.
బిచ్చగాడు సినిమా తరువాత విజయ్ ఆంటోనీ సినిమా ఏది వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు… కానీ తరువాత తన సినిమాలు పెద్దగా తెలుగులో క్లిక్ కాలేదు…
ఇప్పుడు భద్రకాళి అంటూ వచ్చాడు… గతంలో ఆర్పీ పట్నాయక్ తీసిన బ్రోకర్ తరహా కథే… నిజానికి ఇలాంటి పొలిటికల్ బ్రోకర్ కథలు తక్కువే… సో, స్టోరీ లైన్ భిన్నమైంది…
Ads
పైగా ఓ గిరిజన మహిళ ఆత్మహత్య నుంచి మొదలయ్యే కథ… ఓ అనాథ ఏదైనా సాధించగల ఓ పొలిటికల్ బ్రోకర్‌గా మారి, తనదైన శైలిలో సొసైటీకి ఏం చేస్తాడు..? సొసైటీకి నష్టకారకులైన నాయకులతో ఎలా ఆడుకుంటాడనేది మొత్తం కథ…
సినిమాకు నిర్మాత, హీరో, సంగీతం విజయ్ ఆంటోనీయే… పాటలు ఎక్కవు గానీ కొన్నిచోట్ల బీజీఎం బాగుంది… కాకపోతే ఈ సినిమాలో మైనస్ ఏమిటీ అంటే..? సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎఫెక్టివ్‌గా లేకపోవడం, ల్యాగ్… అది దర్శకుడు అరుణ్ ప్రభు వైఫల్యమే…
ఫస్టాఫ్, క్లైమాక్స్ బాగున్నయ్… రాజకీయాల మీద ఇంట్రస్టు ఉన్నవారికి సినిమా కథ నచ్చుతుంది… కాకపోతే కథను స్ట్రెయిట్‌గా చెప్పకుండా సంక్లిష్టమైన రీతిలో చెబుతాడు దర్శకుడు, అదొక్కడే చిరాకు పుట్టిస్తుంది అక్కడక్కడా…
హీరోయిన్ పాత్ర ఉందంటే ఉంది… విజయ్ ఆంటోనీ నటన గురించి వంక పెట్టడానికి ఏముంది..? ఇలాంటి పాత్రల్ని అలవోకగా చేయగలడు… అలాగే చేశాడు… విలన్ కూడా వోకే… ఐతే మొత్తం అరవ వాసనే… ఒక్క తెలుగు మొహం కనిపించదు… పక్కా డబ్బింగ్ సినిమా… టైటిల్ అస్సలు ఆప్ట్ కాదు…
(అఫ్‌కోర్స్, తమిళ, మలయాళ పదాల్ని యథాతథంగా మనమీదకు విసురుతున్న వాళ్లతో పోలిస్తే ఇది బెటర్ కదా…) సెకండాఫ్‌లో బోధనలు తగ్గిస్తే ఇంకా బాగుండేది…
డబ్బున్నవాడికి మాత్రమే ఈ భూమ్మీద బ్రతికే అర్హత ఉందని భావించే ప్రతినాయకుడికీ, మానవత్వం లేనివారికి ఈ నేలపై చోటులేదని భావించే నాయకుడికి మధ్య జరిగే కథ ఇది… ప్రశ్నించే వాడు ఉండకూడదనేదే ప్రతినాయకుడి ప్రధానమైన ఉద్దేశమైతే, ప్రశ్నించని క్షణం నుంచే అణచివేత మొదలవుతుందనేది నాయకుడి అభిప్రాయం… అలాంటి వీరిద్దరి చుట్టూనే దర్శకుడు ఈ కథను తిప్పుతూ వెళ్లాడు…
కాస్త అక్కడక్కడా బోర్ కొట్టినా… కథలో లీనమైతే ఈ సినిమా పెద్దగా నిరాశపరచదు… మంచి ప్రయత్నం విజయ్ ఆంటోనీ… భిన్నమైన కథతో వచ్చావు… లవ్, కామెడీ, రొమాన్స్ గట్రా ఏమీ ఉండకుండా సీరియస్ ఫ్లో… ఐతే థియేటర్లకు వెళ్లి మరీ చూడొచ్చా అనేనా మీ ప్రశ్న… అవును అని మాత్రం అనలేం..! పైగా మనవాళ్లకు ఇలాంటి కథలు ఎంతవరకూ ఎక్కుతాయనేదే పెద్ద ప్రశ్న..!!
Share this Article