.
చంద్రబాబు ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉన్నాడనే బీఆర్ఎస్ క్యాంపు దుష్ప్రచారాన్ని మరిచిపొండి… రేవంత్ రెడ్డి వేసిన ముడులు విప్పడం ఏపీ ప్రభుత్వానికి అంత తేలిక కాదు…
అంతేకాదు… అంత తేలికగా కేంద్ర ప్రభుత్వం కూడా దానికి పర్మిషన్ ఇవ్వదు… ఆల్రెడీ కేంద్ర సంస్థలు సంధించిన కొర్రీలకు జవాబులు ఏమివ్వాలో తెలియక కిందామీదా పడుతోంది చంద్రబాబు ప్రభుత్వం… అదీ తెలంగాణ వేసిన చిక్కుముడి ఫలితం… కాదు, అది పీటముడి…
Ads
1) చత్తీస్‌గఢ్ ప్రాజెక్టులు పూర్తయితే పోలవరానికే నీటిలభ్యత తక్కువ… 2) చంద్రబాబు చెబుతున్న వృథాజలాలు అంటూ ఏమీ ఉండవు… వాటిపై ఆధారపడి మరో ఏటీఎం కాళేశ్వరం కడితే అది ఏపీకే చేటు… 3) పోలవరంలో మార్పులు చేస్తే మళ్లీ పోలవరానికి పర్మిషన్లు కావాలి… 4) మా గోదావరి సరైన వాటా తేల్చి, అస్యూరెన్స్ ఇచ్చి కట్టుకొండి,.. 5) ఇచ్చంపల్లి కట్టండి, మా వాటా పోను మిగతా జలాల్ని తీసుకుపొండి…
…. ఇలా రకరకాల ప్రతిపాదనల్ని బనకచర్ల చుట్టూ ముడేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం… ఇదంతా ఒకెత్తు కదా… ఒకవైపు బనకచర్లకు రేవంత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడంటూ బీఆర్ఎస్ క్యాంపు తెలంగాణ ప్రజల చెవుల్లో పెద్ద పెద్ద రఫ్లీషియాలు, క్యాబేజీ పూలు పెట్టే ప్రయత్నం చేస్తోంది కదా… మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా మన చెవుల్లో పూలు పెట్టడానికి విఫల ప్రయత్నం చేస్తోంది…
సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ మొన్న నదుల అనుసంధానం మీద హైదరాబాదులో జరిగిన భేటీలో చేసిన అర్ధరహిత వ్యాఖ్యలే నిదర్శనం… అంటే కేంద్ర ప్రభుత్వం… అనగా బీజేపీ లేదా ఎన్డీయే..! విషయం ఏమిటంటే..? గోదావరి పరీవాహక రాష్ట్రాలు ఎప్పటిలాగే తమ తమ వాదనల్ని వినిపించాయి…
అప్పుడు ‘‘గోదావరి జలాల్ని కావేరిలో పోయడం కాదు, హిమాలయ నదుల జలాల్ని తీసుకొచ్చి గోదావరిలో పోస్తాం, కాబట్టి ఈ అనుసంధానాన్ని హిమనదులతో కావేరిని నింపడం…’’ అని ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు… చతీస్‌గఢ్ తన ప్రాజెక్టులు కట్టడానికి 15 ఏళ్లయినా పడుతుంది, అవి కట్టాక దాని వాటాను వాడుకోవడాన్ని నిలిపివేస్తాం’’ అన్నాడు ది గ్రేట్ ఇంజినీర్ అతుల్ జైన్…
సరే, తెలంగాణ కరాఖండీగా చెప్పేసింది… ఈ కట్టు కథలన్నీ కాదు, మాకేం ఫాయిదాయో తేల్చండి, లేకపోతే మేం అంగీకరించబోం అని..! అతుల్ జైన్ ఫాఫం ఏ లోకంలో ఉన్నాడో…
- చత్తీస్‌గఢ్ కట్టుకోవడానికి 15 ఏళ్లు పడుతుంది సరే, కానీ ఇప్పటికిప్పుడు గోదావరి టు కావేరి లింక్ అంగీకరించినా, నిర్మాణం ప్రారంభించినా అంతకుమించిన కాలం పడుతుంది… పోలవరం గతి చూస్తున్నాం కదా…
- అసలు బ్రహ్మపుత్ర నీటినే మనం 20 శాతం కూడా వాడుకోలేకపోతున్నాం… దాన్ని బెంగాల్, ఒడిశాల మీదుగా మహానదిలో పోసి, దాన్ని గోదావరికి అనుసంధానించి, కావేరికి తరలిస్తాడట… హహహ, అయ్యే పనేనా..?
- ఈలోపు గోదావరి నుంచి కావేరిని నీటిని తరలించే ప్రాజెక్టు పూర్తిచేసి, చేతులు దులుపుకునే బృహత్ ప్రణాళిక… ఇది కేంద్రంలో చక్రాలు తిప్పే తమిళ మేధావుల ప్లానింగ్… ఎందుకంటే, కావేరిపై కర్నాటక పట్టు పెరిగి, తనే వాడేసుకుంటుంది కాబట్టి గోదావరి నీళ్లను ఎత్తుకుపోయే ప్లానింగు…
ఇప్పుడే కాదు, దశాబ్దాల నుంచీ ఈ ప్రతిపాదనలు ఉన్నాయి… ఉమ్మడి ఏపీ, ఇప్పుడు తెలంగాణ ఖండితంగా వ్యతిరేకిస్తూనే ఉన్నయ్… మనకు తెలుసు ఈ మాయమాటలు… బ్రహ్మాండంగా విద్యుత్తు, జలరవాణా, వరదల నియంత్రణ, అదనపు ఆయకట్టు అనే లక్ష్యాలు మంచివే… కానీ హిమాలయ నదుల నీళ్లు ఇటు రాకుండా, ఇక్కడి మా నీరు దోచుకుని పోతానంటే ఎలా..? ఈ ప్రశ్నతోనే మనమే కాదు, ఒడిశా, చత్తీస్‌గఢ్ కూడా తిరస్కరిస్తున్నాయి…
ప్రాజెక్టులను త్వరితగతిన కట్టడం అనేది కేంద్రానికి తెలియనే తెలియదు… జాతీయ ప్రాజెక్టుల దుస్థితి చూస్తున్నాం కదా… ఆ హిమాలయ నదులు ఇటు వచ్చేదీ లేదు… మండవ వెంకటేశ్వరరావు, కడియం శ్రీహరి, పొన్నాల లక్ష్మయ్య… ఎవరు సాగునీటి మంత్రిగా ఉన్నా సరే, కేంద్రం ప్రతిపాదించే అడ్డదిడ్డం అనుసంధానాన్ని తిప్పికొడుతూనే ఉన్నాం… ఎస్, ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా..! సింపుల్... మా అవసరాలు తీరనిదే గోదావరి నుంచి చుక్క నీటిని కూడా ఇవ్వబోం..!
Share this Article