.
Nàgaràju Munnuru
….. ఇటీవల చైనాలో జరిగిన SCO సదస్సులో అమెరికా డాలర్ ఆధిపత్యానికి స్వస్తి పలికి భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం అయిన కొన్ని రోజుల తర్వాత…
తన గోచీ బట్ట సర్దుకునే సమయం ఆసన్నమైందని ట్రంపుకి అర్థమైంది… తన వాచాలత ఏ విపరిణామాలకు దారితీస్తున్నదో కూడా అర్థమైంది… అందుకే…
Ads
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌లో వేరే రకమైన శక్తిని సమీకరించే పనిలో పడ్డాడు.
వాళ్ళు ప్రపంచ నాయకులు కాదు…
సైనిక జనరల్స్ కాదు…
అమెరికాలోని అతిపెద్ద టెక్ బిలియనీర్లు…
ట్రంప్ ఏర్పాటు చేసిన ఈ విందు సమావేశంలో పాల్గొన్నవారు…
ఆపిల్ – టిమ్ కుక్
ఫేస్బుక్ – మార్క్ జుకర్‌బర్గ్
గూగుల్ – సుందర్ పిచాయ్,
మైక్రోసాఫ్ట్ – సత్య నాదెల్ల, బిల్ గేట్స్, సామ్ ఆల్ట్‌మాన్,
ఆల్ఫాబెట్ – సెర్గీ బ్రిన్ మరియు సఫ్రా కాట్జ్
టెస్లా – ప్రతినిధిని పంపిన ఎలోన్ మస్క్
ట్రంప్ సాధారణ పలకరింపులు, ప్రశంసల తర్వాత అతను వారిని ఒక సరళమైన కానీ శక్తివంతమైన ప్రశ్న అడిగాడు:
- “మీరు అమెరికాలో కొత్తగా ఎంత పెట్టుబడి పెడుతున్నారు?”
“మీరు అమెరికాకు కొత్తగా ఏమి తీసుకువస్తున్నారు?”
అది డబ్బు పెట్టుబడి గురించి మాత్రమే కాదు. నిజానికది ఒక హెచ్చరిక.
తూర్పు దేశాలైన రష్యా, చైనా, భారతదేశం తమ ఆర్థిక వ్యవస్థలను పునర్ నిర్మించుకుంటూ, సాంకేతికతలో ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికా వెనుకబడి ఉండటం భరించలేనిది…
ట్రంప్ హెచ్చరిక స్పష్టంగా ఉంది. CEO లారా, మీరు మీ కంపెనీల విలువలను పెంచుకోవడంకంటే ఇంకా ఏదో ఎక్కువ చేయాలి. మీరు అమెరికా దేశ భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంలో సహాయం చేయాలి.
ట్రంప్ మాటలకు సమాధానంగా….
జుకర్‌బర్గ్: 600 బిలియన్ డాలర్లు
టిమ్ కుక్: మరో 600 బిలియన్ డాలర్లు
సుందర్ పిచాయ్: 2 సంవత్సరాలలో 250 బిలియన్ డాలర్లు
సత్య నాదెళ్ల: ప్రతి సంవత్సరం 75–80 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు.
వెల్, దీంతో ఎంతో మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించవచ్చు అన్నారు ట్రంప్.
టెక్ దిగ్గజాల సమావేశం ముగిసే సమయానికి, ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల హామీ లభించింది.
కాబట్టి దీని అర్థం ఏమిటి?
ఒకవైపు, తూర్పు దేశాలు చమురు, ఖనిజ వనరులు, వాణిజ్యం ద్వారా పొత్తులను నిర్మిస్తుండగా… అమెరికా ఇప్పటికీ సాంకేతికత ద్వారా భవిష్యత్తును నియంత్రిస్తుందని ట్రంప్ చూపించాలనుకున్నాడు.
సిలికాన్ వ్యాలీ అమెరికా యొక్క నిజమైన ఆయుధం.
కారణాలు ఏమైనా ట్రంప్ భారత్ మీద విపరీతమైన అక్కసు పెంచుకున్నాడు అనేది స్పష్టం. ఇప్పుడు ఈ టెక్ దిగ్గజ కంపెనీలకి భారత్ కి ఐటీ ప్రాజెక్టులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వవద్దని అనధికార హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇది రాబోయే రోజుల్లో భారత ఐటీ పరిశ్రమకు పెద్ద దెబ్బ కావచ్చు. ఎందుకంటే భారత ఐటీ రంగంలో అమెరికా ఎగుమతుల మీదనే అధికంగా ఆధారపడి ఉంది.
ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు కొన్నాళ్ళు అనవసర ఖర్చులు, ఆడంబరాలకు పోకుండా డబ్బులను పొదుపు చేసుకోవడం, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించడం మంచిదని నిపుణుల సలహా….. - నాగరాజు మున్నూరు
Share this Article