.
.
ఎవ్వరి జీవితం వాళ్లకే సరిపోతలేదు.. ఇంకొకరి గురించి పట్టించుకుని, ఇంకాస్త మాట్లాడితే పోరాటం చేసే రోజులా ఇవి..? కానీ, ఆ 24 ఇంజనీర్ యువతి మాత్రం అడవుల పరిరక్షణ, సమానత్వం, న్యాయం, గిరిజన హక్కుల కోసం విలక్షణంగా పోరాటం చేస్తుంది. అందుకు తన ర్యాప్ ను ఆయుధంగా మల్చకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ యువతి కథేంటి..?
Ads
లయ, ప్రాస మించి ఆమె సంగీతం ఇప్పుడు వివిధ వేదికలపై ఆకట్టుకుంటుంది. పాటే ప్రతిఘటనై.. పవర్ సెంటర్స్ ను సవాల్ చేస్తున్న పేరు మహి. జి. అంతేకాదు, ఇవాళ భారతీయ సమాజంలో ఇప్పుడిప్పుడే వినిపిస్తూ, కనిపిస్తున్న… విదేశాల్లో ఇప్పటికే ఆమోదముద్ర వేసుకున్న LGBTQIA సమాజం తరపున ఆమె ఇప్పుడు గొంతెత్తుతోంది. పర్యావరణ కాలుష్యాన్ని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వాలు పట్టించుకోకుండా బుల్డోజ్ చేసే సమస్యలను వెలుగులోకి తెచ్చే తన పాట.. ఇప్పుడో చర్చ. తన సమాజం కోసం ఆమె పాట ఇప్పుడు ఓ గంభీరమైన గొంతై ఎగిసిపడుతోంది… నిజాలను నిర్భయంగా పాడి వినిపిస్తోంది.
తమ స్వగ్రామమైన కలాన్ లోనే ఆమె పాటలను చిన్ననాటి నుంచే వింటూ ప్రాక్టీస్ చేసేది. ఇంజనీరింగ్ ఆమె వృత్తి అయితే… ర్యాప్ సంగీతం ఆమెకు ఓ లక్ష్యాన్ని చూపించింది. జంగిల్ చా రాజా నే ఆమె మొదటి ఆల్బమ్… తన గిరిజన ప్రజల గొంతుకైంది. గిరిజనానికీ, అడవులకూ మధ్యనున్న అవినాభావ బంధాన్ని ఎలుగెత్తి చాటింది. ఆ రెండింటికీ ముప్పుగా మారిన విధ్వంసంపై పదునైన విమర్శగా సంచలనం సృష్టించింది.
మహి. జి. ఎందుకు ప్రత్యేకమంటే… మూస ధోరణులను బ్రేక్ చేసే ఒక తెగువ ఆమె ర్యాప్ పాటలో కనిపిస్తుంది. ఆమె పాడిన హక్ సే హిజ్దా హున్ అనే పాట ట్రాన్స్ జెండర్స్ హక్కుల గీతమై ఇప్పుడు దేశమంతటా వినిపిస్తోంది. హమ్ సఫర్ ట్రస్ట్ తో కలిసి ఆమె ఈ పాట రూపొందించింది. బాప్ మానస్ డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్ కు తన ఈ పాటతో నివాళులర్పించిన మహి ర్యాప్ సాంగ్ భారత్ అంతా ప్రతిధ్వనించింది. ఆమె ప్రతీ ట్రాక్ లోనూ ఏదో ఒక లక్ష్యంతో రికార్డ్ చేయడం భవిష్యత్ భారతంపై ఆమె విజన్ కు నిదర్శనం. మొత్తంగా ర్యాప్ మ్యూజిక్ తో మైక్రోఫోన్, మెగాఫోన్ ఉపయోగించి… మార్పు కోసం యత్నిస్తున్న యువతిగా మహి ఇప్పుడు వార్తల్లోకెక్కారు.
భారత్ వంటి దేశంలో ర్యాప్ సంగీతాన్ని నిర్వచించి కేవలం పాటను వినోదంగానే కాకుండా… విలువలను గుర్తెరిగాలా మార్చి… సమాజం కోసం పాటైన ఇంజనీర్ మహి. జి.. ఉరఫ్ మధుర ఘనే.
Share this Article