.
Prabhakar Jaini
…. నాకొక ఐడియా వచ్చింది. ఫేస్బుక్కు, X, Instagram, యూట్యూబ్, గూగుల్లో పోస్ట్ చేసే ప్రతీ పోస్టుకు వంద రూపాయలు ఛార్జ్ చేయాలి. రీల్స్ పోస్ట్ చేయాలంటే వెయ్యి రూపాయలు ఛార్జి చేయాలి. లైక్ కొడితే పది రూపాయలు, కామెంటుకు యాభై రూపాయలు ఛార్జ్ చేయాలి.
అందుకోసం, ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసి అందరూ మినిమం వెయ్యి రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాతనే రిజిస్టర్ చేయాలి, ఫాస్టాగ్ లాగా. ఆ గేట్ వే ను దాటిన తర్వాతనే పోస్టు చేయడానికి, లైక్ చేయడానికి, కామెంట్ చేయడానికి అనుమతి ఉండాలి.
Ads
నా సామిరంగా! అప్పుడు తెలుస్తుంది. ఎవడు దేశద్రోహ పోస్టులు పెడుతున్నాడు, ఎవడు విద్రోహాలను, మత కల్లోలాలను రెచ్చగొడుతున్నాడు, ఎవడు డర్టీ వీడియోలు చూస్తున్నాడు, ఎవడు క్రైమ్ వీడియోలు చూస్తున్నాడు, ఎవడు ఏ భజన బృందానికి చప్పట్లు కొడుతున్నాడన్న యదార్ధం బయటపడుతుంది.
లేకపోతే, ఈ సమాజం సర్వనాశనం కావడానికి ఎంతో సమయం పట్టదు.
కూకట్ పల్లిలో, పన్నెండేళ్ళ అమ్మాయిని, సహస్రను, పద్ధెనిమిది కత్తిపోట్లు పొడిచి చంపాడు, పదో తరగతి చదువుతున్న ఒక పదిహేనేళ్ళ దరిద్రుడు. అదీ కేవలం ఒక క్రికెట్ బ్యాట్ కోసం.
మీరు గమనిస్తున్నారు కదా? ప్రతీ రోజూ భర్తలను, భార్యలు నరకడం; భార్యలను భర్తలు నరకడం విపరీతంగా పెరిగిపోయింది.
ఇటువంటి న్యూస్ రోజంతా టెలికాస్ట్ చేయకుండా, ముఖ్యంగా పిల్లలు చూడకుండా, చైల్డ్ లాక్ వేయడంతో పాటు, టీవీ ఛానెళ్ళపై సెన్సార్ ఉండాలి. ముఖ్యంగా టీవీ సీరియల్స్ ను బ్యాన్ చేయాలి. వీటి వల్ల ప్రేక్షకుల్లో హింసా ప్రవృత్తి పెరుగుతుంది.
భర్త/ భార్య /కోడళ్ళు /అల్లుళ్ళను చంపడానికి చేసే రకరకాల కుట్రలు మనసుల్లో ఎంత విషం నింపుతున్నాయో గమనించండి. జబర్దస్త్ లాంటి నీచ నికృష్ట ప్రోగ్రాములు ఏం సందేశాన్నిస్తున్నాయి. పక్కింటి వాడి పెళ్ళాన్ని లోబరుచుకోవడం, పరమ నీచ నికృష్టపు బూతులు…
ఇంత ఛండాలాన్ని సమాజంలోకి, మన ఇంట్లోని మల పదార్థాలను సీవేజ్ కాలవల ద్వారా నదులలోకి వదులుతున్నట్టుగా, వదులుతుంటే కంపరంగా, చీదరగా, ఒక దుర్గంధాన్ని ఒంటికి పూసుకున్నట్టుగా అనిపిస్తుంది. సమాజంలో జరిగే అక్రమ సంబంధాలకు, ఇటువంటి కార్యక్రమాలే కారణం కాదా?
కోర్టులు కూడా వివాహ వ్యవస్థ యొక్క పవిత్రతను కాపాడే విధంగా బాధ్యత వహించాలి. భర్తకు/ భార్యకు అక్రమ సంబంధాలు ఉండవచ్చు, సహజీవనం తప్పు కాదు, వ్యభిచారం తప్పు కాదు అన్న తీర్పులు మన భారతదేశ సామాజిక, సాంస్కృతిక శోభను పెంచవు.
ప్రపంచ దేశాలన్నీ, భారతదేశం వైపు ఒక ఆరాధనా భావంతో, ఒక ఆధ్యాత్మిక గురు భావంతో చూస్తాయి.
ఆ ఔన్నత్యాన్ని కాపాడుకునే విధంగా, ప్రభుత్వ, కోర్టు, ప్రెస్ తమ బాధ్యతలను నిర్వహించాలి.
అటువంటి సంఘటనలు రేపు మనింట్లోనే జరగవచ్చు. అప్పుడు మీరు నోరు తెరిచి సహాయం అడగలేరు గుర్తుంచుకోండి.
చాలు, ఇక చాలు వాక్స్వాతంత్రం. సమాజపు పునాదులే కూలిపోతున్నప్పుడు, భవిష్యత్తు తరాల కోసం మన జాతులను రక్షించుకోవడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి….
Share this Article