.
. సినిమా ఒక లాభసాటే వ్యాపారమే అయిఉంటే… ఇప్పుడున్న ప్రొడ్యూసర్లు ఎవరు కూడా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కాదు…,
ఎందుకంటే కార్పొరేట్లూ, వడ్డీ వ్యాపారులే సినిమాలు తీసేవాళ్ళు, వాళ్ళకి ఈ ఇండస్ట్రీ కథ కమామీషు తెలుసు, అందుకే ఈ దందాలోకి ఎంటర్ అవ్వలేదు…
Ads
ఇప్పటికి తెర వెనుక వ్యాపారాలే వాళ్ళవి… ఒక సినిమా ఫైనాన్సియర్, థియేటర్ ఓనర్ (PVR INOX ), ఒక క్యూబ్… ఇవి ఏవి కూడా డైరెక్ట్ దందాలో ఉండవ్.., కానీ మన పిచ్చి నాగవంశీలూ, దిల్ రాజులూ, మన మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలకు ఇంకా జ్ఞానోదయం కావట్లేదు..
ఏమన్నా అంటే, సినిమా అంటే మాకు పాషన్ అని ఒక టాగ్, ఒక డైలాగ్… మూవీ ఇండస్ట్రీ అనేది ఒక పత్తాలాట… పేకాట… ఎప్పుడు ఏ ముక్క కొట్టాలో, ఎప్పుడు మిడిల్ డ్రాప్ కావాలో తెలియకుంటే అంతే సంగతులు… లాస్ట్ వన్ మంత్ సినిమా కలెక్షన్స్ చూడండి ఒకసారి…
హరి హర వీర మల్లు, 55-60 కోట్లు లాస్, ప్రొడ్యూసర్ ఏ యమ్ రత్నం, డిస్ట్రిబ్యూటర్ మైత్రి మూవీస్…,
కింగడమ్ 25- 30 కోట్లు లాస్, ప్రొడ్యూసర్ నాగ వంశీ, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు..,
కూలి 10- 15 కోట్లు లాస్ (తెలుగు వెర్షన్) ప్రొడ్యూసర్ సన్ పిక్చర్స్, డిస్ట్రిబ్యూటర్ ఆసియన్ సునీల్ సురేష్ బాబు, దిల్ రాజు సిండికేట్…
వార్- 2 55- 60 కోట్లు లాస్, YRF ప్రొడ్యూసర్, తెలుగు రిలీస్డ్ బై నాగ వంశీ వయా దిల్ రాజు…
ఇవి కాకుండా చాలా కళాఖండాలు ఎప్పుడు వచ్చి, ఎప్పుడు పోయినయో కూడా తెల్వదు… ఒక్క జులై 23 నుంచి ఆగస్టు 25 వరకు తెలుగు సినిమా పోగొట్టుకున్న డబ్బులు దాదాపు 225- 250 కోట్లు…
ఇంకా మేము దేశోద్దారకులం, సినిమా కళామతల్లి ముద్దుబిడ్డలం, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మేము 30 వేల ఉద్యోగాలు క్రియేట్ చేసామ్ వంటివి సొల్లు డైలాగ్స్, క్లియర్ ఆత్మవంచన…
మార్కెట్ ఉన్నా లేకున్నా హీరోలకి, ఆర్టిస్టులకి కలిపి దాదాపు 60- 65% బడ్జెట్ రెమ్మ్యూనరేషన్స్ కే పోతుంటే మీకింకేం లాభాలు వస్తాయాయ్యా…
ఇప్పటికైనా కళ్ళు తెరవండి… అబ్బే, ఈ నష్టాలు మేము చూడనివా, మాకు తెల్వనివా అనుకుంటూ ఉంటే మాత్రం… యూఎస్ నుంచి ఇన్వెస్ట్మెంట్లు, పొలిటికల్ నుంచి ట్రాన్సక్షన్స్ ఉన్నన్ని రోజులు ఇలానే ఉంటాయి… What next..!? ( గోపు విజయ్ కుమార్ రెడ్డి)
Share this Article