.
ప్యానిక్… ట్రంపు హెచ్1బీ వీసా ఫీజు మీద జారీ చేసిన ఉత్తర్వులతో కలకలం, ఆందోళన, కలవరం… పైగా రకరకాల వార్తలు, భయపెట్టే ప్రచారాలు… ఇండియన్ మీడియా, సోషల్ మీడియా అబద్ధాలతో, అవగాహన రాహిత్యంతో హోరెత్తిస్తున్నాయి… ఏమని..?
.
Ads
ఇప్పుడు హెచ్1 బీ కింద పనిచేసినవాళ్లకు రెన్యువల్స్ ఉండవు, కావాలంటే లక్ష డాలర్లు చెల్లించాలి, ఇక వాళ్లంతా వాపస్ రావల్సిందే… కొత్తగా జాబ్ కావాలని వచ్చే మనవాళ్లు లక్ష డాలర్లు కట్టాల్సిందే, అంత చెల్లించలేరు కాబట్టి ఇక అమెరికా గేట్లు మూసేసినట్టే…
కొత్తగా వెళ్లాలనుకునే విద్యార్థులకూ బ్రేకులు పడ్డట్టే… ఇలా ప్యానిక్ ప్రచారాలు… నిజానికి ఈ ఉత్తర్వులు భారతీయులపైనే ఎక్కువ నెగెటివ్ ప్రభావం చూపిస్తాయి… (రష్యా చమురు కొంటున్నాయనే అక్కసుతో చైనీయులు, భారతీయులపై ట్రంపు తీర్చుకునే కక్ష అనే వాదన కూడా అబద్ధం…)
ఇలాంటి ఉత్తర్వులు, ఆలోచనలు తన గత పదవీకాలంలో కూడా ట్రంపు చేసినవే… కాకపోతే కోర్టులు అడ్డుపడ్డాయి… కేసులు సాగీ సాగీ ఆలోపు ట్రంపు పదవే ఊడిపోయింది… ఇప్పుడు తన ఉత్తర్వులు కేవలం ఏడాదికాలంగా అమెరికా బయట ఉన్న హెచ్1బీ వీసాదారులకు మాత్రమే వర్తిస్తుంది… ఇదీ ఆ ఉత్తర్వు…
వీసాలు ఉండీ, అమెరికా బయట ఉన్నవాళ్లకు మాత్రమే వర్తిస్తుంది… అందుకని కంపెనీలు అర్జెంటుగా (గడువు ఒక్క రోజే) అమెరికాలో రిపోర్ట్ చేయాలని మెయిల్స్ పెట్టి తరుముతున్నాయి… ఈ దెబ్బ ఇన్‌ఫోసిస్ వంటి కంపెనీలపై ఉంటుంది, కానీ తాత్కాలికమే…
(తప్పకుండా లక్ష డాలర్ల కనీసవేతనం ఇవ్వాలని గనుక ట్రంప్ గతంలోలాగా ఆంక్షలు పెట్టినా అవి మన ఐటీ కంపెనీలకు నష్టమే.., లక్షలోపు వేతనాలతో వేల మందితో పనిచేయించుకుంటున్నాయి అమెరికాలో…)
ఇప్పుడు ఇండియన్, అమెరికన్ కంపెనీలు హెచ్1 బీ వీసాలకు ఇంతలేసి డబ్బు కట్టలేవు, సో, ఇండియా వంటి ఐటీ నిఫుణులున్న దేశాలకే ప్రాజెక్టులు ఇచ్చి వర్క్ చేయించుకుంటాయి, సో, ఇండియన్ ఐటీ కంపెనీల స్టాక్స్ తాత్కాలికంగా పడిపోయినా, మళ్లీ బలంగా పుంజుకుంటాయి… ఎందుకంటే, అవి ప్రాజెక్టులకు ఇండియా నుంచే వర్క్ చేయించుకుంటాయి… ఇండియాకు ఎక్కువ ప్రాజెక్టులు కూడా వస్తాయి… ఇదీ అమెరికాలో హెచ్1బీ వీసాదారుల తాజా విశ్లేషణలు…
అంతే తప్ప, ఇప్పుడు అమెరికాలో హెచ్1బీ వీసాలతో కొలువులు చేసుకునేవాళ్లకు ఏ సమస్యా లేదు… స్టూడెంట్ వీసాలతో వెళ్లేవాళ్లకూ ప్రాబ్లం లేదు… వాళ్లు ఫ్రెష్‌గా హెచ్1బీ కోసం దరఖాస్తు చేసుకున్నా వాళ్లకు వాళ్లకు కూడా ఈ లక్ష డాలర్ల ఫీజు నిబంధన వర్తించదు… హెచ్1బీ డిపెండెంట్ల వీసాదారులకు అసలే వర్తించదు…
కాకపోతే ట్రంపు తాజా ఉత్తర్వుల ప్రభావం కొత్తగా అమెరికాకు వెళ్లి హెచ్1బీ కోసం, కొలువుల కోసం ప్రయత్నించాలని అనుకునేవాళ్లకు శరాఘాతం… కానీ ఆల్రెడీ అమెరికాలో జాబ్ మార్కెట్ ఘోరంగా ఉంది, అలా ఎవరూ వెళ్లడం లేదు…
కాదు, ట్రంపు యంత్రాంగం అవగాహన రాహిత్యంతో తప్పుడు ఉత్తర్వులు (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్) జారీ చేసింది, రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది అని అమెరికన్ మీడియా రాస్తోంది… కానీ అదీ తప్పే… కోర్టుల్లో నిలబడతాయా లేదా తెలియదు గానీ… పూర్తి అవగాహనతోనే, ఉద్దేశపూర్వకంగానే జారీకాబడిన ఉత్తర్వులు అవి..!!
(ప్రస్తుతానికి ఇలా ఉంది పరిశీలన)…
సో, అంతా అయిపోయింది, ఇక మనవాళ్లంతా వాపస్ రావల్సిందే వంటి ప్యానిక్ ప్రాపగాండాను పట్టించుకోవల్సిన పనిలేదు… భారతీయులంతా వాపస్ (ఎట్‌లీస్ట్ హెచ్1బీ వీసాదారులు) రావల్సి వస్తే అమెరికా స్తంభించిపోతుంది… ఎందుకంటే మన టెకీలు లక్షల్లో ఉన్నారు కాబట్టి..!!
ఐతే ఒకటి మాత్రం నిజం… ట్రంపు చైనా జోలికి వెళ్లడానికి భయపడి, ఆ కక్ష మొత్తం ఇండియా మీద తీర్చుకుంటున్నాడు, ఇంకా తీర్చుకుంటాడు… ఆల్రెడీ ట్రేడ్ డీల్ తనకు అనుకూలంగా ఉండేలా రకరకాలుగా సుంకాల పేరిట బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కూడా… తన ఒరిజినల్ గుణం బయటపెట్టుకుంటున్నాడు… మోడీ, గమనిస్తున్నావా..?! (పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, సౌదీ ప్రిన్స్‌తో కలిసి ట్రంప్ తన స్వలాభం కోసం ఇండియా మీద ఏమేం కుట్రలు చేస్తున్నాడో ఆల్రెడీ ఈరోజే రెండు కథనాలు పబ్లిష్ చేశాం, చదవండి...)
Share this Article