.
నిన్న ఉత్తర తెలంగాణ కామారెడ్డి , మెదక్,
నిజామాబాద్ జిల్లాలు తడిసిన పక్షుల్లా గజ గజ వణికినాయ్…
పది పదిహేను గ్రామాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంకా ఎన్నో గ్రామాలు వరద తాకిడిలోనే ఉన్నాయ్…
Ads
దగ్గరి మిత్రుల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నా… అన్నిటికన్నా పోచారం ప్రాజెక్ట్ అంటే అదీ… ప్రాజెక్ట్ నిండు కుండలా సామర్థ్యానికి మించి నీరు వచ్చినా సరే, చెక్కుచెదరక నిటారుగా నిలబడ్డది…
అధికార్లు, ఇంజనీర్లు, ప్రజలు అందరికీ కట్టపై నుంచి వరద నీరు దూకుతుంటే ఇది నిలబడినా అని ఆందోళన …
నేటికి నూటా ఆరేళ్ల కింద నిజాం మెతుకు సీమ మెదక్ ప్రజల దాహాన్ని తీర్చడానికి
కేవలం 17 లక్షలతో నిర్మించాడు. నిత్యం నిజాంని తిట్టిపోసే వాళ్లకు ఇలాంటి ఎన్నో ప్రాజెక్ట్ లు కట్టిన తన చరిత్ర తెలియదు…
పోచారం ప్రాజెక్ట్, పోచారం, నాగరెడ్డిపేట్ మండలంలో… ఆనాడు నిజాం ప్రభుత్వ ఇంజనీర్లు సున్నపురాయితో
ఈ ప్రాజెక్టును నిర్మించారు… 1.7 కి.మీ పొడవు, 21 అడుగుల ఎత్తైన కట్ట, చుట్టూ 58 కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వారు…
వందేళ్ళు అయినా …. నిన్న దాదాపు లక్షా ఇరవై వేల క్యూసెకుల నీటి ఉధృత ప్రవాహాన్ని కూడా తట్టుకుని నిలబడ్డది…
14 గ్రామాలు నీట మునిగినా ప్రాణ నష్టం తప్పింది…
కాలం మారింది, సాంకేతికత పెరిగింది, కట్టడాల పటిష్టత కొలిచే ఎన్నో మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి…
మరి లక్షా యాభై వేల కోట్లతో కట్టిన కాళేశ్వరంలోని మేడిగడ్డ రెండేళ్లకే ఎందుకు కూలింది… తస్కింది… కుంగింది… పగిలింది… ఎవరు ద్రోహి..?
పని మంతుడు పందిరి వేస్తే పిచ్చుక కాలు తగిలి కూలిపోయింది అట… ఇదీ అంతే… అన్నట్టు మర్చిపోయా, వందేళ్ళకు పైగా నిలబడ్డ ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం కేవలం 17 లక్షలు మాత్రమే … అప్పట్లో…
మన అభినవ కల్వకుంట్ల మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన చెమట బొట్టు బొట్టు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ మొత్తం వ్యయం లక్షా యాభై వేల కోట్లు అయితే కేవలం DPR ల తయారీకి అయిన ఖర్చు అక్షరాలా 500 వందల కోట్లు అన్నమాట…
By the way… అందులో కొన్ని DPR లు సంపాదించి చదివిన ఙ్ఞానంతో చెబుతున్న… నాటి ఒరిజినల్ నిజాంకూ… నేటి నయా నిజాంకూ ఎంత తేడా…!?…. ( గుర్రం సీతారాములు )…
Share this Article