.
సంకల్పానికి దరిద్రం ఉండొద్దు… ఏమో, ఏ కార్యకారణ సంబంధమో… ఎక్కడో లింక్ కూడా లేనిదేదో కదులుతుంది… మనం అనుకున్నది నెరవేరే చాన్సూ ఇస్తుంది…
రష్యా చమురు కొంటున్నామని ట్రంపుడు పగ పెంచుకోవడం ఏమిటి..? పాకిస్థాన్‌తో అంటకాగుతూ ఇండియా మీద కక్ష తీర్చుకోవడం ఏమిటి..? కొలువు వీసాల మీద ఏకంగా లక్ష డాలర్ల ఫీజు పెట్టి, మీచావు మీరు చావండి అని మనల్ని బెదిరించడం ఏమిటి..?
Ads
ఏమో, పర్యవసానంగా హైదరాబాదుకు విదేశీ ఐటీ కంపెనీలే రావచ్చునేమో… నిన్న రేవంత్ రెడ్డి అన్నాడు కదా… ‘‘ట్రంపు విధానాలు అమెరికాకే అంతిమంగా నష్టం కలగజేస్తాయి… అమెరికా వీడాలనుకునే సంస్థలకు హైదరాబాద్ స్వాగతం… ఇదే మీకు మంచి గమ్యస్థానం… అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం… మన విద్యార్థులను అమెరికా రానివ్వకపోతే, అమెరికా యూనివర్శిటీలనే ఇక్కడికి ఆహ్వానిద్దాం… హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలతో ఈమేరకు సంప్రదింపులూ జరుపుతాం’’…
అలా అన్నాడో లేదో… నిజంగానే నిన్న ట్రంపు లక్ష డాలర్ల నిర్ణయం తీసుకున్నాడు… మన విద్యార్థులకూ ఇప్పుడు అమెరికా వెళ్లాలంటే వణుకు… నిజంగానే అమెరికన్ కంపెనీలు కూడా తమ కార్యకలాపాలకు చవక, నాణ్యమైన మానవనరులు కావాలంటే ఇండియా వైపు చూడకతప్పదు…
ఢిల్లీలో పొల్యూషన్, జీవనవ్యయం ఎక్కువ… ముంబై ఆల్రెడీ కిటకిట… కోల్‌కత్తా అడ్మినిస్ట్రేషన్, వాతావరణం సరిపడదు… బెంగుళూరు ట్రాఫిక్ రద్దీ, గుంతల రోడ్లతో అక్కడి కంపెనీలే బయటికి రావాలని చూస్తున్నాయి… చెన్నై ఉక్కబోత… ఎటొచ్చీ హైదరాబాద్ బెటర్ డెస్టినేషన్…
ఇది ఆల్రెడీ విశ్వనగరం, అంటే బహుళ సంస్కృతుల మేళవింపు… అనువైన వాతావరణం… విలాస జీవనానికీ, విదేశీ తరహా జీవన విధానానికీ అనువు… ఎటొచ్చీ, ఓ మంచి పాలసీని రూపొందించి దానికి విస్తృత ప్రచారం కల్పించాలి… ఏమో… రేవంత్ రెడ్డి సంకల్పం మేరకు కొన్ని కంపెనీలు వస్తే మంచిదేగా…
నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ ఆల్రెడీ ఇదే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ కొట్టాడు… తను ఏమంటాడంటే..?
‘‘డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన $100,000 హెచ్-1బి ఫీజు అమెరికాలో నూతన ఆవిష్కరణల గొంతు కోసే చర్యగా మారుతుంది… ప్రపంచ ప్రతిభను తిరస్కరించటం ద్వారా, అమెరికా తదుపరి ప్రయోగశాలలు, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల తరంగాన్ని బెంగళూరు, హైదరాబాద్, పుణే, గురుగ్రామ్‌లకు మళ్లిస్తుంది…
ఇది భారతదేశం కోసం ఒక గొప్ప అవకాశం… భారతదేశం అత్యుత్తమ వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు ఇప్పుడు భారత్ అభివృద్ధికి, వికసిత్ భారత్ సాఫల్యం దిశలో తమ పాత్ర పోషించగలుగుతారు… అమెరికా కోల్పోయిన ప్రతిభ, భారతదేశానికి అనుకోని లాభంగా మారుతుంది…’’ జై ట్రంప్, జైజై ట్రంప్..!!
Share this Article