Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మౌనమే మన స్ట్రాటజీ… ట్రంపుడు అందుకే అగ్గిమండిపోతున్నాడు…

September 6, 2025 by M S R

.

ట్రంపుకి అర్థం కాని యవ్వారం ఒకటే.,. ఎంత గిచ్చుతున్నా సరే, మోడీ టీమ్, ఇండియా రియాక్ట్ కావడం లేదేమిటి..? అగ్రదేశంగా ఎంత బెదిరిస్తున్నా, ఎంతగా బ్లాక్ మెయిల్ చేస్తున్నా సరే బెదరడం లేదెందుకు..?

ఈ ఫ్రస్ట్రేషన్‌లోనే నానా కూతలూ కూస్తున్నాడు… ఏకంగా ఉగ్రవాద మద్దతుదారు, భారత ద్వేషి, పాకిస్థానీ సైన్యాధ్యక్షుడితో వ్యాపారభాగస్వామ్యం పెట్టుకున్న ట్రంపు ఎంత ప్రమాదకారో ఇండియాకు అర్థమైంది… మోడీకి లేటుగా వెలిగింది.., కానీ… త్వరపడలేదు…

Ads

జైశంకర్, అజిత్ దోవల్ త్వరపడనివ్వరు… నిశ్శబ్దమే ఓ స్ట్రాటజీ… మాల్దీవుల ప్రభుత్వ ముఖ్యులకు చుక్కలు చూపించడానికి ఒక్క పరుషమైన మాటా అనలేదు మోడీ… వాడి వెన్ను వెరచడానికి లక్షద్వీప్ బీచులో జస్ట్, ఓ కుర్చీ వేసుకుని కూర్చున్నాడు… అంతే… మాల్దీవులు ఎగిరీ ఎగిరీ తిరిగి ఇండియా కాళ్ల మీదే పడింది…

సేమ్, అమెరికా సుంకాల దాడి, రష్యా ఆయిల్ కొనుగోలు ఆపేయాలని బెదిరింపులు పైకి కనిపించేవి… అమెరికాయే కాదు, ఏకంగా ఐక్యరాజ్యసమితి, వరల్డ్ బ్యాంకు వంటి ప్రపంచాన్ని శాసించే వ్యవస్థలకే ఎసరు పెట్టేస్థాయిలో బ్రిక్స్ పెరుగుతుండటంతో ట్రంపు అండ్ కో ఉడికిపోతోంది…

modi

ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధసాయం చేస్తున్నా రష్యాను దెబ్బతీసింది లేదు… చైనా జోలికి వెళ్లలేదు… అందుకే ఇండియా మీద పడింది… చివరకు మనువాదం, బ్రాహ్మణవాదం దాకా కువిమర్శలకు వెళ్లింది ట్రంప్ టీమ్… ఇక ట్రంపు అయితే చెప్పనక్కర్లేదు…

డెడ్ ఎకానమీ అంటాడు… ఏదేదో కూస్తాడు… తాజాగా మోడీ మంచి ఫ్రెండే కానీ ఇప్పుడు చేస్తున్న పనులే నచ్చడం లేదు అంటాడు… ఏమిటి..? పుతిన్, జిన్‌పింగ్, మోడీ కలవడం… ఈ మూడు దేశాలూ కలిస్తే ఫస్ట్ ముప్పు అమెరికాకే… అందుకే మండిపోతున్నాడు… ప్చ్, ఇండియాను కోల్పోయాం అని మరో పిచ్చి కూత…

సింపుల్‌గా మోడీ ఓ ట్వీట్ కొట్టాడు… మన బంధాలపై పాజిటివ్ అంచనాలకు సంతోషం, మన గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఇలాగే కొనసాగనీ అన్నట్టుగా… అంతే… సుంకాలు, మన్నూమశానాల మీద ఒక్క మాట లేదు… ఉండదు… అదే స్ట్రాటజీ…



Deeply appreciate and fully reciprocate President Trump's sentiments and positive assessment of our ties.

India and the US have a very positive and forward-looking Comprehensive and Global Strategic Partnership.@realDonaldTrump @POTUS https://t.co/4hLo9wBpeF

— Narendra Modi (@narendramodi) September 6, 2025



ట్రంపు వాచాలత, ధూర్తత్వం ఏదో తగ్గినట్టుగా భావించనక్కర్లేదు… తను ఖచ్చితంగా భారత వ్యతిరేకియే… బుజ్జగింపు ఓ నటన… బెదిరింపులే రియాలిటీ… వాడెప్పుడూ తగ్గడు, తగ్గినట్టు నటిస్తుంటాడు… తన రీసెంట్ నిర్ణయాలన్నీ భారత వ్యతిరేకత దిశలోేనే… సో, మనదైన స్ట్రాటజీతో ఎదుర్కోవడమే మార్గం… మేం నష్టపోతే నువ్వూ నష్టపోతావురా నాయనా అని సైలెంటుగా, పరోక్షంగా చెప్పడమే… ఆ హెచ్చరికే చైనాలో ముగ్గురు ప్రధాన దేశాల బాధ్యుల భేటీ…

trump

అది అమెరికాకు హెచ్చరిక సంకేతం… బ్రిక్స్, రష్యాతో దోస్తీ విషయంలో వెనుకాడే సవాలే లేదు అని చెప్పడం… నువ్వు కాకపోతే నీ తాతలున్నారురా అని చెప్పడం.., అవసరమైతే డ్రాగన్‌తో దోస్తీ చేస్తాం అని చెప్పడం… కరెక్టు స్ట్రాటజీ…

trump

అయితే చైనాను కూడా ఇండియా కూడా ఏమీ గుడ్డిగా నమ్మడం లేదు… చైనా క్రెడిబులిటీ మనకు తెలుసు… పైగా అది ధూర్త పాకిస్థాన్‌కు జాన్ జిగ్రీ… సో, దాంతో దోస్తీ అంటే పేనుకు పెత్తనం ఇచ్చినట్టే… అందుకే రష్యాతో స్నేహాన్ని బలంగా ప్రొజెక్ట్ చేస్తూనే… అమెరికా, చైనాల పట్ల ఇష్యూ బేస్డ్‌గా వ్యవహరించడమే… అదే జరుగుతోంది…

ఇండియా ఎంత పెద్ద మార్కెట్లో ట్రంపుకి తెలియకకాదు, ఇండియా కూడా అమెరికాలాగే ఆ దేశాన్ని వ్యతిరేకించడం మొదలుపెడితే… చాలా బహుళ జాతి సంస్థలు దెబ్బతినిపోతయ్… అవి ట్రంపు అధికార పునాదుల్నే పెకిలించగలవు… ప్రస్తుతానికి ఇండియా అనుసరిస్తున్న సంయమనం సరైన పద్ధతి..! అమెరికాలో జరగబోయే యూఎన్ భేటీకి మోడీ హాజరుకావొద్దనేది తాజా నిర్ణయం… అమెరికాకు అదొకరకం నిరసన..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • SCO దెబ్బ..! సొంత గోచీబట్ట సర్దుకుంటూ ట్రంపు ఆపసోపాలు..!!
  • Anjana Krishna IPS …. ఇంతకీ ఎవరీ లేడీ సింగం..? ఏమిటీ వివాదం..?!
  • మౌనమే మన స్ట్రాటజీ… ట్రంపుడు అందుకే అగ్గిమండిపోతున్నాడు…
  • కుటుంబమే వదిలేసేసరికి… ఇక కవితపై పింక్ శ్రేణుల ఉగ్ర దాడి..!
  • కారుతో పులిని గుద్దేశాడు… పులి హతం, కారు పల్టీ… దేహమంతా గాయాలు…
  • పెప్పర్ వడ విత్ రసం… ఆహా… సరిగ్గా కుదరాలే గానీ అదుర్స్…
  • Pure Veg Mineral Water…! అంతా మాయ.., అంతా మన భ్రమ… అంతా ఓ దందా…
  • ‘‘ నెల రోజులపాటు పొద్దున్నే రండి.., జీవితాంతం ఉద్యోగభద్రత ఇస్తా ’’
  • ఆ చిన్న పాట వందల మందిని చంపేసింది… ఆ రచయితను కూడా..!!
  • మదరాసి..! మరీ గజిని మార్క్ కాదు… ఏదో ఓ సగటు సౌత్ సినిమా మాత్రమే…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions