Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వరల్డ్ ఫేమస్ గాంజాకు అడ్డా… అలెగ్జాండర్ ది గ్రేట్ సైనికుల వారసులు…

August 15, 2025 by M S R

.

హిమాలయాల్లో మంచుతో కప్పబడిన కొండల మధ్య మలానా అనే గ్రామం… ఇక్కడి ప్రజలు బయటి ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు… ఈ గ్రామం వారి ప్రాచీన సంప్రదాయాలు, ప్రత్యేకమైన భాష.. వాళ్ల చట్టం వాళ్లదే..,

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, స్వచ్ఛమైన గంజాయికి ప్రసిద్ధి ఆ ఊరు… దాని పేరే మలానా క్రీమ్… దేశవిదేశాల నుంచీ వస్తుంటారు… తమను వేరేవాళ్లు తాకడానికి కూడా ఇష్టపడరు… ఎవరూ అక్కడ ఉండటానికి కూడా సమ్మతించరు… నిజమా..?

Ads

నిజమే… కానీ ఒకప్పుడు… కాలం ఎవరినైనా మారుస్తుంది కదా.,. ఈ నమ్మకాలు, ఈ ప్రచారాలు విని ఓ పలుసార్లు వెళ్లాడు… ఈ గ్రామాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు ప్రయాణించాడు…

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాషీష్

మలానా క్రీమ్‌ తయారు చేయడానికి ఈ గ్రామ ప్రజలు తమ అరచేతుల్లో గంజాయి ఆకులను గట్టిగా రుద్దుతారు… ఈ విధంగా తీసిన రెజిన్‌ను హ్యాషీష్ అని పిలుస్తారు… దీనికి అధిక డిమాండ్ ఉంది… రుద్దీ రుద్దీ వాళ్ల చేతులు ఇలా తయారవుతాయి…

malana

ఫోటో జర్నలిస్ట్ హరి కాట్రగడ్డ 2008లో ఇవన్నీ విన్నాడు… అందుకే దాని గురించి ఆసక్తిని పెంచుకున్నాడు… 2009లో అతను మొదటిసారి అక్కడికి వెళ్లారు. కానీ అతను ఒక కస్టమర్‌గా కాకుండా మిత్రుడిగా వారితో మాట్లాడాడు…

ప్రత్యేకమైన భాష, ఆచారాలు

మలానా ప్రజలు కనాషి అనే విభిన్నమైన భాషను మాట్లాడుతారు… ఈ భాషలో టిబెటన్ భాష పదాలు మిక్స్… బయటి వాళ్లు తమను తాకడానికి, స్నేహం చేయడానికి, బయటివాళ్లతో పెళ్లిళ్లకు గానీ ఎందుకు ఒప్పుకోరూ అంటే… ఇక్కడి ప్రజలు అలెగ్జాండర్ ది గ్రేట్ సైనికుల వారసులమని నమ్ముతారు…

ఆ ప్యూరిటీని కోల్పోకూడదని ఇన్ని ఆంక్షలు… నిజానికి అలాగ్జాండర్ వారసులని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు… ఆ ఫోటో జర్నలిస్ట్ వారికి బాగానే దగ్గరయ్యాడు… వారితో నివసించాడు, తిన్నాడు, వాళ్ల  వేడుకలకు కూడా వెళ్లాడు… కానీ బయటి వ్యక్తులు వెళ్లకూడని కొన్ని పవిత్రమైన ప్రదేశాలు ఇంకా ఉన్నాయి… అక్కడికి మాత్రం ఇప్పటికీ ఎవరినీ రానివ్వరు…

 

malana

జీవనాధారం

ఈ గ్రామ ప్రజలు ఈ అరుదైన గంజాయిని ఒక దైవిక బహుమతి అని నమ్ముతారు… 1980ల వరకు దానిని తమ స్వంత వినియోగం కోసం మాత్రమే పెంచుకునేవారు… ఆ తరువాత అది వారి జీవనాధార వనరుగా మారింది…

దీనికి కారణం అక్కడ వేరే ఏ పంటలైనా పండించడం చాలా కష్టం… హ్యాషీష్ తయారు చేసి అమ్ముకోవడం లేదా గంజాయి మొక్కల నుండి బుట్టలు, చెప్పులు వంటివి తయారు చేసి అమ్ముకోవడం ద్వారా వారు జీవించేవారు…

కులు జిల్లా నుంచి ట్రెక్కింగ్ చేస్తూ వేలాది మంది సందర్శకులు మలానాకు చేరుకునేవాళ్లు… ఆ గంజాయి అంత ఫేమస్ మరి…

malana

చట్టం కఠినంగా మారిన తర్వాత

1985లో భారతదేశ ప్రభుత్వం NDPS చట్టం కింద గంజాయిని అక్రమమని ప్రకటించింది… దీంతో మలానా ప్రజల జీవనం ప్రమాదంలో పడింది… పోలీసులు గంజాయి పంటలను నాశనం చేయడానికి ప్రయత్నించారు… దీని కారణంగా చాలా కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయి…

ఒక తండ్రి ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నాడు.., అతని భార్య గంజాయి అమ్ముతుండగా పోలీసులు అరెస్టు చేసి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారని ఫోటో జర్నలిస్ట్ చెబుతున్నాడు… అసలు బయటి వ్యక్తులనే తాకని, ఊళ్లోకి రానివ్వని గ్రామస్థుల్లో ఒకరు ఏకంగా జైలులోకి వెళ్లాల్సి వచ్చింది…

మలానా ప్రాచీన ప్రజాస్వామ్యం

మలానా ఒక ప్రాచీన ప్రజాస్వామ్య పాలన వ్యవస్థను కలిగి ఉంది… పెద్దల మండలి వారి వివాదాలను పరిష్కరిస్తుంది… వారికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు… గొర్రెలను ఉపయోగించి వివాదాలు పరిష్కరించేవారు… అదో పిచ్చి పద్ధతి… కక్షిదారుల గొర్రెలకు విషాన్ని పెట్టి, ఏ గొర్రె మొదట చనిపోతుందో దాని యజమాని అబద్ధం చెప్పినట్లుగా నిర్ణయించేవారు…

malana

ఆధునిక ప్రభావాలు

కొత్త రహదారి, జలవిద్యుత్ ప్రాజెక్టు వల్ల ఈ గ్రామానికి బయటి ప్రపంచంతో సంబంధాలు పెరిగాయి… కరెంటు వచ్చింది, కేబుల్ టీవీలు వచ్చాయి… యువత స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తూ బయటి ప్రపంచంతో ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు… ఇది పర్యాటకాన్ని పెంచింది… ఊరినీ మార్చేస్తోంది వేగంగా…

కానీ దాని వల్ల వారి సంప్రదాయాలు, నమ్మకాలు నెమ్మదిగా మారుతున్నాయి… ఉదాహరణకు, బయటి వ్యక్తులతో వివాహాలు నిషేధించబడినప్పటికీ, ఇప్పుడు కొందరు ఆ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు…

మలానా

పోలీసులు ఎంట్రీ ఇస్తే అంతే మరి 

“నేను చివరిసారిగా ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు, ఈ ప్రాంతంలో పెరిగే గంజాయి పంటలను నాశనం చేయడానికి పోలీసులు చేపట్టిన ప్రచారాన్ని చూశాను, ఈ పంటలను తగలబెట్టడం లేదా నరికివేయడం వంటి పోలీసు ప్రచారాలు ఈ ప్రాంతంలో ఒక సాధారణ లక్షణంగా మారాయి, అధికారులు చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేయడంతో సాగుదారులు, సందర్శకులు మలానా నుండి పదార్థాలను తీసుకెళ్లడం కష్టతరం అయింది…

ఐతే ఈ సమాజాన్ని గంజాయి నుండి విముక్తి చేయడానికి అధికారులు చేసిన అనేక ప్రయత్నాలు ఫలించలేదని’’ ఆ ఫోటో జర్నలిస్టు కాట్రగడ్డ అంటున్నాడు… “ఆ ప్రాంతంలోకి నేను చివరిసారి వెళ్లినప్పుడు ఒక పోలీసు అధికారి ఉన్నాడు, అతను టీ తోటలను పండించమని కమ్యూనిటీని ఒత్తిడి చేయడానికి ప్రయత్నించాడు… కానీ ఫలించలేదు…” అని అతను చెప్పాడు…

గంజాయిని మొదట నిషేధించి, అంతర్జాతీయంగా అంతటా నిషేధించేలా చేసిన ఆ అమెరికాలోనే అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు గంజాయి చట్టబద్ధం… ఇండియా మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయింది… అత్యంత అరుదైన గంజాయి పండే మలానా వంటి గ్రామాల్ని ఈ చట్టం నుంచి మినహాయిస్తే..? ఆ ఊరి కథే మారిపోతుంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గుడ్లగూబ కళ్లతో అదరగొట్టేస్తయ్… ఈ జీవులేమిటో తెలుసా..?
  • వరల్డ్ ఫేమస్ గాంజాకు అడ్డా… అలెగ్జాండర్ ది గ్రేట్ సైనికుల వారసులు…
  • పులివెందుల… అప్పటి వైఎస్సూ లేడు, అప్పటి చంద్రబాబూ కాడు…
  • 74 ఏళ్లొచ్చినా… రజినీలో అదే స్టయిల్… అదే ఎనర్జీ… దీనికీ అదే ప్రాణం…
  • ఉద్యమ సంధానకర్తగా రేవంత్ గౌరవించాడు కాబట్టి… బీఆర్ఎస్ ట్రోలింగ్..!!
  • War-2 review ….. జూనియర్ ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది…!!
  • ఇవే వీథికుక్కల గాట్లకు చిన్నారులు మరణిస్తే… ఒక్క గొంతూ ఏడవలేదు…
  • కేసీయార్ చేస్తే సరస శృంగారమట… ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారమట..?!
  • హార్డ్‌వర్క్ ఎవరిక్కావాలి… లక్కు కావాలి… లేదంటే ఏవో గిమ్మిక్కులు…
  • మయసభ… బాబు- వైఎస్ రాజకీయాల సీరీస్‌లో కొన్ని సీన్లపై ఆక్షేపణ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions