.
బ్రిటన్ స్థానికుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది… కట్టలు తెంచుకుంటోంది… నిన్న లండన్ వీథుల్లో కనిపించిన జనప్రదర్శన అదే… కానీ ఎందుకు..?
వలసదారులు… ఇదే బ్రిటన్ ఆందోళన ఇప్పుడు… అక్కడి ప్రభుత్వాలకు వలసలపై ఓ విధానం అంటూ లేకపోవడం… విశాల ప్రపంచం, గ్లోబల్ విలేజ్, జాతుల మధ్య సఖ్యత, ఔదార్యం, మానవత్వం భావనలతో ఇన్నేళ్లూ వలసదారులపై ప్రదర్శించిన మానవీయ ధోరణి చివరకు తమ సంస్కృతికి, తమ ఉపాధికి, తమ స్థానికతకే ఎసరు పెట్టే పరిస్థితి రావడం… ఇదే ఇప్పుడు బ్రిటన్ జనంలో మండుతున్న అసహనం…
Ads
బర్మా, బంగ్లాదేశ్‌ల నుంచి వస్తున్న వలసదారులతో బెంగాల్ కొన్ని జిల్లాలు ప్లస్ ఈశాన్యంలోని పలు జిల్లాల్లో స్థానికుల జనాభా తగ్గిపోయి, వలసదారుల జనాభా పెరిగిపోయి, చివరకు స్థానికులే మైనారిటీలు అయిపోయి అవస్థలు పడుతున్న దుష్ప్రభావాలు చూస్తున్నాం కదా… బ్రిటన్‌వాసులు భయం కూడా అదే…
2025లో ఒక పెద్ద సర్వే జరిగింది… బ్రిటన్ ప్రజల్లో సుమారు 48% మంది వలసదారుల సమస్యను దేశంలో అత్యంత ముఖ్యమైన అంశంగా చెప్పారు… అంటే అర్థమవుతోంది కదా, వలసదారులతో బ్రిటన్ ఎదుర్కుంటున్న సమస్యల్ని ఆ స్థానికులు ఎలా భావిస్తున్నారో… ఈ సర్వేని Ipsos అనే సంస్థ ఆగస్టులో నిర్వహించింది…
సరళంగా వివరాలివి...
-
సర్వేలో అడిగిన వాళ్లలో 48% మంది వలసదారుల సమస్యే ఎంతో ముఖ్యమని నొక్కి చెప్పారు.
-
గత జులై సర్వే ఫలితాలతో పోలిస్తే ఇది 8% పెరిగింది… అంటే వలసదారుల సమస్యే బ్రిటన్‌కు ఓ పేద్ద పీడగా భావిస్తున్నవారి సంఖ్య నెలనెలకూ పెరుగుతోంది…
-
ఈ ఆందోళన ఎక్కువగా 55 మించి వయస్సుల వారిలో ప్రధానంగా కనిపిస్తోంది.., Conservative పార్టీ, Reform UK పార్టీ వాళ్లలో ఈ ఆందోళన ఎక్కువగా ఉంది…
-
Labour పార్టీకి చెందినవారిలో ఇది తక్కువ (33%) మాత్రమే…
-
18 నుండి 34 ఏళ్లు వయస్సు ఉన్న యువతలో కూడా 34% ఈ సమస్యను అత్యంత ముఖ్యంగా పరిగణిస్తున్నారు…
-
ఆర్థిక పరిస్థితి (33%) మరియు ఆరోగ్య సేవలు (NHS) (22%) తర్వాత మొత్తం ప్రజలు ఎక్కువ ఆందోళన చూపిన అంశం వలసదారుల సమస్యే…
ప్రతి ఒక్కరూ ప్రభుత్వం వలస విషయాలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఫెయిల్ అని చెబుతున్నారు… గత కన్జర్వేటివ్ ప్రభుత్వం కాస్త నయం… అది తీసుకున్న చర్యలతో పోల్చినా ఇప్పటి Labour ప్రభుత్వం మరీ పూర్ పనితీరు అని 42% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు…
సమస్యగా భావిస్తున్న ప్రధాన అంశాలు:
-
వలసదారుల సంఖ్య వేగంగా పెరుగుతుందన్న భావన…
-
స్థానిక వనరులు, ఉద్యోగాలు, ఆరోగ్యం,, హౌసింగ్ పై ఇది భారంగా భావించడం…
-
ప్రభుత్వ ఔదార్యం, నిర్లిప్తతపై ఆందోళన…
ఈ సమాచారంతో బ్రిటన్ ప్రజలలో వలసదారులపై ఉన్న ఆందోళన స్థాయిలు, రాజకీయ పరిస్ధితులు స్పష్టమవుతాయి…
2024 చివరి నాటికి 5.15 లక్షల మంది శరణార్థులు అధికారికంగా ఉండగా, 1.25 లక్షల మంది అక్రమ వలసదారులుగా బ్రిటన్ ఆశ్రయం కోరారు… గుర్తింపు లేకుండా ఉండేవారి అంచనా మరింత ఎక్కువ… రెట్టింపుకన్నా ఎక్కువ అని ఓ అంచనా…
-
ఉపాధి పోటీ: కొంతమంది స్థానికులు వలసదారుల వల్ల తమ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని భావిస్తున్నారు. కొన్ని పరిశ్రమలలో వలసదారులు తక్కువ వేతనాలతో పని చేసేందుకు సిద్ధపడడం కూడా స్థానికులకు ఇబ్బంది కలిగిస్తోంది…
-
ప్రభుత్వ వనరుల భారం: ఆరోగ్య సేవలు, మునిసిపల్ గృహాలు, విద్య వంటి రంగాలపై వలసదారుల కారణంగా అదనపు భారం పడుతున్నట్లు ఆందోళన, అసంతృప్తి…
-
నేరాల ఆందోళన: ఇటీవల కొన్ని ఘర్షణలు, దోపిడీలు, చిన్నచిన్న నేరాలను వలసదారులకు అన్వయిస్తూ ప్రచారం జరుగుతోంది… మానవ అవయవాల అక్రమలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి ఆరోపణలు ప్రధానం…
-
సాంస్కృతిక విరుద్ధత: ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలనుంచి వచ్చిన వలసదారులు స్థానిక సంస్కృతిని దెబ్బతీస్తారని, మధ్యప్రాచ్య అంశాలు ప్రభావం చూపిస్తున్నాయనే అసహనం పెరుగుతోంది.
-
“జాతి మార్పు” భయం: “Great Replacement” అనే భావనను ప్రాధాన్యంగా చూపుతున్నారు— చివరకు బ్రిటన్ వలసదారులతో నిండిపోయి, బ్రిటన్ సంస్కృతి, ఉపాధి, సార్వభౌమత్వం దెబ్బతింటాయనేది ఆగ్రహాన్ని పెంచుతున్న భావనలు…
అందుకే స్టాప్ బోట్స్ (ఆ పడవల్ని ఆపండి) అనేదే నిన్నటి ప్రదర్శనల్లో ప్రధాన నినాదం… (వలసదారులు బోట్లలో అక్రమంగా వస్తున్నారని..) బ్రిటన్ ఆందోళనలు మన కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా సంకేతాలను ఇస్తున్నాయా..?
మరో ముఖ్యమైన విశ్లేషణ కూడా చదవాలి… మిత్రుడు మున్నూరు నాగరాజు ఏమంటాడంటే..?
దేశ వనరులను, ఉద్యోగాలను కొల్లగొడుతూ, స్థానిక సంస్కృతిని నాశనం చేస్తూ స్థానికులకు ఇబ్బందులు కలిగించడంతోపాటు మరో ఆగ్రహం స్థానికుల్లో పెరుగుతోంది… అందులో ముఖ్యంగా పాకిస్థాన్ నుండి వచ్చిన అక్రమ వలసదారులు గ్రూమింగ్ గ్యాంగ్ పేరుతో ముఠాలుగా ఏర్పడి బ్రిటన్ అమ్మాయిలను సామూహిక మానభంగం చేయడం…, ఆపై హత్యలు చేయడం ఒక పనిగా పెట్టుకున్నారు… ఒక అంచనా ప్రకారం బ్రిటన్ లో ప్రతి 5 మంది టీనేజ్ అమ్మాయిల్లో ముగ్గురు ఈ గ్రూమింగ్ గ్యాంగ్ బాధితులుగా మారే అవకాశం ఉందనేది ఆందోళన కలిగించే అంశం…
గళమెత్తిన జాతీయవాది
వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న టామీ రాబిన్సన్ గళమెత్తారు… యునైటెడ్ ది కింగ్డమ్ అని ఆయన ఇచ్చిన నినాదంతో బ్రిటన్ ప్రజలు ఆందోళనకు దిగారు… రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఎలాన్ మస్క్ వర్చువల్ గా మాట్లాడారు…
” బ్రిటన్ పౌరుడుగా ఉండటం గొప్ప విషయం. కానీ దేశం నాశనం అవడం నేను ఇప్పుడు చూస్తున్నా. చిన్నగా ఇది మొదలైంది. కానీ ఇప్పుడు భారీ అక్రమ వలసలతో నిండిపోయింది. ఇది ఇలానే కొనసాగితే మీరు హింసను కోరుకోకపోయినా విధ్వంసం మీ వరకు వస్తుంది. ఇప్పుడు మీ వద్ద ఉన్నవి రెండే మార్గాలు. తిరిగి పోరాడండి.. లేదంటే చనిపోతారు. ఇదే నిజమని నేను నమ్ముతున్న” అన్నారు…
Share this Article