.
బ్రిటన్‌లో ఏం జరిగింది..? వలసదారులపై జనాగ్రహం పెల్లుబుకింది… అది మరింత పెరిగితే ఏమవుతుంది..? నాన్-బ్రిటన్ పౌరులపై దాడులు జరుగుతాయి… అంతే కదా… అక్కడ స్థిరపడిన ఇండియన్లకూ ప్రమాద సంకేతాలే ఇవి…
అమెరికాలో కూడా కొన్నిచోట్ల ఇండియన్స్ వ్యవహార శైలి ఎలా ఉందంటే..? మన కింద మనమే గోతులు తవ్వుకుంటున్నట్టుగా ఉంది… ప్రత్యేకించి పలుచోట్ల మన తెలుగు జనం పోకడలు అక్కడి అమెరికన్లలో ఆగ్రహాన్ని పెంచుతున్నాయి… రాబోయే కాలంలో అవి మనవాళ్లకే ప్రమాదకరం అనే సోయి మనవాళ్లకే అర్థం కావడం లేదు…
Ads
అసలే గన్ కల్చర్ దేశమది… సరే, మొన్నామధ్య ఒక స్టోరీ చెప్పుకున్నాం గుర్తుందా..? ఇదీ లింకు…
డల్లాస్‌లో ఓచోట మనవాళ్లు వీథుల్లో డ్రమ్స్ వాయిస్తూ ఏదో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే… అమెరికన్ ఒకాయన ‘‘ఏమిటిది, వీళ్ల వీసాల్ని రద్దు చేయాలి, నేను నా పిల్లల్ని అమెరికాలో పెంచాలా..? ఇండియాలోనా..?’’ అని ఓ ట్వీట్ వదిలాడు… తరువాత డిలిట్ చేశాడు…
ఆయనది ఓ చిన్న కాఫీ షాపు… మన సెలబ్రేషన్ మీద ట్వీటుతాడా అనే కోపంతో మనవాళ్లు ఏం చేశారు..? ఆ షాపు రివ్యూల్లో ఏది పడితే అది రాసేశారు… బ్యాడ్ స్మెల్, వాష్‌రూం వెళ్లొచ్చి చేతులు కడుక్కోరు, ఆ చేతులతోనే డ్రింక్స్ మిక్స్ చేస్తారు వంటి కామెంట్లు… ఫాఫం, తన బిజినెస్ మీద బలమైన దెబ్బ అది… అది పవర్ ఆఫ్ ఇండియన్స్ అట…
ఈ ధోరణి ఇంకెంతగా ఆ స్థానిక అమెరికన్లలో మంటపుట్టిస్తుంది..? ఎందుకు మనవాళ్లు గోక్కుంటున్నారు..? ఎన్నో ఏళ్ల క్రితం వెళ్లిన మనవాళ్లకు అక్కడే పుట్టి, అక్కడే పెరిగిన మన పిల్లలకు కూడా ఇలాంటి ధోరణులు ప్రమాదకరం కాబోతున్నాయి… ఇదెందుకు తెలియడం లేదు మనవాళ్లకు, మన ప్రవాసుల సంఘాలకు..?
పైన చెప్పిన ఉదాహరణ ఓ చిన్న సంకేతం మాత్రమే… అసలే జాబ్ మార్కెట్ బాగాలేదు అమెరికాలో… దాని ఆర్థిక వ్యవస్థకూ బాగా సవాళ్లున్నాయి… వలసదారుల వల్ల తమ జాబ్స్ పోతున్నాయనే అసహనం బాగా పెరుగుతోంది అక్కడ… దీనికితోడు తమ కల్చర్ కూడా ఎక్కడి నుంచో వచ్చి జీవిస్తున్న వలసదారుల సంస్కృతితో ప్రభావితం అవుతున్నదనే భావన పెరుగుతోంది… మనవాళ్లపై ఆన్‌లైన్ రేసిజం పెరిగింది…
దీనికితోడు మనవాళ్లు రోమ్‌లో రోమన్లలా ఉండరు… మన కులపైత్యాలు, మన హీరోల మూర్ఖపు ఫ్యానిజాలు, పిచ్చి ప్రదర్శనలు, నినాదాలు, ఊరేగింపులు… మన ఇక్కడి రోత లక్షణాలు ఎక్కడికి పోయినా అలాగే కాపాడుకుంటున్నారు… తెల్లవాళ్లకు ఆ ధోరణి నచ్చదు… అందుకే లోలోపల ఆ అసహనం పెరుగుతూ ఉంటుంది…
బ్రిటన్ పరిణామాలు చూస్తున్నాం… నేపాల్ కథ వేరు, ఐనా జనాగ్రహం ఎలా ఉంటుందో చూస్తున్నాం… స్థానికులను మనమే ఇంకా కావాలని రెచ్చగొడుతూ, రచ్చ చేస్తూ, ఆగ్రహాల్ని పెంచుతూ, అసహనాన్ని ప్రోదిచేస్తూ… మనకు మనమే అశాంతిని ఆహ్వానిస్తున్నాం… బహుపరాక్…!
ఆల్రెడీ కొత్త జాబ్స్ లేక, పాత జాబ్స్ నిలవక కల్లోలం స్టార్టయింది… ట్రంపు నిర్ణయాల ప్రభావమూ చూస్తున్నాం… అక్రమ వలసదార్లే కాదు, అధికారిక వలసదార్లపైనా ప్రభావం పడుతోంది… గమనించండి….
ఐర్లండ్‌లో ఓ ఇండియన్ మీద భౌతిక దాడి జరిగింది… కెనడాలో స్టూడెంట్ వీసాల రిజెక్షన్ రేటు పెరిగింది… ఆస్ట్రేలియాలో ‘ఇండియన్స్ అవుట్’ నినాదాలు వినిపిస్తున్నాయి… యూరప్ దేశాల్లోనూ ఫార్ రైట్ గ్రూపులు పెరుగుతున్నాయి… సోషల్ మీడియాలో ఇండియన్స్ మీద హేట్ స్పీచులు పెరుగుతున్నాయి… రోజులు బాగా లేవు… బాగా ఉండబోవడం లేదు కూడా..!!
Share this Article