.
నిజంగా చంద్రబాబు వంటి ఎంటర్‌టెయినింగ్ నేతలు లేకపోతే మన రాజకీయాలు ఇంకెంత నిస్సారంగా, రసహీనంగా ఉండేవో… ఆ కోణంలో చంద్రబాబు అభినందనీయుడు… మనల్ని నవ్విస్తాడు, మనస్సు బరువు తగ్గి రిలాక్స్ అవుతుంది ఆయన ప్రసంగాల్లో ముఖ్యాంశాలు వింటే…
ఒకటా రెండా… అవిశ్రాంతంగా, ఏళ్లకేళ్లుగా ప్రజలను నవ్వించే ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నాడు… హైదరాబాద్ నేనే కట్టాను, సెల్ ఫోన్లు కనిపెట్టాను, కంప్యూటర్లు తీసుకొచ్చాను వంటి అనేకానేక వ్యాఖ్యలు… నో, నెవ్వర్, ఇంత పొలైట్ జోకులతో అలరించే మరో నేత దేశంలోనే లేడు… రాబోడు…
Ads
జనం నవ్వుకుంటారనే సోయి కూడా ఉండదా అని కొందరు కొక్కిరిస్తారేమో గానీ… ఆయనకు తెలియక కాదు… జనం నవ్వుతూ ఆనందంగా ఉండాలనేది ఆయన బలమైన కోరిక… అందుకే ఇలా స్టాండప్ కమెడియన్లకన్నా మంచి జోకులు వేయగలడు…
తాజాగా ఏమన్నాడు..? జీసీసీ బిజినెస్ సమ్మిట్‌లో మాట్లాడుతూ…
https://www.facebook.com/share/v/17KnfKH5Fg/
‘‘మొదట్లో టెలికామ్ ఇన్‌ఫ్రాలో పెట్టుబడులకు ఎవరూ ముందుకొచ్చేవాళ్లు కాదు… నేను తనను కలిశాను… (ముఖేష్ అంబానీని కాదు, ధీరూభాయ్ అంబానీని అని పాఠకులు గమనించ మనవి)… అదెంత లాభదాయకమో వివరించాను…
ఆయన నాకు టెక్నాలజీ తెలియదు, నేనేమో రిఫైనరీ మ్యాన్‌ను, ఐనా మీరు చెప్పారంటే అర్థమవుతోంది, నాలుగు రోజులు టైమివ్వండి, నిర్ణయం చెబుతాను అన్నాడు… తరువాత 5 బిలియన్ల డాలర్లు ఆ రంగంలో పెట్టుబడి పెట్టడానికి అప్పట్లోనే రెడీ అయిపోయాడు…
బ్రిటిష్ వాళ్లు మన దేశం నుంచి అన్నీ తీసుకుపోయారు, కానీ ఇంగ్లిష్ మనకు వదిలివెళ్లారు… (ఇప్పుడెవరూ బ్రిటిషర్లు ఇంగ్లిష్ మాట్లాడటం లేదేమో, ఇక్కడ వదిలేసి పోయారు కదా…) చైనాకన్నా మనకు అది అడ్వాంటేజ్… మన కోహినూర్ తీసుకుపోయారు కదా…
మొన్నామధ్య ఆ మ్యూజియం సందర్శించాలని అనుకున్నాను, కానీ వాళ్లు అనుమతించలేదు, కోహినూర్ వాపస్‌కు డిమాండ్ చేస్తానని అనుకున్నారేమో…’’ ఇలా సాగింది సారు వారి ప్రసంగం… సారుకు సమయానికి గుర్తులేక కొన్ని చెప్పడం లేదు గానీ… ఇండియా అంతరిక్ష విజయాల నుంచి ప్రపంచ రాజకీయాల దాకా… ఎన్ని, ఎన్నని..!!
పాత పగలేవో మరిచిపోక మోడీ నిర్లక్ష్యం చేస్తున్నాడు గానీ… ట్రంపు సుంకదాడి మీద మన విదేశాంగ, ఆర్థిక- వాణిజ్య శాఖల టీమ్స్‌ను తరుముతున్నాడు గానీ… చంద్రబాబును రంగంలోకి దింపొచ్చు కదా… సారు గారు తలుచుకోవాలే గానీ ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనా సమస్య వంటివి అటోఇటో తేలిపోవడం ఎంతసేపు..? ప్చ్, మోడీ భాయ్, చంద్రబాబు సేవల్ని వినియోగించుకుంటేనే కదా ప్రపంచశాంతి… అర్థం చేసుకోవూ…!!
Share this Article