Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆపరేషన్ సిందూర్‌లో 155 మంది పాకిస్థాన్ జవాన్ల బలి..!?

August 16, 2025 by M S R

.

ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్థాన్ ఏం చెప్పింది..? ‘‘‘ఇండియన్ ఫైటర్లను కూల్చేశాం, మేమే గెలిచాం, ఇండియా వెనక్కి తగ్గింది…’’

ఆ తరువాత కూడా అమెరికా వెళ్లి, మేం కూలిపోయే స్థితి వస్తే సగం ప్రపంచాన్ని తీసుకుపోతాం, ఇండియా మీద అణుబాంబులు వేస్తాం, సింధు డ్యామ్ కడితే క్షిపణులతో పేల్చేస్తాం, అంబానీ జామ్‌నగర్ రిఫైనరీ కూల్చేస్తాం… వంటి చాలామాటలు మాట్లాడుతోంది పాకిస్థాన్…

Ads

నిజానికి ఆపరేషన్ సిందూర్‌లో 155 మంది పాకిస్థానీ సైనికులు హతమారిపోయారట… ఉగ్రస్థావరాల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యకు ఇది అదనమో కాదో తెలియదు… ఫ్రీప్రెస్ జర్నల్ కథనం ప్రకారం… పాకిస్థానీ మీడియా హౌజ్ ఒకటి ఇది రిపోర్ట్ చేసింది… తరువాత ఏమైందో గానీ డిలిట్ చేసింది… (సమా టీవీ..?)

కానీ ఆ వార్త స్క్రీన్ షాట్స్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమై వైరల్ అయిపోతున్నయ్… ఇప్పుడు తొలగించబడిన వార్తా కథనంలో పాకిస్తాన్ అధ్యక్షుడు “ఆపరేషన్ బన్యానున్ మార్సూస్ సమయంలో కనబరిచిన ధైర్యం, అత్యున్నత త్యాగం” పేరిట ప్రదానం చేసిన శౌర్య పురస్కారాల జాబితా కూడా ఉంది… ఆపరేషన్ బన్యానున్ మార్సూస్ అనేది పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారతదేశం జరిపిన దాడులకు ప్రతీకార చర్యకు కోడ్ నేమ్…



⚡ Exclusive ⚡

– List of 155 Pakistan 🇵🇰 Armed Forces Soldiers killed in Indian 🇮🇳 Strikes during Operation Sindoor 😯

– Then, how on Earth Pakistan's PM said, 'they won the War' 😲 Seems like Pakistan is living in delusion 🤐

Image by – @OsintTV pic.twitter.com/1C4m2F9sgg

— Richard Kettleborough (@RichKettle07) August 16, 2025



అందరి పేర్ల తరువాత షహీద్ అని, ఆర్మీ అని కూడా రాశారు… (అమర జవాన్)… ఈ ‘ఇంతియాజీ సనద్’ జాబితాలో 146 పేర్లున్నయ్… మరో 45 మంది ‘తమ్‌గా ఇ బసాలత్’ జాబితాలో ఉన్నారు… మరో నలుగురు తెలియదు… సరే, సహజంగానే దీనిపై పాకిస్థాన్ అధికారికంగా ఏమీ స్పందించడం లేదు… స్పందించదు కూడా…

1999 కార్గిల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ తన సైనికులు కొందరి మృతదేహాలను వదిలిపెట్టింది… తరువాత, పొరుగు దేశం కొన్ని మృతదేహాలను అంగీకరించింది… ఈ 155 మంది అమర జవాన్ల విషయంపై ఇండియా కూడా ఏమీ స్పందించలేదు… ఎర్రకోట ప్రసంగంలోనే ఓ మాటంటే బాగుండేది అంటారా..? ఏమో..! డిలిట్ చేయబడిన వార్తల ఆధారంగా కామెంట్స్ చేయలేం కదా..!!

ఇదీ చదవండి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆపరేషన్ సిందూర్‌లో 155 మంది పాకిస్థాన్ జవాన్ల బలి..!?
  • కాఫర్ డ్యామ్ కదా… పర్లేదు, అప్పుడప్పుడూ అలా జారుతూ ఉంటాయి…
  • ప్రశాంత్, వంగా, రాజమౌళి, మణిరత్నం…. ఈ ప్రేమకథ తీయగలరా..?
  • మార్వాడీ గో బ్యాక్..! సమాజంలో ఓ అలజడి రేపే కుటిలయత్నాలు..!!
  • దర్శనమివ్వని ఆ దేవదేవుడికి … బయటి నుంచే ఓ పే-ద్ద దండం పెట్టింది బిడ్డ..!!
  • ప్రజల కోసం చేసే పోరాటాలు, త్యాగాల వాస్తవ విలువ ఎంత..?!
  • సో వాట్..? నా నలుపే నా బలం…! తలెగరేసి చెబుతుంది అర్చన..!!
  • పెళ్లయిన 9 రోజులకే భర్త హత్య…! ఆ తరువాత ఆమె కథ ఏమైంది..?!
  • బిపాషా మగది..! నెట్‌లో ఓ పిచ్చి ‘కండల’ పంచాయితీ కలకలం..!
  • పెరోల్..! అన్ని బంధాల్నీ గౌరవించే ఓ అనుబంధాల బాధితుడి కథ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions