Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాలుగు దశాబ్దాల కెరీర్… సాఫీగా ఈరోజుకీ కుదుపుల్లేని జర్నీ…

September 4, 2025 by Rishi

.

( Dogiparti Subrahmanyam) …. మరో వారసుడొచ్చాడు . అమెరికాలో MBA చదివి ఇండియాలో తండ్రి రామానాయుడు లాగా ప్రొడ్యూసర్ అవుదామనుకుని ఏక్టరయ్యాడు వెంకటేష్ . బాలనటుడిగా ప్రేమనగర్లో తళుక్కుమన్న వెంకటేష్ హీరోగా అరంగ్రేటం చేసిన సినిమా 1986 ఆగస్టులో వచ్చిన ఈ కలియుగ పాండవులు సినిమా .

అతనికే కాదు ; ఈ సినిమాలో హీరోయిన్ దేశంలోనే మొట్టమొదట గుడి కట్టించుకున్న నటి ఖుష్బూకి కూడా తెలుగులో ఇదే మొదటి సినిమా . లక్కీ లెగ్స్ . ఇద్దరూ సక్సెస్ఫుల్ నటులు అయ్యారు . ఇద్దరికీ మొదటి సినిమా అయిన ఈ సినిమా కూడా బాగా సక్సెస్ అయింది .

Ads

ఈ సినిమాలో ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ మిగిలిన వారసులకు భిన్నంగా సెకండ్ ఇన్నింగ్సులో కుర్ర హీరోలతో కలిసి నటించటం అభినందనీయం . అది పవన్ కళ్యాణ్ కావచ్చు , రాం కావచ్చు , మరొకరు కావచ్చు . Matured artist without egostic inhibitions . Down to the earth actor .

ఈ కొత్త వారసుడి కోసం పరుచూరి బ్రదర్స్ కధను కూడా బాగా నేసారు . ధర్మసంస్థాపనే మా ధ్యేయం అనే కేకతో బయలుదేరిన కలియుగ పాండవులు చాలా సినిమాల్లో లాగే సమాజం లోని చీడపురుగులను ఏరివేస్తుంటారు . సత్వర న్యాయాన్ని అందిస్తుంటారు . పోలీసులు సైతం తాము చేయలేని కార్యాలయాలను వారు చేస్తున్నందుకు అభినందిస్తుంటారు .

రామానాయుడు గారి ఆస్థాన దర్శకుడు కె యస్ ప్రకాశరావు గారి కుమారుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వెంకటేష్ అరంగ్రేటం సినిమాకు దర్శకుడు . పరుచూరి బ్రదర్స్ కధకు బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారు . రొటీన్ రివెంజ్ అంశం ఉన్నా దానికి సొసైటీ రంగేసి సామాజిక అంశంగా ఆవిష్కరించటంతో సినిమా రక్తి కట్టింది .

డబ్బు చేసిన హీరో కాలేజి అల్లర్లు , ఆగడాలతో ప్రారంభమై , హీరోయిన్ని ముందు హర్ట్ చేసి , తర్వాత రక్షించి ప్రేమించబడి గుడ్ బాయ్ అవుతాడు . తన ప్రేయసికి అన్యాయం చేసిన తండ్రిని , ఆయన తోటి విలన్లను శిక్షించటం , వగైరా బాగా తీసారు .

హిందీ నటుడు శక్తికపూర్ , తమిళ ప్రముఖ నటుడు M R రాధ కొడుకు , నటి రాధిక (సవతి) సోదరుడు రాధా రవి నటించారు ఈ సినిమాలో . రాధా రవి తండ్రిని ఇమిటేట్ చేస్తూ నటించాడు ఈ సినిమాలో . మా తరం వారికి M R రాధ బాగా తెలుసు . మరో ప్రధాన పాత్ర సరిత నటించింది . ఎప్పటిలాగే బాగా నటించింది .

ఇతర ప్రధాన పాత్రల్లో రావు గోపాలరావు , జయంతి , నూతన్ ప్రసాద్ , రమాప్రభ , అశ్విని , రాళ్ళపల్లి , పి యల్ నారాయణ , చిట్టిబాబు , రంగనాధ్ , పి జె శర్మ , నర్రా , వంకాయల , వై విజయ , చలపతిరావు , జె వి సోమయాజులు , ఓ రాబందు , తదితరులు నటించారు . ఎప్పటిలాగే రామానాయుడు తళుక్కుమంటారు .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు బాగుంటాయి . రాఘవేంద్రరావు మార్క్ పాటల చిత్రీకరణ పూర్తిగా కనపడదు ఎందుకనో . ఆ వాసన కొద్దిగానే కనిపిస్తుంది . ఖుష్బూ , అశ్వినిలతో డ్యూయెట్లు బాగుంటాయి . నేను పుట్టిన రోజు , ఆగవా ఎందుకు , బుగ్గా బుగ్గా చెప్పాలి , ఎందుకో ఒళ్ళు వెడెక్కె మామా డ్యూయెట్లు బాగుంటాయి .

సినిమాకు ఐకానిక్ సాంగ్ పాండవులం కలియుగ పాండవులం పాట ప్రతిఘటన సినిమా ఐకానిక్ సాంగుని అక్కడక్కడా గుర్తుకు తెస్తుంది . సినిమాలో వెంకటేష్ గ్లైడర్ పైలటింగ్ అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు కొత్తే . మనం స్కూటరు కారు వాడినట్లు వెంకటేష్ సినిమాలో గ్లైడర్ని వాడుతుంటాడు . డబ్బు చేసిన కుర్రాడు కదా !

వెంకటేషుకు కొత్త నటుడిగా నంది అవార్డు కూడా వచ్చింది . మంచి బోణీయే . సినిమా ఔట్ డోర్ షూటింగ్ అంతా విశాఖపట్టణంలో జరిగింది . సినిమా యూట్యూబులో ఉంది . It’s a socio-semi political , romantic , full action , mass entertrainer . చూడబులే . వెంకటేష్ , ఖుష్బూ అభిమానులు మరోసారి చూడవచ్చు .

#తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు

#venkymama #venkatesh #victoryvenkatesh

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మదరాసి..! మరీ గజిని మార్క్ కాదు… ఏదో ఓ సగటు సౌత్ సినిమా మాత్రమే…!!
  • దేవనపల్లి కవిత..! గులాబీ యాదవ శిబిరంలో అసలైన ముసలం..!
  • సారీ జేజమ్మా… వెరీ సారీ క్రిష్… ఘాటి ఏమాత్రం గట్టి సినిమా కాదు..!!
  • దుప్పటి ఉన్నంతే కాళ్లు చాపాలి… కాదంటే అప్పులు, అవస్థలు, ఇలా…
  • మంచి పథకం..! రేవంత్ రెడ్డి కూడా అమలు చేస్తే మంచి పేరు..!!
  • కాల్ మి పాండ్, జేమ్స్ పాండ్… ఇప్పుడు చేసేవాళ్లూ లేరు, తీసేవాళ్లూ లేరు…
  • ఎండపొడ చెప్పే జీవితసత్యం కూడా ఇదే… వృద్దాప్యాన్నీ ‘డీ’కొట్టాలి …
  • 50 ఏళ్ల క్రితం… ఆస్ట్రేలియాకు వెళ్లి ‘‘పులియబెట్టే విద్య’’ చదివింది…
  • ఒకే ఒక సినిమా… ఫుల్ స్టాప్… నేనూ నా సంగీతం… అదే నా ప్రపంచం…
  • అగరుపొగలా, అత్తరులా… ఊహూఁ… ఆ శోభన తాంబూలంలోనే ఏదో వెలితి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions