.
రాజకీయ నాయకుడు ఎక్కడున్నా ఒకటే టైపు… హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎక్కడున్నా తమ దర్పాన్ని ప్రదర్శించడానికి వెనుకాడరు… అది అమెరికా అయినా అంతే, ఇండియా అయినా అంతే…
ఈమధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అవును, మన తెలుగింటి అల్లుడే… తన బర్త్ డే సందర్భంగా ఓహియోలో కయాకింగ్ కోసం (చిన్న బోటులో (కయాక్) డబుల్ బ్లేడ్ తెడ్డుతో ప్రయాణించడం) ఫ్యామిలీతో వెళ్లాడు… దీనికి లిటిల్ మయామి నదీప్రవాహాన్ని పెంచమని అధికారులను ఆదేశించింది తన టీమ్… వాళ్లు పాటించారు…
Ads
ఇదేమిటయ్యా, అధికార దుర్వినియోగం అని ఎవరో అడిగితే… భద్రతా కారణాల రీత్యా, తన సేఫ్టీ కోసం ప్రవాహం ఎత్తు కాస్త పెంచాల్సి వచ్చిందని తన టీమ్ బదులిచ్చిందట… తక్కువ ఎత్తు సేఫ్టీ కానప్పుడు, అందులో కయాకింగ్ దేనికి మరి..?
దీనిపై సోషల్ మీడియా నెగెటివ్‌గా రియాక్ట్ కాగా, ఎక్కువ మాట్లాడి గోక్కోవడం దేనికని వాన్స్ ఆఫీసు సైలెంటుగా ఉండిపోయింది… గుడ్ డెసిషన్… అయితే ఇది చదువుతుంటే మన కర్నాటకలో ఓ ఉదాహరణ గుర్తొచ్చింది…
ఇది 2021 నాటిది… అప్పటి కర్నాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్… తను కేలాడి శివప్ప నాయక వ్యవసాయ మరియు ఉద్యానవన శాస్త్రాల విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వెళ్తూ పనిలోపనిగా మధ్యలో జోగ్ జలపాతాన్ని చూడాలని అనుకున్నాడు…
జోగ్ జలపాతం తెలుసు కదా… వరద ఉధృతి బాగా ఉన్నప్పుడు అది నయాగారాను తలపిస్తుంది… దానికి ఎగువన ఓ డ్యామ్ కట్టారు, ఓ హైడల్ ప్రాజెక్టు కట్టారు… వరద నీటి నియంత్రణ ఉంటుంది… దాంతో ఈ జలపాతం తన సహజ ఆకర్షణను కోల్పోయింది… మరీ భారీ వర్షాలు వచ్చినప్పుడు తప్ప…
మరి గవర్నర్ వస్తుంటే, తను జోగ్ జలపాతాన్ని సందర్శించాలని అనుకుంటే.,. మరీ నీటిప్రవాహం లేకపోతే ఏం మర్యాద అనుకున్నట్టున్నారు… ఎగువన ఉన్న డ్యామ్ గేట్లు తెరిచి నీళ్లు వదిలారు… ఆయన నైట్ స్టే కూడా అక్కడికి దగ్గరలో ఉన్న ఇన్‌స్పెక్షన్ బంగ్లాలోనే… దాన్ని బ్రిటిష్ బంగ్లా అంటారు… పొద్దున దీన్ని చూసి, యూనివర్శిటీకి వెళ్లాలని ప్లాన్…
ట్విస్ట్ ఏమిటంటే..? వదిలిన ఆ నీరు జలపాతం చేరకముందే ఆయన టైమ్ అయిపోతుందని అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు… ఏమయ్యా, ఇలా చెప్పాపెట్టకుండా నీళ్లు వదిలితే దిగువ ప్రాంతాల ప్రజలకు ప్రమాదం కదా అని ఎవరో అడిగితే షిమోగా ఉన్నతాధికారి ‘‘అబ్బే, మరీ కొద్దిమొత్తంలోనే నీళ్లు వదిలాం’’ అని సమర్థించుకున్నాడట… సో, అమెరికా జేడీ వాన్స్ అయినా, మన గవర్నర్ గెహ్లాట్ అయినా… ప్రోటోకాల్ మర్యాదలు సేమ్ సేమ్…!!
Share this Article