Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డియర్ మెగాస్టార్ చిరంజీవి గారికి రాయునది ఏమనగా..!! (Aranya Krishna)

August 22, 2025 by M S R

.

Aranya Krishna …… చిరంజీవి గారూ! తెలుగు ప్రేక్షకులు మీ మూస నుండి బైట పడ్డారు. దాన్నుండి మీరే బైటపడాలి ఇంక!! లేకుంటే మీ ఇర్రలెవెన్స్ కొనసాగుతూనే వుంటుంది.

లార్జర్ దేన్ ద స్టొరీ ఇమేజ్ మీ శతృవు. ప్రతి సినిమాని ఓ బాధ్యతగా చూసే మా జనరేషన్ ఇప్పుడు లేదు. ఇరగతీసే ఫైట్ల కంటే ఏదో ఎమోషన్ కావాలి ఇప్పటి జనానికి. రియాల్టీ షోల్లో దద్దరిల్ల కొట్టే డాన్స్ షోలు ఫ్రీగా చూస్తున్న కాలంలో మీ ప్రాచీన కాలపు స్టెప్పులు, కాలేజ్ యానివర్సరీ స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ వంటి ఐటం డాన్సులు… ఏమీ కిక్కివ్వవు.

Ads

వందల రూపాయిలు ఖర్చుపెట్టి చూసే సినిమా ఇప్పుడు జస్ట్ వినోదం కాదు ప్రేక్షకులకి. వాళ్లు దాన్నో ప్రోడక్ట్ కింద కూడా చూస్తున్నారు. ప్రేక్షకుడిలో కూడా కన్సూమరిస్ట్ పెరుగుతున్నాడు. గోళ్లకు మట్టి అంటకుండా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఇంటికొచ్చి డెలివరీ చేసిన వాటిని కూడా నిర్మొహమాటంగా తిరస్కరించే కన్సూమరిస్ట్ నేటి ప్రేక్షకుడు.

రివ్యూలు చదివి మరీ గొప్పదైతేనే థియేటర్ కి వెళుతున్నాడు. బొమ్మ సరైన ప్రోడక్టుగా బైటకి రాకపోతే ఇదివరకటిలా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకునే సీన్ లేదు.

ప్రేక్షకులు హీరో కంటే కంటెంట్ని, దాని నేరేషన్ని ఎక్కువగా చూస్తున్నారు. కానీ మీ/మా దురదృష్టం ఏమిటంటే మీరింకా సినిమాకి కథ కన్నా, కథనం కన్నా మీరే ముఖ్యమనుకుంటున్నారు. అందుకే నక్సలైట్ పాత్ర వేసినా ఐటం సాంగ్స్ అనే భావ దారిద్ర్యం నుండి అంగుళం బైటపడ లేకపోయారు.

మిమ్మల్ని ఓ సూపర్మాన్ గా భావించే ఇప్పుడు యాభైల్లో పడ్డ మీ తీవ్రాభిమానులు కొందరు మిమ్మల్ని ఇంకా గుండెల్లో పెట్టుకోవచ్చు. నలభైల్లోకొచ్చిన కొత్త మధ్య వయస్కులు కూడా ఇంకా ఆ అభిమానాన్ని క్యారీ చేస్తుండొచ్చు. కానీ ఇప్పటి ఇరవైల తరానికి మీరు కంప్లీట్లీ ఔట్ డేటెడ్. వాళ్ల అభిరుచుల దరిదాపుల్లో మీరు లేరనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా.

వాళ్లు హాలీవుడ్ సినిమాలు బ్రహ్మాండంగా ఫాలో అవుతున్నారు. వెబ్ సిరీసెస్లోని సహజత్వపు కరడుకట్టినతనాన్ని ఆదరిస్తున్నారు. ఓటీటీల ద్వారా సృజనాత్మకతకి పెద్ద పీట వేసే తమిళ్, మలయాళీ, మరాఠీ, హిందీ సినిమాల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఎవరికి కావాలి మీ మూస ఫైట్స్, డాన్సులు..?

ఇప్పుడు కొత్తగా ఆలోచించకపోతే, మీ వయసుకి మీరు గౌరవం తెచ్చుకునే పాత్రలు ఎంపిక చేసుకోకపోతే మీరు కేవలం ఓ గతంగా మిగిలిపోతారు. వర్తమానంలో మీకు స్థానం ఉండదు. మీరు ఔట్ డేటెడ్ అని గుర్తించాల్సి వస్తుంది. ఈ సందర్భంగా జంధ్యాలగారి ఎత్తిపొడుపు వంటి తిట్టు ఒకటి జ్ఞాపకం వస్తుంది. "మొజాయిక్ ఫ్లోర్ మీద ఆవాలు పోసి కొత్తిమీర మొలవలేదని దిగులుపడితే ఎలా?”

పీఎస్: నేనేం చిరంజీవిగారి అభిమానిని కాను. ఆయన పునర్వైభవాన్ని కాంక్షిస్తూ ప్రేమతో రాసిన పోస్టు కాదు ఇది. అల్టర్నేటివ్ సినిమా అభిమానిని. ఎంత కాదన్నా సినిమా ఒక పరిశ్రమ కదా. దాని జయాపజయాల ప్రభావం చాలామంది మీద ఉంటుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలుగు ఆరోగ్యకర వినోద ప్రధాన సినిమాలు వస్తే చాలనుకుంటా. మరో విషయం ఏమిటంటే ఈ పోస్టులోని కంటెంట్ రవితేజ గారికి, నితిన్ గారికి, రామ్ గారికి….ఇలా మూస హీరోయిజాన్ని నమ్ముకున్న తెలుగు సినిమా హీరోలందరికీ వర్తిస్తుంది… గమనించగలరు….


ఆచార్య, భోళాశంకర్ డిజాస్టర్లకు కారణాలు వెతుక్కుంటే మీరు ప్రయాణించాల్సిన బాట ఏమిటో అర్థమవుతుంది…. ఇట్లు, ఈరోజుకూ మీ గత వైభవాన్ని గుర్తుచేసుకునే ఒకప్పటి మీ అభిమాని….. ముచ్చట



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్… కేటీయార్ ప్రేమించిన కంచె ఐలయ్య కాంగ్రెస్ సలహాదారా..?!
  • వాట్సప్‌లో పెళ్లిపత్రిక వచ్చిందా..? వెంటనే క్లిక్ చేయకండి, ఆరిపోతారు..!!
  • ఆహా… సబ్‌స్క్రయిబ్ చేయాలంటేనే ‘అల్లాడిస్తున్నారుగా’…
  • కేసీయార్‌కు కుదుటపడని ఆరోగ్యం… తరచూ ఏవో సమస్యలు..!?
  • ‘సోషల్ పొల్యూషన్’… కంట్రోల్ చేయలేమా..? మనల్ని కాపాడుకోలేమా..?
  • కేసీయార్ వాయిస్‌పై కుట్ర… *నమస్తే సర్వర్లపై సైబర్ అటాక్..!
  • నొటోరియస్ పొలిటిషియన్… బీహార్ అరాచకీయాల్లో మరవలేని పేరు…
  • ఓ అరుదైన కేరక్టర్… అందరిలా జీవించలేదు… అందరిలా మరణించలేదు కూడా…
  • ఈమె కూడా ఓ గంధర్వగాయని..! కానీ ఆ ఇద్దరికే దక్కిన తెలుగు అభిమానం..!
  • రేవంత్ తెలివైన ఎత్తుగడ… ఇద్దరు ప్రత్యర్థులపైనా పైచేయికి చాన్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions