.
ఎప్పట్నుంచో ఓ డౌటనుమానం… సరే, ప్రతి టీవీ సీరియల్ నిర్మాతకు… అనగా తీసేవాడికి చూసేవాడు లోకువ… మరీ మహిళా ప్రేక్షకులను ఎడ్డోళ్లను చేసి, వాళ్లను పిచ్చెదవలుగా జమేసి… నానా చెత్తా వదులుతుంటారు…
తెలుగు సినిమాలలో ఉన్నట్టే లాజిక్‌రహిత సీన్లు, కథలు సీరియళ్లలోనూ… ఎర్రగడ్డ, వైజాగ్ పిచ్చాసుపత్రులకు… ప్రైవేటు సైకియాట్రిస్టుల దగ్గరకు కేసులు పెరుగుతున్నాయీ అంటే… పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నవీ అంటే… సొసైటీని పొల్యూట్ చేస్తున్నాయంటే… ప్రస్తుతం సినిమాల తరువాత సీరియళ్లే…
Ads
ఐతే… స్టార్‌మా సీరియళ్లు కూడా అదే బాపతు కదా.,. మరి వాడి సీరియళ్లకు రేటింగ్స్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయీ, జీతెలుగు వాడికి ఎందుకు తక్కువ వస్తున్నాయి అనేది చాన్నాళ్లుగా ఉన్న డౌటనుమానం…
అనుకోకుండా చామంతి అనే సీరియల్ చూడబడ్డాను… ఫాఫం హీరోయిన్ కాస్త చూడబుల్ ఫేసే… మేఘన అనుకుంటా… హీరో కూడా అంతే… పేరు తెలియదు… కానీ అందగాడు… అన్ని సీరియళ్లలో కోడళ్లను పీడించి, ఎప్పుడు చంపేద్దామని ప్లాన్లేసే అత్తలు, తోడుగా ఆడపడుచులు కదా… ఇందులో ఓ పనిమనిషి మీద పగ… తిక్క కథ…
అసలే జగద్ధాత్రిలో మాస్కులు వేసుకుంటే చాలు హీరోహీరోయిన్లను ఎవడూ గుర్తించడు… పాత సినిమాల్లో చెంప మీద ఫేక్ పులిపిరి పెట్టుకోగానే ఎవడూ కనిపెట్టనట్టు…! జనం పిచ్చోళ్లు… అంతకుముందు త్రినయని సీరియల్ మరీ ఘోరం… ప్రేమ ఎంత మధురం మరీ దారుణం… చెప్పుకుంటే దాదాపు జీతెలుగు సీరియళ్లన్నీ అదే నాసిరకం కథలు, అవే చానెల్‌కు పెద్ద శాపం…
సో, సమస్య జీతెలుగు క్రియేటివ్ టీమ్ దరిద్రం అన్నమాట… స్టార్ మా సీరియళ్లు నయమని కాదు, కాకపోతే జీతెలుగు సీరియళ్లతో పోలిస్తే వీసమెత్తు బెటర్ అన్నమాట… సరే, ఉదాహరణకు చామంతి గురించి చెప్పుకుంటున్నాం కదా…
మామూలుగా పెద్ద పెద్ద మాల్స్‌లో, ఎయిర్‌పోర్టుల్లో, వీవీఐపీల ఫంక్షన్ల దగ్గర మెటల్ డిటెక్టర్స్ పెడతారు… అవి పేలుడు పదార్థాలో, నిషిద్ధ మెటల్ వస్తువులు అంటే కుయ్ కుయ్ అంటాయి… మాల్స్‌లో, పోర్టుల్లో బ్యాగేజీ స్కానర్లు కూడా ఉంటాయి, నిషిద్ధ వస్తువులు ఉంటే కనిపెడతాయి…
కానీ చామంతి సీరియల్‌లో సదరు రచయిత ఎవరో గానీ… నీకు నమోనమః ధర్మాత్మా… అదేదో దిక్కుమాలిన మాల్‌లో ఓ డిటెక్టర్ అట… అది బిల్లులో ఉన్న సరుకులను వదిలేసి బిల్లులో లేని సరుకులను పట్టుకుంటుందట… వావ్, నువ్వు గొప్పోడివిరా స్వామీ… సీరియళ్లు చూసే మహిళా ప్రేక్షకుల ఎడ్డితనం మీద నీకెంత నమ్మకంరా బాబూ…
హీరో వచ్చి నో నో, ఆ రశీదు నా దగ్గరుంది అంటాడట… మరి ఆల్రెడీ బిల్లు చేసిన చీరె బ్యాగులో ఉంటే తప్పుగా ఎందుకు చూపించింది సోకాల్డ్ అన్‌బిల్డ్ సరుకుల డిటెక్టర్..? ఎవడో ఏదో రాస్తాడు, ఎవడో తీస్తాడు… అందుకే మహిళలు కూడా వెబ్ సీరీస్ వైపు వేగంగా టర్న్ అయిపోతున్నారు… బూతులు, అశ్లీలం ఉన్నా సరే…
అవును మరి… ఈ మెంటల్ సీరియళ్లకన్నా వెబ్ సీరీస్ చాలా చాలా నయమే కదా… ఎస్, మరోసారి చెప్పుకుందాం… టీవీ సీరియళ్లు తీసేవాడికి చూసేవాడు పరమ లోకువ..!!
Share this Article