.
వర్గకసి … సాధారణంగా మావోయిస్టు భాషలో చాలాసార్లు వినిపించే పదం ఇది… మన శత్రువు ఎవరో స్పష్టంగా తెలిసి, వాడి బలాలపై, బలహీనతలపై దెబ్బతీయడానికి సర్వవేళలా సన్నద్ధంగా ఉండాల్సిన మనోస్థితి ఇది…
ప్రధానిగా ఉన్నది యోగి కాదు… మోడీ… తనలో ఆ జాతీయతాభావపు కసి కనిపించడం లేదు… మాటల్లో తప్ప పాకిస్థాన్‌కు చేతల్లో జవాబులు చెప్పే దూకుడు లేదు… ఎవడో ఆదేశించాడని అర్థంతరంగా ఆపరేషన్ సిందూర్‌ను, అదీ మన రక్షణ బలగాలు అద్భుతమైన ఆధిపత్యం సాధించిన దశలో… పాకిస్థాన్ దిమ్మతిరిగి కాళ్లబేరానికి వచ్చిన స్థితిలో ఆపేయడం దేశవ్యాప్తంగా మోడీపై అసంతృప్తిని పెంచింది…
Ads
బీజేపీ కేడర్‌లో కూడా అదే భావన… ఆపరేషన్ సిందూర్‌కు దారితీసిన ఘాతుకం ఏమిటి..? పహల్గాం ఉగ్రదాడి… పర్యాటకుల మతం కనుక్కుని మరీ హతమార్చిన దుర్మార్గం… దాని వెనుక పాకిస్థాన్ అడ్డాగా చెలరేగే ఉగ్రవాదులు, వాటికి రక్షణగా పాకిస్థాన్… మరి అప్పుడే అది మరిచిపోయాడా మోడీ..?
నీళ్లు- నెత్తురు కలిసి ప్రవహించవు అన్నాడు కదా… మరి కలిసి క్రికెట్ ఆడతాయా..? అదేమైనా అత్యవసరమా..? ఆడకపోతే ఏం పోయింది..? ఆడితే ఏమొచ్చింది..? వర్గకసి లేని మోడీ తీరు పట్ల దేశం పెదవివిరుపు తప్ప..!!
సుబ్రహ్మణ్యస్వామి, అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలకు ఉన్న సోయి, జాతీయతా స్పూర్తి ప్రధాన పాలకుడికి లేకుండా పోయింది… అందుకే నిన్న సోషల్ మీడియాలో… ఇదుగో, ఈ ఫోటో బాగా వైరల్…
ఆ మ్యాచ్ బాయ్‌కాట్ చేసి ఉంటే… పాకిస్థాన్‌కు ప్రపంచవేదిక మీద బుద్ధిచెప్పినట్టు ఉండేది కాదా..? పహల్గాం ఘాతుకాన్ని మరోసారి ప్రపంచానికి చెప్పి ఉండేవాళ్లం కాదా..? ఈ క్రికెట్‌తో వచ్చే చిల్లర డబ్బులు కావాలా ఈ దేశానికి..?
పహల్గాం ఘాతుకానికి నిరసనగా చేతులకు నల్ల బ్యాడ్జీలు ధరించారు, పాకిస్థాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు… విజయాన్ని ఆర్మీకి అంకితం ఇవ్వడం..? ఇవేనా పాకిస్థాన్‌కు చూపాల్సిన నిరసన సంకేతాలు..? నిజంగా ఈ మ్యాచ్ ఇండియా గెలిచింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మోడీకి, బీసీసీఐకి వాచిపోయేది ఈ దేశ ప్రజల విమర్శలతో…
ఒక బాల్ ఠాక్రే వంటి (ప్రజెంట్ ఠాక్రే క్షుద్రవారసులు కాదు) నేతలు ఉంటే… నిరసన మరో రీతిలో ఉండేది… ఇప్పుడు ఆ కాలిబర్ ఉన్న జాతీయ నేతలు ఎవరూ లేకపోవడం మోడీకి వరం…
ఐఎస్ఐ గానీ, ఐసిస్ గానీ… ఏ ఉగ్రవాద ప్రస్తావన వచ్చినా ఒవైసీ స్పందన బాగుంటోంది… ఇప్పుడు కూడా… స్వార్థ, సంకుచిత రాజకీయాలు తప్ప విశాల జాతీయ భావనలు వీసమెత్తు కనిపించని ప్రాంతీయ పార్టీలను వదిలేద్దాం… కాంగ్రెస్ పార్టీకి ఏమైంది..? లెఫ్ట్ పార్టీలకు ఏమైంది..?
ఇక్కడ క్రికెెట్ ఆడటం మీద కాదు అభిశంసన… పహల్గాం వితంతువులు, బాధిత మహిళలు కోల్పోయిన సిందూరం పట్ల మన కేంద్ర ప్రభుత్వం కనబరిచిన అగౌరవమే అభ్యంతరకరం…!!
Share this Article