Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమృతాంటీ… మరీ అనసూయాంటీ ఆవహించిందా ఏమిటి..?!

September 10, 2025 by M S R

.

దేశంలో గత మూణ్నాలుగు రోజులుగా ఒక విషయం చర్చనీయంశంగా మారింది..! మహారాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి అమృత ఫడ్నవీస్ వస్త్రధారణపై ట్రోల్స్, తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది..!

ఒక ఆడది ఏ డ్రెస్ ధరించాలో ఆమె ఇష్టం, మీరెవడ్రా అంచనా వేయడానికి, జడ్జి చేయడానికి, విమర్శించడానికి అని స్టీరియో టైప్ విమర్శలు మరీ అనసూయాంటీ భాషలో తరువాత చేద్దురు గానీ… ముందు విషయమేమిటో చదవండి…

Ads

ఇటీవల గణేష్ మహానిమజ్జనం పూర్తైన తర్వాత రోడ్లపై.. సముద్రం ఒడ్డున పేరుకుపైన చెత్త ఎత్తివేత కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నది ఆమె… నటుడు అక్షయ్ కుమార్ సహా పలువురు సినీరాజకీయ రంగాలు.. సంపన్న కుటుంబాలకు చెందిన వారు కూడా పాల్గొన్నారు…

amritha

గుడ్, తప్పులేదు… నిజానికి ఆమె ఇలాంటి సోషల్ యాక్టివిటీలో చురుకుగా ఉంటుంది… కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆమె వచ్చిన తీరు… ధరించిన వస్త్రాలు.. తీవ్ర వివాదానికి కారణమయ్యాయి… సహజం, అంత నీచంగా ఉన్నాయి అవి… అంటే..? కురచ బట్టలు వేసుకుందా..?

amrita fadnavis

లేదు… అలా వేసుకున్నా పర్లేదేమో… ఫుల్ స్కిన్ టైట్ స్పోర్ట్స్ సూట్ లో… ఆమె శరీర ఆకృతిని స్పష్టంగా బయటకి కనిపించేంత బిగువైన దుస్తులు ధరించింది… మీడియా వీడియో గ్రాఫర్ల దృష్టి మొత్తం ఆమె శరీరంపైనే కేంద్రీకృతం చేసేంతగా ఆమె వస్త్రధారణ ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి… కొన్ని సైట్లు, చానెళ్లు ఆ ఫోటోలు, వీడియోలను ప్రసారం చేసి, పబ్లిష్ చేసి పండుగ చేసుకుంటున్నాయి కూడా…

amritha

నిజానికి ఆమె సాధారణ సంపన్న కుటుంబానికి, సినిమా లేదా మోడలింగ్ రంగానికి చెందిన వ్యక్తి అయితే ముంబై లాంటి నగరాల్లో పెద్దగా పట్టించుకోరు… కానీ ఆమె స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి… రాష్ట్ర ప్రజలు గౌరవించే స్థానంలో ఉన్న వ్యక్తి..!

amritha

ఆమె ఓ ఉన్నతస్థాయి బ్యాంకర్… ఓ సోషల్ యాక్టివిస్ట్… ఓ మోడల్ కావచ్చు, ఏమైనా కానీ… ఈ దేశ వాణిజ్య రాజధాని, మోస్ట్ హేపెనింగ్ స్టేట్ సీఎం భార్య… పైగా పద్దతి, సంప్రదాయం ఎట్సెట్రా వల్లించే బీజేపీ నేత భార్య… మరీ ఏమిటిలా..? అందుకే రాష్ట్రవ్యాప్తంగా ట్రోెల్స్, మీమ్స్ అదిరిపోతున్నయ్…

amruta

ఈ విమర్శలకు ఖచ్చితంగా ఆమె అర్హురాలే… సరైన వస్త్రధారణ లేకుండా జనం నుంచి గౌరవం ఏం ఆశిస్తుంది ఆమె..? భర్తకు తలవంపులు తప్ప..!! మరీ బిగ్‌బాస్, తెలుగు టీవీ షోలలో రష్మి, శ్రీముఖిలు కూడా ఇంత ఘోరంగా డ్రెస్ వేసుకోవడం లేదు ఈమధ్య ఫడ్నవీస్ భాయ్…

ఒక ముఖ్యమంత్రి భార్య ఓ సోషల్ ప్రోగ్రాంలో అంత ఎక్స్‌పోజింగ్ చేయాల్సిన అవసరం ఏముంది..? పిల్లల తల్లి, ఎంత హుందాగా ఉండాలి..? amrtutha

నిజానికి అమృత లైఫ్ స్టైల్ మొదటినుండి అలాగే ఉంది… సేవా కార్యక్రమాలు, శుభకార్యాలు, ప్రైవేటు పార్టీలు… ఏదైనా సరే ఆమె చాలా చురుకుగా పాల్గొంటారు… ఆడవాళ్ళ వస్త్రధారణ.. సనాతన ధర్మం గురించి నీతులు వల్లించే పార్టీకి చెందిన ఒక ముఖ్యమంత్రి భార్య ఇలా టైట్ దుస్తులు ధరించి ప్రదర్శన.చేస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీ కేడరే ప్రశ్నిస్తున్నది..!!

amritha

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నేపాల్ జనాగ్రహం వెనుక ఇది మరో కోణం… మనకూ డేంజరే…
  • అమృతాంటీ… మరీ అనసూయాంటీ ఆవహించిందా ఏమిటి..?!
  • డాక్టర్ సాబ్… 20 ఏళ్ల క్రితం నా ప్రాణాలు కాపాడారు గుర్తుందా..?
  • నవలా రాక్షసుడు + సినిమా రాక్షసుడు + నట రాక్షసుడు…!!
  • ఐఫోన్-17 సీరీస్… ఈ కొత్త మోడళ్ల అదిరిపోయే కీలక ఫీచర్స్ ఇవే…
  • ‘‘నీ పేరే పెట్టుకున్నాం, మా డ్రగ్ రాకెట్‌ను ఆశీర్వదించు మాతా…’’
  • లిటిల్ హార్ట్స్ సక్సెస్ సినిమా ఇండస్ట్రీకి చెబుతున్న పాఠమేమిటంటే..!
  • ఏమో, రమ్యకృష్ణే కావాలని ఆ బాహుబలి నిర్మాతే కోరుకున్నాడేమో…!
  • కాదు… ఆమె మరో షర్మిల కాదు… రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉంటుంది…
  • మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్… జనాగ్రహం బద్దలు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions