ముందుగా చిన్న విషయం…. కాదు, అసలు విషయం అదే… ఏమిటీ..?
.
తెలంగాణ చదరంగంలో ప్రధాన పార్టీల తరఫున అటూ ఇటూ ఆడుతున్నది ఒక్కడే… తన పేరు రేవంత్ రెడ్డి…
Ads
మరీ లోతుల్లోకి ఇప్పుడే వెళ్ళనక్కర్లేదు గానీ… Cong, bjp, brs… మూడింటి జర్నీని ప్రస్తుతం డిసైడ్ చేస్తున్నది… పరోక్షమో, ప్రత్యక్షమో… తనే…
అందరూ అండరెస్టిమేట్ చేశారు తనను… కాంగ్రెస్ సీనియర్స్, BRS అతి పెద్ద బుర్రలు, బీజేపీ డిసిప్లిన్…. అన్నీ బ్రేక్ చేస్తున్నాడు… సరే… దేవునపల్లి కవిత, హబ్బా, ఆ కల్వకుంట్ల కవిత విషయానికే వద్దాం…
.
సెలుపుతోంది… అంటే ఆమె తెలంగాణా భాషలో కలియ తిప్పుతోంది… ఆమె highly ambitious… అయ్య నోట్లో నుంచి ఊడిపడ్డ బిడ్డ… ఇప్పుడు ఏమంటోంది…?
కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే శుద్ధపూసలు… అనగా రామన్న, చంద్రయ్య… అంతే… హరీష్ పెద్ద దొంగ… BRS దుస్థితికి తనే కారకుడు… సంతోష్ co- culprit…
.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అనకొండలా మింగింది వాళ్ళే… ఒక దశలో kcr, ktr లను కూడా ఓడించడానికి డబ్బులు ఖర్చు చేశాడు… ఉద్దేశం, తనే BRS పెబ్బ కావాలి… ఆ ఇద్దరే పెద్ద దెయ్యాలు… ఇదే ఆమె సీరియస్ ఆరోపణ…
.
సాక్షాత్తూ ఆయన బిడ్డే చెబుతుంది కాళేశ్వరం పెద్ద ఫ్రాడ్ కేస్ అని… హరీష్ దొంగ, సంతోష్ పెద్ద దొంగ అట… అది ఒక, ఫాఫం, kcr సుద్దపూస, ktr అంతకు మించిన భారీ సుద్దపూస… విక్టిమ్స్ అట…
.
ఇదంతా ఓకే… కేసీఆర్ ఫ్యామిలీలో ముసలం పుట్టింది… BRS and kcr family లో… రేవంత్ ఈ డ్రామా ఆడటంలో నైపుణ్యాన్ని ప్లే చేస్తుంటే… ఆమె మిగతా ఇద్దరినీ, సొంత పార్టీని కూడా శంకరగిరి మాన్యాలు పట్టిస్తోంది…
.
ఒకే ఫ్లైట్ లో రేవంత్, హరీష్ ఎక్కడికో వెళ్తుంటే… హరీష్ రేవంత్ కాళ్లు పట్టుకున్నాడు అట… మొత్తం బట్టలు విప్పుతోంది ఆమె… హరీష్ ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్… అంటే ట్రబుల్ మేకర్ అట…
.
ఆమె ఆరోపణలు నిజమో కాదో గానీ జనం ఎవరిని ఛీ కొడుతున్నారు అనేదే ప్రస్తుతం… ఇంత బతుకూ బతికి చివరకు , ఫాఫం కేసీఆర్… రేవంత్ రెడ్డి మామూలు ఆటగాడు కాదు… అందరూ ఎంత అండర్ ఎస్టిమేట్ చేశారో ఫాఫం… అవునూ, what next madam..!?
Share this Article