.
ఇప్పుడున్న కామనర్లు, సెలబ్రిటీలతో బిగ్‌బాస్ షో అస్సలు క్లిక్ కాదు… గత సీజన్లకన్నా ఇది ఫ్లాప్ అయ్యేట్టు కనిపిస్తోంది… అగ్నిపరీక్ష అని నానా పైత్యపు చేష్టలు చేయించి కూడా కామనర్ల పూర్ సెలక్షన్స్… వాళ్లే కాదు, ఒకరిద్దరు మినహా సెలబ్రిటీల సెలక్షన్లు కూడా పూర్…
ఏడెనిమిది రోజులు గడిచాయి కదా… ప్రేక్షకుల్లో ఈ షో పట్ల ఏమాత్రం ఆసక్తి కనిపించడం లేదు… మధ్యలో ప్రవేశపెట్టాలనుకునే కంటెస్టెంట్లను ఇంకాస్త ముందే ప్రవేశపెడితే ఏమైనా ఛేంజ్ ఉంటుందేమో బహుశా… గత సీజన్‌లో రోహిణి, అవినాష్ లేటరల్ ఎంట్రీ తరువాత మంచి వినోదాన్ని అందించారు…
Ads
ఇప్పుడు కూడా… కొత్తవాళ్లు దొరక్కపోతే పాత కంటెస్టెంట్లతో రీఎంట్రీ ఇప్పించడమే బెటరేమో… ప్రస్తుతం హౌజులో ఉన్న కామనర్స్‌లో దాదాపు అందరూ ఎక్కువ ఫుటేజ్ కోసం ఆతృత ప్రదర్శిస్తున్నారు… ఒక కేరక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి… మాస్క్ మ్యాన్ హరిత హరీష్…
ఈ మనిషి నవ్వగా చూడలేదు… దూరదూరంగా ఎక్కడో కూర్చుంటాడు… ప్రతిదీ కంట్రవర్సీ… (నామినేషన్ల సమయంలో తనూజతో తను వాదించిన తీరు, వీకెెండ్ షోలలో నాగార్జుననే తీసిపారేసినట్టు వ్యవహరించిన తీరు అస్సలు బాగాలేదు…)
అఫ్‌కోర్స్, బిగ్‌బాస్ షోకు తనవంటి కేరక్టర్లే సరిగ్గా సరిపోతారని ఫిక్సయినట్టున్నాడు… మిగిలిన వాళ్లలో ఒక్క దమ్ము శ్రీజ తప్ప మిగతావాళ్లూ అంతే… తొందరపాటు కనిపిస్తోంది… అందుకే ఈసారి నామినేటైన ఆరుగురిలో నలుగురు కామనర్లే …
కామనర్లకు అతి ప్రాధాన్యత, సెలబ్రిటీలకు ఔట్ హౌజ్ బతుకులు కావడంతో … సెలబ్రిటీలు కసిగా కామనర్లను నామినేట్ చేసినట్టున్నారు… ఇది బిగ్‌బాస్ స్క్రిప్టు లోపం… కామనర్లు భరణిని టార్గెట్ చేయగా, తమలో ఒకడైన హరీష్‌ను ముగ్గురు కామనర్లు నామినేట్ చేశారు… అది హరీష్ వైఫల్యమే…
చివరకు హరీష్, భరణి, ఫ్లోరా సైనీ, ప్రియా శెట్టి, మర్యాద మనీష్, డెమో పవన్ నామినేషన్లలో ఉన్నారు… గత వారం ఎలిమినేషన్ తప్పించుకున్న ఫ్లోరా సైనీకి ఈసారీ ప్రమాదమే… ఏమంత ఇంప్రెసివ్ ప్రజెన్స్ కాదు ఆమె…
సెలబ్రిటీలలో ఫాఫం బిగ్‌బాస్ టీమ్ బాగా ఆశలు పెట్టుకున్నట్టున్నారు రీతూ చౌదరి మీద… తను మాత్రం విసిగిస్తోంది… నామినేషన్ల సమయంలో కూడా వితండవాదం… సెలబ్రిటీలలో తనూజ పట్ల ప్రేక్షకుల్లో ఆదరణ కనిపిస్తోంది… రాము రాథోడ్, ఇమాన్యుయెల్ బెటర్… బిగ్‌బాస్ టీం ఇస్తున్న అతి ప్రాధాన్యతతో సంజన కాస్త హడావుడి చూపిస్తోంది…
కాస్త ఏవైనా టాస్కులు, గేమ్స్ ప్రవేశపెట్టండిరా బాబూ… లేకపోతే గుడ్డు దొంగతనాలు, బాత్రూం షాంపూల వంటి చిల్లర అంశాలే పెద్ద ఇష్యూస్‌లాగా చిరాకు పెడుతున్నాయి..!
Share this Article