.
Pardha Saradhi Potluri ……… రా కలిసి పంచుకుందాం! శిఖరాగ్ర సమావేశం! వ్లాడిమిర్ పుతిన్ – డోనాల్డ్ ట్రంప్!
దేనిని కలిసి పంచుకుంటారు? ఉక్రెయిన్?
అది ఎప్పుడో ఫిక్స్ అయింది! అమలు చేయడమే మిగిలింది.
మరి అలస్కాలో సమావేశం అయింది ఉక్రెయిన్ సమస్య మీద కాదా? కాదు…
ఆర్కిటిక్ ని కలిసి పంచుకోవడానికి అలస్కాలో శిఖరాగ్ర సమావేశం జరిగింది!
ఉక్రెయిన్ అనేది ఓకే ఒక్క డైవర్షన్ పాయింట్!
Ads
అంతర్జాతీయ మీడియా సాక్షిగా జరుగుతున్నది, నిన్న జరిగింది, రేపు జరగబోయేది అంతా బోగస్!
ఆర్కిటిక్ ప్రాంతంలో ఇప్పటి వరకూ ప్రపంచానికి పరిచయం లేని అరుదైన ఖనిజ సంపద ఉంది. అక్కడ పరిశోధనలు చేస్తేనే కానీ అవేమిటో, ఎక్కడ ఎంత లోతులో ఉన్నాయో తెలియదు.
నిజానికి హిట్లర్ బ్రతికి ఉన్న రోజుల్లో ఆర్కిటిక్ మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ప్రపంచాన్ని జయంచి ఆ తరువాత జెర్మనీ ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే ఆర్యుల వద్ద వేరెవరి దగ్గరా లేని టెక్నాలజీ ఉండాలి అని భావించాడు హిట్లర్!
దాని కోసం ఆర్కిటిక్ ప్రాంతంలో పరిశోధన కోసం శాస్త్రవేత్తల బృందాన్ని పంపించాడు. ఒకవైపు రెండవ ప్రపంచ యుద్ధంతో తలమునకలుగా ఉన్నా ఆర్కిటిక్ మీద నుంచి తన దృష్టిని మరల్చలేదు హిట్లర్. శాస్త్రవేత్తలకి నిరంతరం ఆహారం, మందులు, ఇతర సప్లైస్ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి యుద్ధం సంగతి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళమని ఆదేశాలు ఇచ్చాడు.
యుద్ధం ముగిసింది, హిట్లర్ చనిపోయాడు, జెర్మనీ లొంగిపోయింది కానీ ఆర్కిటిక్ కి వెళ్లే సప్లైస్ ఆగలేదు. బెర్లిన్ లోకి ముందుగా ప్రవేశించింది రెడ్ ఆర్మీ ( సోవియట్). రెడ్ ఆర్మీ నాజీ సైనికులతో పోరాడుతున్న సమయంలో స్థాలిన్ పంపించిన ప్రత్యేక బృందం బెర్లిన్ లో ఉన్న మిలిటరీ లేబరేటరీలలోకి ప్రవేశించి అక్కడ భద్రపరిచి ఉన్న బ్లూ ప్రింట్స్ ని స్వాధీనం చేసుకుంటున్న సమయంలో హిట్లర్ ఆర్కిటిక్ పరిశోధన కోసం చేస్తున్న డాక్యుమెంట్లు దొరికాయి.
వెంటనే విషయం స్థాలిన్ కి తెలియచేసారు. స్టాలిన్ ఆదేశాల మేరకు రష్యన్ శాస్త్రవేత్తల బృందం కొద్దిమంది రష్యన్ సైనికులని తీసుకొని, అప్పటికే జెర్మనీ నుండి అర్కిటిక్ కి వెళ్లి సప్లైస్ ఇచ్చి వచ్చిన జెర్మన్ సైనిక బృంద సభ్యులని వెంటబెట్టుకొని… ఆర్కిటిక్ వైపు వెళుతున్నారు… మార్గమథ్యంలో కొంతమంది జెర్మన్ సైనికులు ఎదురుపడి, మంచు తుఫాన్లు వలన తమ బృందంలోని సగం మంది చనిపోవడంతో శాస్త్రవేత్తలకి ఇవ్వాల్సిన సప్లైస్ ఇవ్వకుండానే వెనక్కి వచ్చేస్తున్నట్లు చెప్పడంతో, ఇక చేసేది లేక అందరూ తిరిగి బెర్లిన్ వచ్చేసారు.
యుద్ధం ముగిసాక ఇంకో కొత్త విషయం వెలుగు చూసింది అదేమిటంటే… ఆర్కిటిక్ లో పరిశోధనలు చేస్తున్న జెర్మన్ సైన్టిస్టులకి రక్షణగా కొంతమంది జెర్మన్ సైనికులు అక్కడ ఉండేవారు కానీ ప్రతీ 15 రోజులకి ఒకసారి వాళ్లు వెనక్కి వచ్చేస్తారు. మరో బృందం సైనికులు అక్కడి చేరుకోగానే…
హిట్లర్ చనిపోయిన సంగతి కానీ, జెర్మనీ లొంగిపోయిన సంగతి కానీ ఆర్కిటిక్ కాంప్ లో ఉన్న సైనికులకి తెలియదు. తమకి రిలీవ్ ఇవ్వాల్సిన సైనికులు ఎంతకి రాకపోవడంతో కాంప్ లో ఉన్న సైనికులు వెనక్కి వస్తున్న సమయంలో… మనుష్య సంచారం ఉన్న చోటుకి వచ్చిన తరువాతే జెర్మన్ సైనికులకి తెలిసింది జెర్మనీ లొంగిపోయిన సంగతి… దాంతో వాళ్లు జెర్మనీలోకి వెళ్లకుండా తలా ఒక దిక్కుకి పారిపోయారు. అలా హిట్లర్ అర్కిటిక్ పరిశోధన విషయం మరుగున పడిపోయింది…
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత హిట్లర్ ఆర్కిటిక్ పరిశోధనల మీద పలు కధనాలు ప్రచారంలోకి వచ్చినా వాటికి నమ్మతగ్గ ఆధారాలు లేవు. ఆర్కిటిక్ లో గ్రహాంతర వాసుల స్థావరాలు ఉన్నాయని, అప్పుడప్పుడు గ్రహాంతర వాసులు ఆర్కిటిక్ ప్రాంతానికి వచ్చి వెళుతుంటారు అనే ప్రచారం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. అయితే ఏవో అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ ఆర్కెటిక్ మీద ఎగరడం అనేది నిజం!
ఆర్కిటిక్ మంచు ఖండం అడుగున మంచి నీటి జలాశయం ఉంది అది వెయ్యి ఏళ్ల వరకు ప్రపంచం మొత్తానికి అవసరం అయ్యే మంచి నీటిని ఇవ్వగలదు అనేది కూడా నిజమే! అయితే మరో ప్రమాదం కూడా ఉంది. అది అసలు మానవ జాతికి పరిచయం లేని ప్రమాదకరమైన బాక్టీరియా కూడా మంచు కింద ఉంది.
పొరపాటున ఆ బాక్టీరియా కనుక బయటికి వస్తే అంతు చిక్కని వ్యాధులతో మానవజాతి అంతరించిపోతుంది!
Well…! ఆర్కిటిక్ మంచుఖండం కింద ఉన్న విలువైన ఖనిజ సంపద ఉంది కానీ వాటిని వెలికి తీయడం అమెరికా ఒక్కదాని వల్ల సాధ్యం కాదు. దాని కోసం రష్యా సహకారం అవసరం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అర్కిటిక్ మీద సోవియట్ యూనియన్, అమెరికాలు సమాన హక్కులు ఉండేట్లుగా ఒప్పందం చేసుకున్నాయి.
సోవియట్ యూనియన్ హయాంలోనే మంచు పలకలని చీల్చుకుంటూ వెళ్ళగలిగే షిప్పులని తయారు చేసింది. ప్రస్తుతం రష్యా వద్ద రెండు భారీ ఐస్ బ్రేకర్లు ఉన్నాయి. అవి మాటి మాటికీ ఇంధనం నింపుకొనవసరం లేకుండా అణు రియాక్టర్లతో నడుస్తాయి. ఒక్కో ఐస్ బ్రేకర్ లో ఉండే అణు రియాక్టర్ తో ఒక లక్షమంది ఉండే చిన్న పట్టణానికి నిరంతరాయంగా మూడేళ్ల పాటు విద్యుత్ సరఫరా చేయవచ్చు.
So…! ఆర్కిటిక్ లో ఉండే అరుదైన ఖనిజాలని వెలికి తీయడంలో రష్యా అవసరం ఉంది అమెరికాకి.
ఒకసారి గత ఫిబ్రవరి నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ వైట్ హౌస్ లో ట్రంప్ తో సమావేశం అయినప్పుడు ట్రంప్ ఆవేశంగా ‘ you have no cards’ అన్న సంగతిని గుర్తు చేసుకుంటే అర్ధమవుతుంది అసలు ఉక్రెయిన్ మీద జెలెంస్కీకి ఏ మాత్రం అధికారం లేదనే ధోరణిలో ట్రంప్ ఆ మాట అన్నాడని…
అప్పటికే అంటే ట్రంప్ అధికారంలోకి రాకముందే ఒక నిర్ణయానికి వచ్చేసారు. గత చరిత్రలోకి వెళితే పుతిన్, ట్రంప్ మంచి స్నేహితులు అన్న విషయం అందరికి తెలుసు.
***************
ఇంతకీ నిన్నటి శిఖరాగ్ర సమావేశంలో ఏం తేల్చారు?
జస్ట్! రష్యా మీద ఉన్న ఆంక్షలని తొలగించమని పుతిన్ డిమాండ్ చేశాడు. బహుశా ట్రంప్ త్వరలో ఆంక్షలని సడలిస్తాడు!
అలా జరగపోతే?
జెఫ్రి ఇప్స్టీన్ ఫైల్స్ తాలూకు సమాచారం పుతిన్ బయటికి తీస్తాడు. అఫ్కోర్స్! పుతిన్ ట్రంప్ మధ్య ఆర్ధిక లావాదేవీలు బోలెడు జరిగాయి గతంలో! ట్రంప్ అధ్యక్ష్య పదవికి నామినేట్ ( 2014 కి ముందు) కాకముందు నుండే పుతిన్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ రష్యా పర్యటనకి కూడా వెళ్ళాడు అధ్యక్షుడు కాకముందు.
జెఫ్రీ ఇప్స్టీన్ ట్రంప్ తో సన్నిహితంగా మెలుగుతున్న రోజుల్లో ఇప్స్టీన్ రష్యన్ ఓలిగార్చ్ లతో జరిపిన ఆర్ధిక లావాదేవీలు దేనికోసం జరిగాయి అన్న వివరాలు బయటికి వచ్చేస్తాయి. అందుకే అంత ఠీవిగా అలస్కాలో అడుగుపెట్టాడు పుతిన్!
నిన్నటి శిఖరాగ్ర సమావేశపు హడావిడి చూస్తే పుతిన్ అమెరికా పర్యటనకి వచ్చినట్లుగా లేదు, ట్రంప్ రష్యా పర్యటనకి వచ్చినట్లుగా ఉంది!
అన్నట్లు అలస్కాలోని యాంఖరేజ్ ( Anchorage ) పట్టణంలో పుతిన్, ట్రంప్ ల మధ్య సమావేశం జరిగింది కదా!
అలస్కాలోని ఈ పట్టణం ఉన్న ప్రదేశం ఒకప్పుడు రష్యాలో అంతర్భాగంగా ఉండేది.
1867 లో అప్పటి రష్యా జార్ చక్రవర్తి అలస్కా ని 7.2 మిలియన్ డాలర్ల కి అమెరికాకి అమ్మేశాడు. అలస్కా నుండి ఫర్ ( ఉన్ని) రష్యాలోకి వస్తుండేది. వాతావరణం అనుకూలించక రష్యా నుండి అలస్కాకి ప్రయాణం కష్టంగా ఉండే రోజులు అవి. మరో వైపు బ్రిటన్ తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా అలస్కాని ఆక్రమిస్తుందనే భయంతో అమెరికాకి అమ్మేసింది రష్యా!
అబ్రహం లింకన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రష్యా అలస్కాని అమ్మేసింది. అప్పట్లో రష్యా అమెరికా మధ్య సంబంధాలు బాగానే ఉండేవి!
నిన్నటి పుతిన్, ట్రంప్ సమావేశం జరిగిన anchorage పట్టణం ఒకప్పటి రష్యన్ భూభాగం! అఫ్కోర్స్! 1867 నుండి నిన్నటి వరకూ రష్యన్ పొలిటికల్ లీడర్ ఎవరూ కూడా anchorage లోకి అడుగుపెట్టలేదు! 1867 తరువాత నిన్న అధ్యక్షుడి హోదాలో anchorage లో అడుగుపెట్టాడు… మిగతా భాగం సెకండ్ పార్ట్‌లో....
*******************
Share this Article