Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నారా రోహిత్ జాబితాలో మరొకటి, అంతే… సుందరకాండ రివ్యూ…

August 27, 2025 by Rishi

—

నారా రోహిత్… ఎన్నో ఏళ్లుగా తెరపై ఉన్నాడు… బలమైన బ్యాక్ గ్రౌండ్… కానీ ఈరోజుకీ ఇదీ నా సినిమా అని చెప్పుకునే ఒక్క సినిమా లేదు…

చిత్రం ఏమిటంటే… అయినా ఏవో ఛాన్సులు వస్తూనే ఉంటాయి… హేమిటో ఫీల్డ్ చిత్రమైనది… బొద్దుగా , బరువుగా… సగటు తెలుగు సినిమా వీరోకు ఉండబడాల్సిన స్టెప్పులు, ఫైట్లు గట్రా లేకపోయినా సరే… అలా అవకాశాలు వస్తుంటాయి…

Ads

తాజాగా వచ్చిన సుందరకాండ సినిమా కూడా తన సినిమాల జాబితాలో మరొక పేరు… అంతే…

శ్రీదేవి … విజయకుమార్ బిడ్డ… అప్పట్లో కొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్ కూడా… కానీ నిలదొక్కుకోలేదు… టీవీ షోలలో కనిపిస్తూ ఉంటుంది… ఇందులో ఒక తల్లి… ప్చ్, not impressive…

వృతి వాఘాని –తెలుగు తెరకు కొత్త అనుకుంటా… అమాయకమైన ఓ పాత్రలో ఫ్రెష్‌గా కనిపించింది… పర్లేదు…

ఇంకా ఎవరెవరో ఉన్నారు గానీ… సినిమాలో కామెడీ పోర్షన్ మొత్తం సత్య, సునైనా మోశారు… వాళ్ళే సినిమాలో చూడబుల్…

పెళ్ళికి లెక్కలు ఉంటాయి… కానీ ప్రేమకు..? అసలు లెక్కల్లో ఇమిడేది ప్రేమ అవుతుందా..? అదొక సమీకరణం కాదు, ఒక ఎమోషన్… ఇది చెప్పే ఒక కథ…

ఇది బలంగా చెప్పాలంటే మంచి పాటలు, మనసుని తాకే కొన్ని సీన్లు కావాలి… కానీ ఇందులో పాటలు పూర్… BGM జస్ట్ ఓకే…

హిందీలో విజయవంతమైన లమ్హే (Lamhe), తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ముత్తానా కత్రిక, మలయాళ చిత్రం వెళ్లిముంగ సినిమా కథలకు ఈ కథ చాలా దగ్గరగా ఉంటుంది… తెలుగులో వచ్చిన వెంకటేష్, మీనాల సుందరకాండ సినిమా కథకు మాత్రం ఇది అపోజిట్‌గా ఉంటుంది…
.

… పాజిటివ్ పాయింట్లు

వినూత్నమైన కాన్సెప్ట్ – “ఐదు లక్షణాల ప్రేమ”
ఫ్యామిలీకి అనువైన, శుభ్రమైన కథనం
కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయ్యింది

బ్యూటిఫుల్ విజువల్స్, ఎమోషనల్ మెచ్యూరిటీతో స్క్రిప్ట్ (హీరో వయస్సు దృష్టిలో ఉంచుకుంటే) కానీ…

నెగిటివ్ పాయింట్లు… కథలో ట్విస్ట్‌లు అంచనాలకు తగ్గట్టు కుదర… ఇంటర్వెల్ తరువాత పేసింగ్ కొంచెం స్లో…

క్లైమాక్స్ అంచనాలను చేరడంలో తడబడింది… కొంతవరకు టెలివిజన్ సినిమాల ప్రభావం కనిపించటం మైనస్…

వెంకటేష్ నిమ్మలపూడికి ఇది డెబ్యూ డైరెక్షన్ కావచ్చు,.. అనుభవలేమి కనిపించింది… కాకపోతే క్లాసిక్‌ కాకపోయినా సరే, క్లీన్ గా ఉంది సినిమా…

OTT లోకి వచ్చాక చూడొచ్చునేమో ఒకసారి టైం పాస్… లేదా సత్య , సునైనా బిట్స్ రీల్స్ గా గనుక నెట్ లో పెడితే అవి చూడబులు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నారా రోహిత్ జాబితాలో మరొకటి, అంతే… సుందరకాండ రివ్యూ…
  • రిస్కీ షాట్… అన్ని సీన్లూ అంత వీజీ కాదు… (దేవీప్రసాద్)
  • మోస్సాద్ వదిలేసిన ఏకైక టార్గెట్… ఎవరు అతను.. !? ( రమణ కొంటికెర్ల )
  • పెంకులు పగిలినా, ఇంటివాడు తిడితే అదొక ఆనందం..! (నగునూరి శేఖర్)
  • ఒకే మూవీ టైటిల్… ముగ్గురు తెలుగు హీరోలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)…
  • అప్పట్లో గుడ్ బాయ్… మా బాలయ్య మంచి స్టోరీస్..! (Dogiparthi Subramanyam)
  • ర్యాప్ అస్త్రంగా ఓ యువతి చైతన్య పోరాటం..! (రమణ కొంటికర్ల)..
  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions