.
ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ ‘ప్రి రిలీజ్ ఫంక్షన్’ చూస్తుంటే జాలేసింది ఫాఫం… 12 మంది కంటెస్టెంట్లను పరిచయం చేస్తూ ఆ నిస్సారపు ప్రోగ్రాం చేశారు… అల్లు అరవింద్ కూడా హాజరయ్యాడు… ఆమె ఎవరో గానీ మరీ పూర్ యాంకరింగు… అదీ సమీరాకే అప్పగిస్తే బాగుండేది… వెరీ పూర్ ప్లానింగ్…
థమన్ అయితే మరీ నిర్లిప్తంగా కనిపించాడు… సరే, ఇదెలా ఉన్నా… ఈసారి కంటెస్టెంట్ల గురించి చెప్పాలంటే… గీతామాధురి చెప్పినట్టుగా… డిఫరెంటు వాయిస్ టెక్స్‌చర్లు, డిఫరెంటు ప్లేసెస్ విత్ అబ్రాడ్ ఆల్సో, డిఫరెంటు ఏజ్ గ్రూప్స్… గల్లీ టు గ్లోబల్ అనే ట్యాగ్ ఆప్ట్… కానీ మొన్నటివారం ఎపిసోడ్లకు నటి జెనీలియాను ఎందుకు పిలిచారో అస్సలు అర్థం కాదు…
Ads
ఒకప్పుడు ఆమె ప్రఖ్యాత నటి… చాన్నాళ్ల తరువాత సితారే జమీన్ పర్ సినిమాతో మళ్లీ వెలుగులోకి వచ్చింది, తెలుగులో జూనియర్ అనే సినిమా కూడా చేసినట్టుంది… కానీ ఇప్పుడు ఆమెకు ప్రమోట్ చేసే సినిమాలేవీ లేవు… మరీ ఇప్పుడు ఈ షోకు పిలిచి నెత్తిన మోసి, భజించాల్సిన సీన్ ఉన్నట్టు అనిపించదు…
అఫ్‌కోర్స్, థమన్‌కు బాయ్స్ సినిమా నుంచీ దోస్త్.., సరదాగా కలుపుగోలుగా యాక్టివ్‌గా కనిపించింది… అంతకుముందు సజ్జా తేజను పిలిచారంటే ఓ అర్థముంది, మిరయ్ సినిమా ప్రమోషన్ అనుకోవచ్చు… ఏమాటకామాట కంటెస్టెంట్లు బ్రహ్మాండంగా పాడుతున్నారు… మంచి ఎంపికలు…
ప్రతిసారీ ఈ షోలో ఆర్కెస్ట్రాను, వాద్యకారులను కూడా యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అయ్యేలా చూస్తుంటారు… ఈసారి ఎందుకోగానీ అది పెద్దగా కనిపించలేదు… ఏమో, ఇదే ఆర్కెస్ట్రా టీమ్ జీతెలుగులో లిటిల్ చాంపియన్స్‌కు కూడా వర్క్ చేస్తున్నందుకా..? దాందేముంది..? వాళ్ల గిరాకీ అది…
ఆ జీ షోలో కూడా ఈ టీమ్‌ను ప్రముఖంగా ఏమీ ప్రస్తావించడం లేదు… ఈటీవీ పాడుతా తీయగా షోలో మాత్రం ఎస్పీ చరణ్ అప్పుడప్పుడూ తన ఆర్కెస్ట్రా టీమ్‌కు అభినందనలు చెబుతుంటాడు… సరే, జీతెలుగు సరిగమప లిటిల్ చాంప్స్ (17వ సీజన్) స్టార్టయింది కదా… కొన్ని సీజన్లుగా మరీ దాన్ని ఓ ఫన్ షోగా మార్చేశారు కదా… ఇప్పుడూ అంతే…
అనిల్ రావిపూడి, ఎస్పీ శైలజ, అనంత శ్రీరామ్, నీహారిక జడ్జిలు… జడ్జిమెంట్లు ఏమీ ఉండవు, పాటల విశ్లేషణ కూడా ఏమీ ఉండదు… ఏదో ఫన్ షోలో వాళ్లూ పార్టిసిపెంట్లు… అంతే… ఎటొచ్చీ, చివరకు ఈ షోలో కూడా సుధీర్ మీద పిల్ల గాయకులతో కూడా పంచులు వేయిస్తున్నారు… ఇదే చానెల్ డ్రామా జూనియర్ షోలో కూడా అంతే… శృతి మించుతోంది సుధీర్, ప్రతి షోలోనూ ఇలా సరికాదు… నువ్వే అవాయిడ్ చేసి ఉండాల్సింది…
రాను రాను ఈటీవీ పాడుతా తీయగా సిల్వర్ జుబిలీ సీజన్ రేటింగ్స్ మరీ దారుణంగా ఉంటున్నాయి… కీరవాణి విసిగిస్తున్నాడు… అందరూ అనుభవమున్న సింగర్లే ఐనా ఎందుకో ఈసారి ఆ షోలో ఆకర్షణ తగ్గిపోయింది..!!
Share this Article