Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ట్రంపు… డబ్బు కక్కుర్తి మాత్రమే… నో ఎమోషన్స్, నో మోరాలిటీ…!!

August 12, 2025 by M S R

.
డొనాల్డ్ ట్రంప్… ఈ 79 ఏళ్ల అమెరికన్ ఇప్పుడు భారతీయులకే కాదు… ప్రపంచ దేశాలకే పెద్ద టెర్రర్ ఇప్పుడు… ఒక్క పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌కు తప్ప..! తన వ్యక్తిగత జీవితం అంతా రోత… బోలెడు కథలు… వావీ వరుసలూ పట్టని కూతలు, చేతలు… కేసులు కూడా…

తనకు డబ్బు కావాలి… తనొక ఫుల్ టైమ్ వ్యాపారి, జస్ట్ పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడు… మొన్నీమధ్య ఇంగ్లిష్ మీడియాలో కనిపించిన ఓ వార్త మరీ పీక్స్ అనిపించింది… తనకు ఎమోషన్సూ మన్నూమశానం ఏమీ ఉండవనీ అర్థమైంది…

2022లో తన మాజీ భార్య ఇవానా మరణించినప్పుడు, ఆమెను స్మశానవాటికలో కాకుండా, న్యూజెర్సీలోని డొనాల్డ్ ట్రంప్ బెడ్‌మినిస్టర్ గోల్ఫ్ కోర్స్‌లోని మొదటి హోల్ దగ్గరే సమాధి చేశారు… ఇది వ్యక్తిగత నిర్ణయం లాగానే కనిపించినా, అది ఎమోషన్ కాదు, పక్కా ఓ పన్ను ఎగవేత, డబ్బు కక్కుర్తి యవ్వారం అనే వార్తలు వస్తున్నాయి…

Ads

ఇవానా, 73 ఏళ్ళ వయసులో, న్యూయార్క్ మాన్‌హాటన్‌లోని తన ఇంట్లో పడి, గాయాలతో మరణించింది… చాలామంది ప్రముఖులలాగా కాకుండా, ఆమె సమాధికి ఎటువంటి కంచె, పబ్లిక్ స్మారక చిహ్నం లేకుండా, మొదటి హోల్ పక్కనే ఒక సాదాసీదా శిలాఫలకమే ఉంది ప్రస్తుతం… అక్కడ పాతిపెట్టబడిన ఏకైక వ్యక్తి ఆమెనే…

న్యూజెర్సీ రాష్ట్ర పన్నుల చట్టం ప్రకారం.., “స్మశానవాటిక” కోసం కేటాయించిన భూమి అన్నిరకాల పన్నులు,  లెవీల నుంచి మినహాయింపు పొందుతుంది… స్మశానవాటిక సంస్థలకు రియల్ ఎస్టేట్ పన్ను, వ్యక్తిగత ఆస్తి పన్ను, వ్యాపార పన్ను, సేల్స్ టాక్స్, ఆదాయ పన్ను, వారసత్వ పన్ను — అన్నింటి నుంచీ మినహాయింపు ఉంటుంది…

ఒకే ఒక్క సమాధి కూడా ఆ భూమిని చట్టబద్ధంగా ‘పన్నురహిత భూమి’ (tax-exempt cemetery) గా మార్చగలదు… న్యూజెర్సీ చట్టంలో ఉన్న ఈ మినహాయింపును ఉపయోగించుకోవడానికి, ట్రంప్ ఆ గోల్ఫ్ కోర్స్ భూమిని “లాభాపేక్షలేని స్మశానవాటిక సంస్థ”గా రిజిస్టర్ చేశారని అమెరికన్ సోషల్ మీడియా పేర్కొంటోంది… ఈ రిజిస్ట్రేషన్‌తో ఆ స్థలపు పన్ను స్థితి మారి, మొత్తం ఆస్తి పన్నుల నుండి మినహాయింపు పొందే అవకాశం ఏర్పడింది…

ట్రంప్ నిశ్శబ్దంగా ఈ భూమిని నాన్‌ప్రాఫిట్ సెమెటరీ కంపెనీగా నమోదు చేశాడు… ఒక సమాధి… అంతే, మొత్తం గోల్ఫ్ కోర్స్‌కు పన్ను మినహాయింపులు… కోట్ల రూపాయల పన్ను ఆదా… క్లబ్‌హౌస్‌కి 150 అడుగుల దూరంలో, గోల్ఫ్ మొదటి హోల్ పక్కనే ఇది ఒక లీగల్ లూప్‌హోల్…

ఇది కేవలం ఒక సమాధి గురించి కాదు… ధనవంతులు, ట్రంపు వంటి వ్యాపారులు సాధారణ ప్రజలు ఎప్పుడూ గుర్తించని చట్టాలను ఎలా ఉపయోగించుకుంటారో చెప్పే పాఠం… చట్టంలోని లూప్ హోల్స్ వాడుకోవడానికి వాళ్లు నైతికతను, భావోద్వేగాలను వదిలేస్తారు…

నిజానికిట్రంప్ ఫ్యామిలీ ట్రస్ట్ ఒకసారి ఈ బెడ్‌మినిస్టర్ గోల్ఫ్ కోర్స్‌కు 20 మైళ్ళ దూరంలో ఉన్న న్యూజెర్సీ హాకెట్‌స్టౌన్‌లోని భూమిని కూడా నాన్‌ప్రాఫిట్ స్మశానవాటిక సంస్థగా గుర్తించడానికి ప్రయత్నించింది… కాలక్రమేణా బెడ్‌మినిస్టర్ గోల్ఫ్ కోర్స్‌కి సంబంధించిన ట్రంప్ ఆలోచనలు కూడా మారాయి…

మొదట ట్రంప్ తన కోసం అక్కడ ఒక మౌసోలియం (స్మారక గృహం) నిర్మించాలనుకున్నాడు… తరువాత, 1,000కి పైగా సమాధులు ఉండే స్మశానవాటిక ఏర్పరచే ప్రణాళిక చెప్పాడు… తరువాత 10 సమాధులు మాత్రమే ఉండే చిన్న ప్రైవేట్ ఫ్యామిలీ సెమెటరీ ప్రతిపాదించాడు… ఆ తరువాత, 284 సమాధులు అమ్మకానికి పెట్టే పెద్ద సెమెటరీ ప్రణాళిక రూపొందించాడు…

సహజంగానే మీడియా రిపోర్టులను ట్రంప్ ఖండించాడు… 525 ఎకరాల తన ఆస్తిలో, తన ఖరీదైన, అందమైన భూమిలోనే ఆమెను ఖననం చేయాలనేది తన కోరికగా వ్యక్తీకరించాడు… చెబుతాడు, తను ఏదైనా చెప్పగలడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బేరసారాల్లో మానవత్వం ఉండదు… మానవత్వంలో బేరసారాలు ఉండకూడదు…
  • కొత్త ఉప రాష్ట్రపతిగా ఆర్ఎస్ఎస్ మార్క్ శేషాద్రి రామానుజా చారి..?
  • ఈ గుడికి వెళ్లొచ్చిన కొన్నాళ్లకే ఇందిర హత్య… మరి మోడీ సందర్శన…?!
  • Run Away… విమానాలన్నాక ఎదురెదురుగా రావా ఏమిటి..?
  • మైక్రోబరస్ట్..! కుండపోత కాదు, ఇది పైనుంచి కమ్మేసే ఓ సునామీ..!!
  • జీతెలుగు టీవీ సీరియల్ తీసేవాడికి చూసేవాడు పరమ లోకువ..!!
  • సీఎం స్వయంగా ఓసారి టాలీవుడ్ యవ్వారాలపై దృష్టిపెట్టడం బెటర్..!!
  • 70 ఏళ్ల వయస్సులోనూ యంగ్‌గా, ఆరోగ్యంగా… భలే తల్లి..!!
  • ట్రంపు… డబ్బు కక్కుర్తి మాత్రమే… నో ఎమోషన్స్, నో మోరాలిటీ…!!
  • రీఎంట్రీ సరే గానీ… కుర్ర వేషాలకు సూటయ్యే సీన్ లేదయ్యా నవీనూ..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions