.
షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు, చేతులకు నల్ల బ్యాడ్జీలు ధరించారు, ఆర్మీకి గెలుపు అంకితం చేశారు… ఇవన్నీ కాసేపు పక్కన పెట్టండి… చాలామంది క్రికెట్ ప్రేమికులకు కూడా పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడటం నచ్చలేదు… పహల్గాం ఘాతుకం తరువాత పాకిస్థాన్‌ను పది ఆమడల దూరంలో పెట్టాల్సింది పోయి, ఈ మ్యాచులేమిటీ అనే ఆగ్రహం ఉంది జనంలో… కానీ…
నాణేనికి మరోకోణం ఉంది… అది ప్రభుత్వ కోణం… ప్రభుత్వ నిర్ణయాన్ని జస్టిఫై చేసే కారణాలు- వివరాలు… అదీ ఆసక్తికరంగా ఉంది… మిత్రుడు Sharath Kumar … ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్న విశ్లేషణ యథాతథంగా… ఇలా…
Ads
…. ఆసియా కప్ 2025 లో, ‘పాకిస్తాన్ తో ఇండియా మ్యాచ్ ఆడొచ్చు’ అని ఆగస్టు 21న, మన ఇండియన్ గవర్నమెంట్ ‘మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్’ ద్వారా పర్మిషన్ ఇచ్చింది. అది ఓ అధికారిక ప్రకటన కూడా చేసింది.
ఏం చెప్పింది అంటే… మనం పాకిస్తాన్‌తో ‘బైలాటరల్’ సిరీస్ ఆడం. ఇండియాలోనో, పాకిస్తాన్‌లోనో, లేక న్యూట్రల్ వేదికలోనో రెండు దేశాల మధ్య మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతి లేదు.
మన ఆటగాళ్లు అక్కడికి వెళ్లడం, వాళ్ల ఆటగాళ్లు ఇక్కడికి రావడం కుదరదు. ఇది కేవలం క్రికెట్‌కి మాత్రమే కాదు, హాకీ, చెస్ లాంటి ఇతర ఆటలకు కూడా వర్తిస్తుంది.
కానీ, మల్టీలాటరల్ సిరీస్‌లు, అంటే ఆసియా కప్ / వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్స్‌లో మాత్రం మనం పాకిస్తాన్‌తో ఆడాలి. ఒకవేళ ఈ టోర్నమెంట్ ఇండియాలో జరిగినా కూడా ఆడాల్సిందే అని గవర్నమెంట్ క్లియర్‌గా చెప్పేసింది.
ఒకవేళ ఈ రూల్స్‌ని ఫాలో అవ్వకపోతే, మన మీద సాంక్షన్స్ పడొచ్చు. గ్లోబల్ ఈవెంట్స్‌లో ఆడకుండా బ్యాన్ చేయొచ్చు, హోస్టింగ్ రైట్స్ తీసేయొచ్చు, పాయింట్స్ కట్ చేయొచ్చు, లేక ఫైన్ విధించొచ్చు.
a. 2036 ఒలింపిక్స్: మనం ఈ ఒలింపిక్స్‌ని హోస్ట్ చేయడానికి బిడ్ వేయబోతున్నాం. దానికి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాం. IOC రూల్స్ ప్రకారం, అందరినీ కలుపుకుపోవాలి (ఇన్‌క్లూసివిటీ) మరియు వివక్ష ఉండకూడదు (నాన్-డిస్క్రిమినేషన్). ఈ రూల్స్‌ని స్ట్రిక్ట్‌గా పాటించాలి.
b. 2030 కామన్వెల్త్ గేమ్స్: ఇండియా ఇప్పటికే బిడ్ వేసేసింది. కామన్వెల్త్ స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఈ నవంబర్‌లో డిసైడ్ చేస్తుంది. మనం result కోసం wait చేస్తున్నాం.
c. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్: క్రికెట్ ఇక్కడ మెడల్ స్పోర్ట్‌గా డెబ్యూ చేయబోతోంది. ప్రపంచంలో మన దేశానికి ఏదైనా స్పోర్ట్ లో మంచి గుర్తింపు ఉంది అంటే అది ఒక్క క్రికెటే కదా……హాకీ…చెస్..ఓకే బట్ అవి సెకండరీ…
ఇవన్నీ ఉన్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ తో ఆడటానికి అనుమతి ఇవ్వక ఇంకేం చేస్తుంది?
ముందున్న మంచి అవకాశాలని ఎందుకు రిస్క్ లో పెట్టుకుంటుంది?
—–
ఇలాంటి సమయంలో boycott చేస్తే?
మనం బైలాటరల్ సిరీస్‌లను ఆడకుండా ఉండొచ్చు, ఎందుకంటే అది రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య జరిగే అరేంజ్‌మెంట్. కాబట్టి నేషనల్ పాలసీ ప్రకారం ఆడకూడదనే నిర్ణయం తీసుకోవచ్చు.
కానీ, ICC లాంటి టోర్నమెంట్స్‌లో “మేము ఆడం” అని చెప్పడం వల్ల పైన చెప్పిన అవకాశాలన్నీ రిస్క్‌లో పడతాయి. కేవలం క్రికెట్ మాత్రమే కాదు, ఇతర స్పోర్ట్స్ కూడా దెబ్బతింటాయి.
ఈ స్పోర్ట్స్ బాడీస్ అన్నీ రాజకీయాలను, క్రీడలను పూర్తిగా వేరు చేసి చూస్తాయి.
వాటి ప్రధాన సూత్రాలు ఏంటంటే… శాంతి, ఐక్యత, న్యాయమైన పోటీలు. ప్రపంచంలో విభజనలు లేకుండా అందరూ కలిసి ఉండే సామరస్యాన్ని ప్రమోట్ చేయడం.
ఒలింపిక్స్ లాంటి వేదికల మీద రాజకీయ, మతపరమైన లేదా జాతి సంబంధిత ప్రచారాలు (ప్రొపగాండా) చేయడం కూడా స్ట్రిక్ట్‌గా నిషేధం. అలాంటివి అస్సలు అనుమతించవు.
కానీ, అదే సమయంలో శత్రుత్వాలనో, యుద్ధాలనో పూర్తిగా ఇగ్నోర్ చేయవు. ఒకవేళ ఆటగాళ్లకో, వీక్షకులకో భద్రతా సమస్యలు ఉన్నాయనో లేక ఇంటర్నేషనల్ లాస్‌ని వయొలేట్ చేసే పరిస్థితి ఉంటే, తప్పకుండా ఏదో ఒక దాన్ని బ్యాన్ చేయడం లేదా సిట్యుయేషన్ ని అడ్జస్ట్ చేయడం లాంటి చర్యలు తీసుకుంటాయి.
ఇప్పుడు పూర్తిగా ఆసియా కప్‌ని బాయ్‌కాట్ చేసినా ICC/ACC నుంచి sanctions తప్పవు.
మరి “asia cup ఆడతాం, కానీ పాకిస్తాన్‌తో ఆడం” అనడం ప్రాక్టికల్‌గా సాధ్యమా? టోర్నమెంట్‌లో ఫెయిర్‌నెస్, ఇంటెగ్రిటీ దెబ్బతినవా?
BCCI సెక్రటరీ ఒకటి చెప్పాడు. ఇది బాయ్‌కాట్ చేస్తే, దాని ప్రభావం మన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా వంటి వాళ్ల మీద కూడా పడొచ్చు అని.
ఇప్పుడు సెప్టెంబర్ 2025 లో టోక్యోలో వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. నీరజ్ చోప్రా vs అర్షద్ (పాకిస్తాన్) పోటీ కోసం అందరం ఎదురుచూస్తున్నారు.
సో, మన గవర్నమెంట్ ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారమే BCCI నడుస్తోంది.
ఇది తప్పించుకోలేని నిర్ణయం, కానీ హేతుబద్ధమైనది.
ICC రూల్స్‌కి కట్టుబడి ఉండాలన్నది ప్రధాన కారణం అయితే, వాటికి కట్టుబడి ఉంటేనే IOC, కామన్వెల్త్ నిబంధనలతో align అవుతాం, హోస్ట్ చేయగలుగుతాం అనేది మరో కారణం.
ఇది మన దేశం గ్లోబల్ స్పోర్ట్స్‌లో ముందుకెళ్లడానికి తీసుకున్న స్ట్రాటజిక్ డెసిషన్.
దేశభక్తి – కోపాలు – సెంటిమెంట్లు – భావోద్వేగాలు అనేవి అంతర్జాతీయ క్రీడా సంస్థల నియమాల ప్రకారం బాయ్‌కాట్ చేయడానికి చెల్లుబాటు అయ్యే కారణాలు కావు…
Share this Article