఐనా సరే గుడి చెక్కుచెదరలేదు… 2013లో కేదారనాథ్‌ను తాకిన విపత్కర వరద చూశాం కదా… సగటుకంటే 375 % ఎక్కువ వర్షపాతం నమోదైంది… చాలా మంది మరణించారు… పలు పరిసర గ్రామాలు దెబ్బతిన్నాయి…
మన ఎయిర్‌ఫోర్స్ దాదాపు లక్ష మందిని రక్షించింది.,. అంతా అతలాకుతలం… ఆ వరదలు తగ్గిన తరువాత చూస్తే… 1200 సంవత్సరాల తరువాత, ఆ ప్రాంతం లోనికి బయటి నుండి తరలించబడిన ప్రతిదీ తుడుచుకుపెట్టుకు పోయింది… ఒక్క నిర్మాణం కూడా నిలబడలేదు…కానీ ఈ ఆలయం మాత్రం ఓ స్థిరశిఖరంలా నిలబడే ఉంది…
అంత దృఢమైన కట్టడం మన వాస్తు జ్ఞానం… కేదార్‌నాథ్ ఆలయాన్ని “ఉత్తర- దక్షిణ”గా నిర్మించారు… దేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు “తూర్పు- పశ్చిమ” దిశలో ఉంటాయంటారు… అన్ని గుళ్లలాగే దీన్నీ నిర్మించి ఉంటే ఇలా ఉండేది కాదేమో…
అందరికీ ఆశ్చర్యం ఏమిటంటే… గుడి నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యమయ్యేరకం కాదు… ఎక్కడి నుంచో తెచ్చారు… అక్కడికి ఎలా తెచ్చారు..? ఎలా పేర్చారు అనూహ్యం.,. సిమెంట్ అప్పటికి లేదు సరే, కానీ అనేక గుళ్లకు వాడిన పద్ధతి గాకుండా ‘ఆష్టర్’ పద్ధతి వాడినట్టు చెబుతారు…
పుష్కరం క్రితం వరదల్లో ఓ మహత్తు తెలిసిందే కదా… ఓ పెద్ద బండరాయి (భీమశిల) ప్రవాహంలో కొట్టుకొచ్చి, సరిగ్గా గుడి వెనుక ఆగిపోయి, వరద ప్రవాహం గుడికి తగలకుండా అడ్డుపడింది… తనను తాకి వరద ఇరువైపులా చీలి, గుడికి ఏ నష్టం రాకుండా కాపాడింది… అందుకే అనేది, కేదారనాథ్‌లో ఏదో ఉంది… మనకు అంతుపట్టనిది… మనం నమ్మనిది..!!
Share this Article