.
ఏపీలో తమ ప్రభుత్వమే కదా… అనుకున్నంత మేరకు టికెట్ రేట్ల పెంపు ఉత్తర్వులు అర్జెంటుగా వెలువడ్డాయి పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకు… అనుకున్నట్టుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చేసింది… అప్పుడెప్పుడో రేవంత్ రెడ్డి టికెట్ రేట్ల పెంపు కావాలంటే ఏం చేయాలో చెప్పాడు, పవన్ కల్యాణ్ చేశాడో లేదో తెలియదు…
పోనీలే, డబ్బింగ్ సినిమాలే టికెట్ రేట్ల హైక్ ఇచ్చేస్తున్నప్పుడు ఓజీకి ఇస్తే తప్పేముందిలే… సరే, ఆ టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల దోపిడీ మాటెలా ఉన్నా… పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన జపనీస్ భాషలోని ఓ పాట వీడియో చూస్తుంటే ఆశ్చర్యమేసింది… థమన్ సంగీత దర్శకుడు… వాషి ఓ వాషి అని సాగుతుంది పాట…
Ads
‘ఎగిరెగిరి పడుతున్నవ్, నీలాంటి వాడిని నేల మీదకు ఎలా దించాలో నాకు బాగా తెలుసు, చిన్నప్పుడు నా గురువు చెప్పిన హైకూ చెబుతా విను’ అంటూ ఓ పాట అందుకుంటాడు పవన్ కల్యాణుడు…
‘‘ఒక గద్దను వేటాడాలంటే… ముందు దాని రెక్కలు కత్తిరించాలి… అది నేలపై పడుతుంది… నేలకొరిగిన తరువాత దాని గుడ్లు పీకేయాలి… గుడ్డిదై అలమటిస్తుంది… ఇక దాని కాళ్లు నరికెయ్యాలి… గిలగిలా కొట్టుకుంటుంది…
కొట్టుకుంటున్న ఆ గుండెనూ పెరికివేయాలి… విలవిలలాడుతుంది… అక్కడిదాకా ఆడిన దాని ఊపిరి దాంతో ఆగిపోతుంది…’’ ఇలా సాగుతుంది ఆ పాట అర్థం… నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన ఆ లిరికల్ వీడియోలో ఆ పాట సబ్ టైటిల్స్ చెబుతున్నది అదే…
ఇంత బీభత్సంగా, భయానకంగా వేటాడాలా డేగను..? చిత్రవధ చేసి మరీ చంపాలా.,? సరే, మీ కథ మీ పాట మీ ఇష్టం గానీ… ఆ భాష ఎవరికి అర్థం కావాలి…? దీన్ని జపాన్‌లో రిలీజ్ చేయడం లేదు కదా… ఎంచక్కా తెలుగులో ఏ కాసర్ల శ్యామ్‌తోనే అవే కటువు పదాలు వచ్చేలా రాయించుకోవచ్చు కదా…
(ఈ పాట దర్శకుడు సుజీత్ రాసినట్టు లిరికల్ వీడియో కింద పేర్కొన్నారు… కానీ రాసింది పవన్ కల్యాణే అంటూ తన దస్తూరీతో రాసుకున్న పాట ప్రతులు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి…) (నకోడా, జపనీస్ డ్రమ్స్ వాయించింది శివమణి అట…)
(అప్పట్లో ఖుషి సినిమాలో యే మేరా జహా అని ఓ హిందీ పాట పెట్టించావు నువ్వే పట్టుబట్టి, వర్కవుట్ అయ్యింది… అప్పట్లో అది ప్రయోగం… అఫ్‌కోర్స్‌లో కలకత్తా నుంచి వచ్చిన హీరో బెంగాలీ పాట పాడాలి గానీ హిందీ పాట ఎత్తుకోవడం ఏమిటనే విమర్శలూ వచ్చినట్టు గుర్తు… అది సరే కానీ, మరీ ఈ తూర్పు భాష పాట ఎక్కుతుందంటావా..?)
ప్రేక్షకులు కూడా గద్దల్ని ఎలా వేటాడాలో తెలుసుకునేవాళ్లు… థమన్ ఏదో తిప్పలు పడ్డాడు, నువ్వూ బాగానే పాడావు గానీ… ప్రేక్షకులు పాట అర్థం గాక తెల్లమొహాలు వేయడం అవసరమా నాయకా..? అదే, జనసేనానాయకా..?! ఇది స్పెషల్ అట్రాక్షన్ అవుతుందంటావా..? ఐతే మంచిదే..!!
Share this Article