.
ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థైన మొస్సాద్… పాక్ అణు పితామహుడిగా పిల్చుకనే అబ్దుల్ ఖాదిర్ ఖాన్ ను ఎందుకు టార్గెట్ చేసింది..? మొస్సాద్ నుంచి ఖాన్ ను కాపాడిందెవరు..?
అది 2000 సంవత్సరం. పాకిస్థాన్ అణు శాస్త్రవేత్తైన అబ్దుల్ ఖాదిర్ ఖాన్ ను మొస్సాద్ టార్గెట్ చేసింది. అతణ్ని చంపేందుకు ఓ యాక్షన్ ప్లాన్ ను రెడీ చేసింది. ఆ మిషన్ కు ఏకంగా కిడాన్ అనే పేరు పెట్టింది. కిడాన్ అంటే హిబ్రూ భాషలో ఈటె అని అర్థం. ఖాదిర్ ఖాన్ ఓ దక్షిణాసియాలోని దేశ సందర్శనకు వెళ్లినప్పుడు అతణ్ని అక్కడ లేపాయలనే స్కెచ్ వేసింది. ఇరాన్, పాక్ మధ్య అణు ఒప్పందాలు జరుగుతున్నాయని… దాన్ని ఆపాలన్న ఉద్దేశంతో మొస్సాద్ ఏకంగా పాక్ అణు ప్రముఖుణ్నే లక్ష్యంగా చేసుకుంది. పాక్ శాస్త్రవేత్తలు.. ఇరాన్ కు అణుబాంబు తయారీలో సహకరిస్తున్న ప్రధాన అనుమానమే అందుకు కారణం.
Ads
ఆ రహస్యాన్ని వెల్లడించిన వ్యక్తెవరు..?
మొస్సాద్ మాజీ చీఫ్ షబ్తాయ్ షావిత్ 2023లో ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఒకవేళ ఖాదిర్ ఖాన్ గానీ, పాక్ కుగానీ ఆ ఉద్ధేశాలే ఉన్నట్టు మాకు కన్ఫర్మేషన్ అయితే గనుక.. ఖాదిర్ ఖాన్ ను చంపేయమని మా కమాండెంట్లను ఆదేశించేవాణ్నని ఆయన ఆ ఇంటర్వ్యూలో నర్మగర్భంగా చెప్పాడు. అది చరిత్ర గతినే మార్చేసేదన్నాడు. అయితే షవిత్ తర్వాత మొస్సాద్ చీఫ్ గా వచ్చిన అధికారి.. తాను బాధ్యతలు స్వీకరించిన వెంటనే షవిత్ ప్రణాళికను అమలు చేయడానికి మళ్లీ సిద్ధమయ్యాడు. అందుకోసం మొస్సాద్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ, మిషన్ అమలు గురించి వివిధ రకాల అవగాహన వంటి ప్రక్రియలూ నాడు చోటుచేసుకున్నాయి.
పాక్ అణుశాస్త్రవేత్త ఏ.క్యూ. ఖాన్ మర్డర్ రు సర్వం సిద్ధమైంది!
అబ్దుల్ ఖాదిర్ ఖాన్ పై అప్పటికే పక్కా స్కెచ్ తో… మొస్సాద్ ఏజెంట్స్ రెక్కీ పెట్టారు. దక్షిణాసియాలోని ఓ దేశానికి ఆయన పర్యటన ఖరారైన సమయంలో.. సరిగ్గా ఆయన్ను మట్టుబెట్టాలన్న లక్ష్యంతో వాళ్ల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఏ. క్యూ. ఖాన్ అనేక ఇస్లామిక్ దేశాల్లో అణ్వాయుధ కార్యక్రమాలకు వ్యూహాత్మక సలహాలివ్వడం ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ కు గిట్టలేదు. ఏ దేశంలోనైనా అణుబాంబుల సృష్టి చేయడాన్ని మొస్సాద్ జీర్ణించుకోలేకపోయింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ శత్రుదేశాలకు ఆ సహకారమందించడాన్ని మొస్సాద్ , సీరియస్ గా పరిగణించింది. అదే బాటలో ఇప్పటికే ఇజ్రాయెల్ డజన్ల కొద్దీ ఇరానియన్ అణుశాస్త్రవేత్తలను మట్టుబెట్టింది. గత జూన్ లో కూడా సుమారు 20 మంది ఇరానియన్ అణుశాస్త్రవేత్తలను లేపేసింది.
మరి అబ్దుల్ ఖాదిర్ ఖాన్ ను ఇజ్రాయెల్ ఎందుకు చంపకుండా వదిలేసింది..?
ముషారఫ్ చొరవతో నాడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ బతికి బట్టకట్టాడు. అందుకు, అమెరికా సహకరించింది. అమెరికా అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్.. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ ఏ దేశానికీ అణుబాంబుల తయారీ గురించి ఎటువంటి సాయమందించకుండా చూసే బాధ్యత తమదని.. ఇజ్రాయెల్ నుంచి ఖాదిర్ ఖాన్ ఎదుర్కొంటున్న థ్రెట్ నుంచి కాపాడాలని కోరాడు. అలా ముషారఫ్ స్పష్టమైన హామీ ఇచ్చాడు.
అబ్దుల్ ఖాదిర్ ఖాన్ ఇరాన్ అణుబాంబు తయారీకి సాయం చేస్తాడని ఇంకా అప్పటికీ ఇజ్రాయెల్ నమ్ముతూనే ఉంది. అమెరికా మిషన్ ఆపేయాలని చెప్పినా కూడా ఇజ్రాయెల్ కు నమ్మకం కల్గలేదు. ఒక మిషన్ ను ఎంచుకున్నాక వెనక్కి వెళ్లడం కూడా ఇజ్రాయెల్ స్పై అయిన మొస్సాద్ చరిత్రలో లేదు. కానీ, అంతర్జాతీయ సంబంధాలు, భద్రతా కారణాల దృష్ట్యా ఖాదిర్ ఖాన్ మర్డర్ ప్లాన్ ను వాయిదా వేసుకుంది మొస్సాద్. అలా ఖాదిర్ ఖాన్ ఇజ్రాయెల్ గూఢచారి సంస్థైన మొస్సాద్ నుంచి తప్పించుకున్నాడు.
అబ్దుల్ ఖాదిర్ ఖాన్ పాకిస్థాన్ అణు రంగంలో కీలకమైన ఇంజనీర్. న్యూక్లియర్ బ్లాక్ మార్కెట్ లోనూ ఆయన ఇన్వాల్వ్మెంట్ అప్పట్లో పెద్ద చర్చ. ఇండియాలోని భోపాల్ లో 1936, ఏప్రిల్ 1న జన్మించిన ఆయన.. 2021, అక్టోబర్ 10వ తేదీన తన 85 ఏళ్ల వయస్సులో పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో కన్నుమూశాడు..
.
.
అసలు కోణం ఏమిటి..? సింపుల్, పాకిస్తాన్ అణ్వస్త్రాలు దానివి కావు. అవి అమెరికావి… మొన్న ఆపరేషన్ సిందూర్ లో దెబ్బతిని అమెరికా కిందామీదా పడిపోయింది వాటి రక్షణ కోసం… అదీ అసలు సంగతి… బహిరంగంగా ఎవరూ ఒప్పుకోరు…
.
Share this Article