.
Narendra Guptha
…. 1960 లో ad craft అనే యాడ్ ఏజెన్సీతో బిజినెస్ మొదలుపెట్టిన రామోజీరావు గారు. 1974లో తన సొంత దినపత్రికను ప్రారంభించారు.
Daily news paper వ్యవస్థను స్టార్ట్ చేయడం కోసం ఆయన తన ఇల్లు, బంగారాన్ని తాకట్టు పెట్టి ప్రింటింగ్ ప్రెస్, పేపర్ స్టాక్, ఇంక్ వగైరాలు సమకూర్చుకున్నారట..
Ads
ప్రింటింగ్ మొదలై, సర్కులేషన్ చేయాల్సిన సమయంలో పేపర్ వేసే బాయ్స్ కి జీతాలు ఇవ్వడానికి తన దగ్గరున్న బ్యాంక్ బ్యాలెన్స్ సరిపోలేదట. అయినా కూడా ఆయన వెనకాడలేదు. ఇంటింటికీ papers వేయడానికి paper boys కావలెను అని ప్రకటనలు (వివిధ మాధ్యమాల ద్వారా – వీధుల్లో పోస్టర్లు తన పేపర్లోనే యాడ్లు అలా) చేశారట.
ఇంటర్వ్యూలకు వచ్చిన కుర్రాళ్లతో రామోజీరావు గారు ఒకటే చెప్పేవారట..! “నువ్వు నెలరోజుల పాటు.. ఉదయం 4:30 గంటలకు లేచి 5 గంటలకు నా దగ్గరకు రావాలి. నేను ఇచ్చిన పేపర్లను చెప్పిన ఏరియాకు వెళ్ళి ఇంటింటికీ వేసి రావాలి” అని చెప్పారట. “నెలరోజుల పాటు నువ్వు అలా పొద్దున్నే లేచి ఈ పని చేస్తే నీకు జీవితాంతం ఉద్యోగ భద్రత కల్పిస్తా” అని భరోసా ఇచ్చారట.
అలా.. రామోజీ గారు అనుకున్న నెలరోజుల సర్కులేషన్ నిరాటంకంగా సాగిందట! ఆ మర్నాడు పేపర్లో .. “ఇప్పటివరకు నా దగ్గర ఉన్న నిధులతో నేను రోజు ఉచితంగా పేపర్ వేయగలిగాను.. ఇకపై పేపర్ కావాలంటే దరఖాస్తు చేసుకోవాలి, నెలకు, మూడు నెలలకు, వార్షిక రుసుము ఇంత అని యాడ్ ఇచ్చుకున్నారట.!
అప్పటివరకు మధ్యాహ్నం ఏ 12 కో ఒంటిగంటకో వచ్చే పేపర్ ఉదయం కళ్ళు తెరవక ముందే ఇంటిముందు కనిపించి అలవాటు అయిపోవడంతో జనాలు రామోజీ గారి దినపత్రికకు పెద్ద పట్టం కట్టారట. అలా మొదలైన ఈనాడు ఇవాళ ఎలా ఉందో, ఎక్కడ ఉందో మనందరికీ తెలిసిందే!
ఇప్పుడు ఈ పోస్ట్ రాయడానికి మూలం ఏంటో తెలుసుకుందాం: నెలరోజుల పాటు ఉదయం నాలుగున్నర గంటలకు లేచి రండి.. ఆ తర్వాత జీవితాంతం నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చిన రామోజీ గారి దగ్గర ఎందరు మిగిలారు?
ఏదైనా కొత్తలో వింతగానే ఉంటుంది. పేపర్ బాయ్ యాడ్లు చూసి వచ్చినవాళ్ళు, news paper కదా అని ఆసక్తిగా వచ్చారు. కొందరు రెండో రోజు మానేశారు, కొందరు మూడో రోజు, మరికొందరు వారం పది రోజుల పాటు చేశారట. ఈ ఫ్రీ పేపర్ ఏందో, ఈయన మనల్ని చూసుకుంటాడు అని గ్యారంటీ ఏందో అని కొందరు మానేసారట కానీ పూర్తిగా ఎవరూ చేయలేదనే చెప్తారు.
ఇది కూడా ముందుగానే గ్రహించిన రామోజీ రావు గారు.. పేపర్ బాయ్ లు కావలెను అనే యాడ్ ను ప్రతీరోజు ఇచ్చారట. ప్రతిరోజూ ఎంతోకొంత మంది వస్తూనే ఉన్నారట! అలా నెలరోజులు గడిచిపోయింది.
ఒక సక్సెస్ వెనుక ప్రపంచం తెలుసుకోని విచిత్రమైన సంఘటనలు కొన్ని ఉంటాయి. అవి.. ఒక వ్యక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఆనోటా, ఈనోటా కొనసాగుతూ ఉంటాయి. నాకు కూడా 30 ఏళ్ల క్రితం (7th standard) మా మావయ్య (మేనత్త భర్త) ద్వారా ఈ విషయం తెలిసింది.
ఈనాడు ఆదివారం అనుబంధంలో నాటి ప్రపంచ ధనికుడు వారెన్ బఫెట్ గురించి కథనం ప్రచురితం అయింది. ఆ కథను చదువుతున్న క్రమంలో రామోజీ రావు గారి పేపర్ సక్సెస్ స్టోరీ మావయ్య చెప్పారు. రామోజీ రావు గారు 36 ఏట తర్వాతే బిజినెస్ లో సక్సెస్ అయ్యారు, అప్పటివరకు చాలా ప్రయోగాలు చేశారు అని కూడా చెప్పారు.
ఆ సమయంలో నాకు వారెన్ బఫెట్ కన్నా రామోజీ రావు గారే క్రేజీ హీరోలా కనిపించారు. ఆయన 36వ ఏట నుంచి సక్సెస్ చూసాడు.. నేను 36 లోపు అంత సక్సెస్ ను చూసి రిటైర్ అవ్వాలి అన్నంత ఇన్స్పైర్ అయ్యాను…
Share this Article