.
డిజిటల్ మీడియా ప్రభావం పెరుగుతోంది… జనంలోకి వేగంగా వెళ్తోంది… టీవీ మీడియా తన ఉనికిని తాను కాపాడుకుంటోంది… రేటింగ్స్ తగ్గిపోతూ, అంటే జనం న్యూస్ చానెల్స్ వీక్షణం పడిపోతున్నా మరీ అంత ప్రమాదకరంగా ఏమీ లేదు…
మరోవైపు సోషల్ మీడియా విస్తృతంగా పెరుగుతోంది… ఈ స్థితిలో ప్రింట్ మీడియా, అనగా పేపర్ల పరిస్థితి ఏమిటి..? సర్క్యులేషన్ పడిపోతోందా..? ఎవడూ పట్టించుకోవడం లేదా..? ఈ ప్రశ్నకు పత్రికల సర్క్యులేషన్ ఎంతో నిర్ధారించే ఏబీసీ చెబుతున్న సమాధానం… లేదు, పత్రికలు మళ్లీ ఆదరణ పెంచుకుంటున్నాయి అని..!!
Ads
గత ఆరు నెలలతో పోలిస్తే… ఈ ఏడాది జనవరి నుంచి జూన్ లెక్కలు చూస్తే 2.77 శాతం పత్రికల అమ్మకాలు పెరిగాయని ఏబీసీ చెబుతోంది… నిజానికి అది కొడిగడుతున్న ప్రింట్ మీడియాకు శుభవార్తే… కానీ పెద్ద మీడియా హౌజుల పత్రికల అమ్మకాలు పరిశీలిస్తే… అన్నీ ఎంతో కొంత తగ్గాయి గానీ, పెరగలేదు… మరి ఈ 2.77 శాతం పెరుగుదల ఎలా వచ్చిందో అర్థం కాలేదు… ఓసారి ఈ లిస్టు చూడండి…
బట్, వోకే… పెరిగిన ముద్రణ, పంపిణీ వ్యయం, డిజిటల్ మీడియా విస్తృతి గట్రా ప్రభావాలతో పోలిస్తే కనీసం ప్రింట్ మీడియా తన ఉనికిని కాపాడుకుంటున్నదనే విషయం మాత్రం అర్థమవుతోంది… ఎప్పుడైతే సోషల్ మీడియా అబద్ధాలు, అతిశయోక్తులు, బ్యాడ్ ప్రాపగాండాకు అడ్డాగా మారిందో… మళ్లీ ప్రింట్ మీడియానే బెటర్ అనే స్థితికి పాఠకులు చేరుతున్నారు… అది ఫ్యాక్ట్…
సరే, ఇతర భాషలు, ఇతర రాష్ట్రాల పత్రికల్ని వదిలేద్దాం… మన తెలుగు పత్రికల స్థితి ఏమిటీ అంటారా..? 1) గతంలో భజన, ఇప్పుడు విద్వేషం… ఈ ఎక్స్‌ట్రీమ్ అపాత్రికేయ పోకడలతో నమస్తే తెలంగాణ నానాటికీ తీసికట్టు అన్నట్టు మారింది… చివరకు ఏబీసీ నుంచి వైదొలిగింది… అందులో ఉంటే దాని అసలు పాఠకులు తెలిసిపోతారు కదా… ఇజ్జత్ పోతుంది, జనం ఎవడూ చదవడం లేదని తెలిసిపోతుందిగా… సో, దాన్ని వదిలేస్తే…
ఇక మిగతావన్నీ మార్కెట్‌లో ఉన్నాయంటే ఉన్నాయి అంతే… పేర గొప్పలు, ఊరు దిబ్బలు… ఈరోజుకూ తెలుగులో పెద్ద పత్రికలూ అంటే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి… అంతే… ఇప్పుడు వాటి సిట్యుయేషన్ ఏమిటీ అంటే…
ఇదీ కథ… ఇందులో కొన్ని విశేషాలు…
- స్టిల్ ఈనాడుకు తిరుగులేదు… అదే తెలుగు అగ్రశ్రేణి పత్రిక… ఎంతగా నాసిరకం దాన్ని కమ్మేస్తున్నా సరే, దాని బ్రాండ్ విలువ దాన్ని కాపాడుతోంది… కాదు, తోటి పత్రికల వైఫల్యాలు, బలహీనతలే ఈనాడు బలంగా నిలబడగలుగుతోంది…
- కానీ సాక్షికీ, ఈనాడుకూ నడుమ తేడా చెరిగిపోతోంది… రెండింటి నడుమ తేడా 1.73 లక్షల కాపీలు మాత్రమే…
- ఈనాడు, సాక్షితో పోలిస్తే ఆంధ్రజ్యోతి చాలా దూరంలో ఉండిపోతోంది… ఎంత దమ్ బిర్యానీలాగా మసాలాలు గుప్పించినా సరే గానీ ఎందుకో పాఠకుడు దాన్ని లైట్ తీసుకుంటున్నాడు…
సరే, కరోనా తరువాత ప్రింట్ మీడియా గత స్థితికి చేరినట్టేనా..? లేదు… చేరనట్టే… కాకపోతే డౌన్ ఫాల్ ఆగిపోయింది… అదే పత్రికలకు ఊరట…
పోస్ట్ కరోనా పీరియడ్‌లో అసలు ఇక పత్రికలు మార్కెట్‌లో ఉంటాయా అన్నంత సంక్షోభం కనిపించింది… ఈనాడు ఏకంగా 2.73 లక్షల కాపీలను కోల్పోతే, సాక్షి 2.31 లక్షలు కోల్పోయింది… (ఆంధ్రజ్యోతి స్వల్పం)… అంతెందుకు..? మళ్లీ ఆ పాత వైభవం వస్తుందా అంటే చెప్పడం కష్టం… ఒక దశలో 14.88 లక్షల కాపీలున్న ఈనాడు సర్క్యులేషన్ ఇప్పుడు 11.82 దగ్గరే కొట్టుకుంటోంది…
ఏ ప్రాంతంలో ఏమిటి..? నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కర్నూలు జిల్లాల్లో ఈరోజుకూ సాక్షి ఈనాడుకన్నా మిన్న… డామినేట్ చేస్తుంది… మిగతా జిల్లాల్లో ఈనాడు- సాక్షి పోటాపోటీయే… వాలంటీర్లకు ఇచ్చే పేపర్ అలవెన్సు రద్దు చేసి, సాక్షి సర్క్యులేషన్ దెబ్బతీయాలని కూటమి ప్రభుత్వం అనుకున్నా, అది పెద్దగా సాక్షి మీద నెగెటివ్ ప్రభావం ఏమీ చూపలేదు… ఏపీలో ఇప్పటికీ మీడియాకు సంబంధించి అది ఎఫెక్టివ్ ప్లేయరే…
బట్, తెలంగాణలో ఈనాడుది స్పష్టమైన డామినేషన్… సాక్షి బలహీనత ఏమిటంటే..? అది తెలంగాణలో మరో నమస్తే సాక్షిలా మారిపోవడం, ఈరోజుకూ జనం మూడ్‌కు భిన్నంగా ప్రొ- కేసీయార్ (యాంటీ రేవంత్) స్టాండ్‌తో ఉండటం… యాంటీ పీపుల్… తెలంగాణకు సంబంధించి పత్రిక అంటే జస్ట్, ఈనాడు… అంతే… ప్రస్తుతానికి ఇదీ పరిస్థితి…!!
మామూలుగా పత్రిక ఓ ప్రతిపక్షంగా ఉంటే జనం ఆదరిస్తారని అంటారు కదా… కానీ సిట్యుయేషన్ భిన్నంగా ఉంది… ఈనాడు, ఆంధ్రజ్యోతి… ఈ రెండూ ఏపీలో కూటమి ప్రభుత్వానికి, తెలంగాణలో రేవంత్ ప్రభుత్వానికి సపోర్టుగా నిలబడినా సరే… పెద్దగా నష్టపోయిందేమీ లేదు..!!
Share this Article