.
తన సొంత పార్టీ కావచ్చు, మరే ఇతర పార్టీ కావచ్చు… ఏ పార్టీ తరఫున అని ఇప్పుడే చెప్పలేం గానీ… రాబోయే ఎన్నికల్లో కవిత నేరుగా హరీష్‌రావుపైనే పోటీ చేయనుందా..? అదీ కేసీయార్ సొంత నియోజకవర్గం సిద్దిపేటలోనే..? నిన్న కేసీయార్ సొంతూరు చింతమడకలో ఆమె మాటలు అదే చెబుతున్నాయి…
జన్మభూమే నా కర్మభూమి అనే ఆమె వ్యాఖ్యలో పెద్దగా అర్థం చేసుకోలేనంత నిగూఢ మర్మమేమీ లేదు… అర్థమయ్యేట్టుగానే చెప్పింది… తనను బహిష్కరించిన తన కుటుంబ సభ్యులకు, తనపై కక్షగట్టిన హరీష్‌రావు, సంతోష్‌రావులతోపాటు తెలంగాణ సమాజానికి తన తదుపరి అడుగు ఏమిటో అర్థమయ్యేట్టుగానే చెప్పింది…
Ads
చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల కోసం అడుగు పెట్టి… ఇక నా అడుగులు ఇక్కడే స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పింది… అంటే, ఏదో ఓ ఫ్లోలో కొట్టుకుపోవడం కాదు, తనకు ఆల్రెడీ ఓ స్ట్రాటజీ ఉన్నట్టు కూడా అర్థమవుతూనే ఉంది… అంతేకాదు, బయటికి కేవలం హరీష్‌రావు, సంతోష్‌రావుల మాత్రమే పోరాటం అన్నట్టుగా కనిపిస్తున్నా… ఆమె ఫైట్ తన సోదరుడు కేటీయార్, తండ్రి కేసీయార్‌లపై కూడా..!
పొలిటికల్ యాంబిషన్స్ విపరీతంగా ఉన్న ఆమె మరీ వైఎస్ షర్మిలలాగా నిష్ప్రభావంగా మిగిలిపోతుందో, తెలంగాణ రాజకీయాల్లో ఉనికి చాటుకుంటుందో కాలం చెబుతుంది గానీ… ప్రస్తుతానికి రోజూ ఏదో ఒక అంశంలో బీఆర్ఎస్ క్యాంపును గోకుతూనే ఉంది… తను స్వయంగా కావచ్చు, కవితక్క అప్‌డేట్స్ పేరిట సోషల్ మీడియాలో కావచ్చు, తను మాత్రం రోజూ వార్తల తెర మీద ఉంటోంది…
ప్రస్తుతానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఆమె పట్ల ఎలా రియాక్టవుతుందనేది పక్కన పెడితే… కేసీయార్, కేటీయార్, హరీష్‌రావు, సంతోష్‌రావు సైలెంట్‌గా ఉన్నారు… కౌంటర్లు ప్రారంభిస్తే ఆమె ఇంకా ఏమేం బయటపెడుతుందో అనే సందేహం కావచ్చు… కేసీయార్ బాపతు అక్రమాల్లో ఆమెకు తెలియనివంటూ ఏమీలేవు కాబట్టి..! ఆమెను ‘అప్రూవర్’ అని భావిస్తున్నారు కాబట్టి..!
సిద్దిపేటలో కేసీయార్ స్ట్రాంగ్ లీడర్… వేరే ఏ ఇతర పార్టీకి చెప్పుకోదగినంత బలం కూడా లేదు, నాయకుల్లేరు… కేసీయార్ ఈ స్థానాన్ని హరీష్‌రావుకు ఇచ్చాక తను మరింతగా పార్టీ బలాన్ని పెంచాడు… నిజంగానే కవిత తనపై సిద్దిపేటలో పోటీ చేస్తే ఎన్నిక రసవత్తరంగా ఉండబోతోంది…
ఇంకా చింతమడకలో ఆమె ఏమేం అందంటే..?
- నా కుటుంబానికి దూరం చేసిన వారి భరతం పడతా… (హరీష్‌రావు గురించే)
- సిద్దిపేట, చింతమడకలను సొంత ప్రాపర్టీగా, జాగీరుగా భావిస్తున్నారు… (హరీష్‌రావు గురించే)
- ఇక్కడికి రావాలంటే ఆంక్షలు… ఈరోజు కూడా… ఎన్ని ఆంక్షలు పెడితే అంత ఎక్కువగా పదే పదే వస్తాను ఇక్కడికి… (సిద్దిపేటను మరో కేజీఎఫ్ అని పోల్చిందామె…)
Share this Article