.
కేటీయార్ విసురుతున్న మగతనం సవాళ్లు ఒకరకంగా ఆడవాళ్లను, ఆడతనాన్ని కించపరచడమే… ప్రధాన స్రవంతి రాజకీయాల్లో అభ్యంతరకరమైన పదజాలమే… వివరాల్లోకి వెళ్తే…
ఏపీ రాజకీయాలు ఎందుకూ పనికిరావేమో బహుశా… తెలంగాణ రాజకీయాల్లోనూ పరుషపదాల్ని యథేచ్ఛగా వాడేస్తున్నారు… చాన్నాళ్లుగా ఇది రాష్ట్రంలో చర్చనీయాంశమే… తాజాగా కేటీయార్ వ్యాఖ్యలు మళ్లీ డిబేటబుల్…
Ads
‘‘రేవంత్ రెడ్డీ, నీకు దమ్ముంటే, నువ్వు మగాడివి అయితే… ఆ 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేపించు… ఎన్నికల్లో చూసుకుందాం… ఎవరి సత్తా ఏందో… ఎవరి పని తీరు ఏందో ప్రజలు నిర్ణయిస్తారు’’ అని ఏదో సభలో కేటీఆర్ ఉరుముతున్నాడు…
ఆ దగ్గూదమ్మూ భాష ఏమిటో గానీ… ఈ దమ్ము నిర్వచనం ఏమిటో ఓ భ్రహపదార్థం గానీ… మరి ఈ మగ భాష ఏమిటో, మగతనం నిర్వచనాలు ఏమిటో కేటీయార్ ఇంకాస్త వివరంగా చెబితే బాగుండు…
ఓహో, ఆ పది మందితో రాజీనామా చేయిస్తేనే రేవంత్ రెడ్డిది మగతనమా..? అప్పుడే మగాడా..? లేకపోతే..? ఆడది అయిపోతాడా..? అంటే ఆడతనం… అంటే ఆడతనం అంటే చేతకానితనమా..? అంటే ఆడవాళ్లకు ఏమీ చేతకాదనేనా..?
ఈ ఆడ లేడీస్, మగ జెంట్స్ భాషలు, నిర్వచనాలు వదిలేస్తే… సరే, రేవంత్ రెడ్డిది ఆ చేతకాని ఆడతనమే అనుకుందాాం… కేటీయార్ భాషలోనే చెప్పాలంటే… రేవంత్ రెడ్డిని మగ లేడీస్ రకమో, లేడీ జెంట్స్ రకమో… ఏదో ఒకటిలే అనుకుందాం…
మరి… పదేళ్లలో ఇదే బీఆర్ఎస్ అధినేత ఏం చేశాడు..? దాదాపు అన్ని పార్టీలకూ చెందిన మగ నేతల్ని రప్పా రప్పా తన పార్టీలోకి నానా ప్రలోభాలతో లాగేశాడు కదా… మంత్రులనూ చేశాడు కదా… అదేమయ్యా అంటే..? రాజకీయ శక్తుల పునరేకీకరణ అనే మరో బ్రహ్మపదాన్ని వల్లించాడు కదా… ఒక్కరితోనూ రాజీనామా చేయించి, ఎన్నికలకు సై అనలేదు కదా… ఈ ‘తనం’ పేరేమిటో…
జంపింగులు రాజకీయాల్లో అనైతికమే… కానీ దాన్ని తెలంగాణలో పీక్స్‌లోకి తీసుకుపోయింది ఎవరు..? కేసీయార్..! జంపింగులను రాజకీయాల సహజలక్షణంగా మార్చిందే తను… జాతీయ రాజకీయాల్లో రికార్డులు బీజేపీ పేరిట ఉంటాయి…
ఫిరాయింపుల చట్టానికి దొరకకుండా కూడా బోలెడు వేషాలు… రియాలిటీ ఇదయితే… అందరూ ఈ అనైతిక రాజకీయ బురదలో నిలువెత్తు నిలబడ్డాక… ఇక ఇందులో ఆడతనం ఏమిటో, మగతనం ఏమిటో ఎవరు చెప్పాలి..? ఎవరు నిర్వచించాలి..?
Share this Article