.
ఇదిరా మీడియా సత్తా అంటే… ఒక నాయకుడి ర్యాలీలో ఒక కార్యకర్త రప్పారప్పా నరికేస్తా అనే అదేదో సినిమా డైలాగు బ్యానర్ మీద రాసి ఉంటే …. ఘోరం అంటూ టివిలో తటస్థ మేధావుల చర్చలు , పత్రికల్లో వార్తలు ….
మరిప్పుడు ఒక డిప్యూటీ సీఎం ఏకంగా కత్తి పట్టుకొని ఊపుతుంటే… ఆహా ఓహో అని ఆకాశానికెత్తుతారు … తన్మయత్వం చెందుతారు … ఇదిరా మీడియా అంటే … మీడియాను తక్కువగా అంచనా వేయవద్దు …
Ads
ఫాఫం… తెల్లారి లేస్తే కూటమి నేతలపై, అక్రమాలపై, సాధింపులపై, వేధింపులపై, ఏదో ఒకటి రాసిపడేసే సాక్షికి కూడా ఫాఫం… ఓజీ ప్రిరిలీజ్ కూటమి మీద ఒక వాక్యం కూడా సరైన రీతిలో విశ్లేషించలేకపోయింది… ఫాఫం సాక్షి, ఫాఫం జగన్… దాన్నలా వదిలేస్తే…
పూర్తిగా వర్షాన్ని నిందించాల్సిన అవసరం లేదు… పవన్ కల్యాణ్ మార్క్ అస్తవ్యస్త ప్లానింగు ఈ ప్రిరిలీజ్‌ను కూడా గందరగోళంగా మార్చింది… ట్రెయిలర్ రెడీ కాలేదు… ఏదో పిచ్చి వీడియో బిట్ ప్లే చేశారు, అసలే వర్షంతో ప్రేక్షకుల్లో అసహనం…
పైగా నేను డిప్యూటీ సీఎం అని మరిచిపోయాను అంటూ ఓజీ సినిమాలోని హీరో పాత్ర వస్త్రధారణతో వచ్చాడు… అంతేనా… పెద్ద కత్తి (కటానా అంటారట)తో వేదిక మీదకు వచ్చాడు… ఏం చెప్పాలనుకున్నవ్ మిస్టర్ పీకే..? సరే, వచ్చాడు… మళ్లీ ఖుషీ నాటి వైబ్ కనిపిస్తోంది అన్నాడు… ఎస్, ఆ తరువాత అసలు పీకే సినిమా ఏది జనంలోకి వెళ్లింది బలంగా… అత్తారింటికి దారేది సినిమా వదిలేస్తే..?
పుష్కరానికో సినిమా… ఐనా తన పట్ల క్రేజ్ ఇంత బలంగా ఉండటం తన అదృష్టమే… ఇప్పుడు కూడా ఏదో అడ్వాన్సులు తీసుకున్నాడు కాబట్టి, వాపస్ ఇవ్వకుండా ఎలాగోలా సినిమాలే పూర్తి చేస్తున్నాడు… జనంలోకి వదులుతున్నాడు… అవెలా ఉంటాయో హరిహర వీరమల్లు చూశాం కదా…
దర్శకుడు సుజిత్ సాధారణ మనిషి కాదట… అతనేమో అపూర్వ కేరక్టర్ అనుకోకండి, జానీ చూసి, నెలరోజులు అదే తరహా హెడ్ బ్యాండ్ ధరించాడట… సో, మహాపురుషుడైపోయాడు… కుర్చీ మడతబెట్టే థమన్ మరో అసెట్ అట… మొన్నటిదాకా నందమూరి థమన్, ఇప్పుడు థమన్ కల్యాణ్…
- జపనీస్ భాషలో ఏదో పాడాడు.,. వాషి యో వాషి… అంటే స్వాగతం అట… కాదు, తనకు తెలియదు… వాషి అంటే గద్ద… ఒక గద్దను చంపాలంటే ఎంత భీకరంగా వయెలెంటుగా చిత్రవధ చేయాలో చెప్పే పాట అది… (కళ్లు పీకాలి, రెక్కలు కత్తిరించాలి, కాళ్లు నరకాలి) ప్రధాన రాజకీయ స్రవంతిలో కీలకమైన ప్రజాప్రతినిధిగా ఉన్న ఓ నేత చెబుతున్నది అదీ…
నిజమే… పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అని మరిచిపోయాడు… ఈరోజుకూ అంతే… ఇంకా టిపికల్ తెలుగు హీరోనే అనుకుంటున్నాడు… ఈ సినిమాలో పాత్ర కూడా ఓ స్మగ్లర్ పాత్ర… అవునూ, థియేటర్లలో కూడా తెలుగు సబ్‌టైటిల్స్ వేస్తారా స్వామీ..? ఓజీ అంటే..? అదేదో ఓజాన్ గంభీర్ అట… ఆ టైటిల్ పెట్టినవాళ్లకు ఓ పేద్ద దండం…
- మరో విషయం… రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఆలోచించాలి… ఒకరు (బన్నీ) నీ పేరే మరిచిపోతారు… మరొకరు ప్రోగ్రాం అంతా అయ్యాక, డబ్బింగ్ సినిమాకు కూడా టికెట్ రేట్ల హైక్ తీసుకుని మరీ… అరెరె, థాంక్స్ చెప్పడం మరిచిపోయాను అని తరువాత తాపీగా ఓ వీడియో పడేస్తాడు… (జూనియర్)…
- సేమ్, నువ్వు అంత ఉదారంగా ఉన్నా సరే… వేదిక మీద థాంక్స్ చెప్పకుండా తరువాత (పవన్ కల్యాణ్) ఓ నోట్ రిలీజ్ చేశాడు… ఎస్, ఈ టాలీవుడ్ మనది కాదు పాలకా..? వాళ్లకు మిమ్మల్ని వాడుకోవడం తప్ప గౌరవించడం అస్సలు తెలియదు… హైదరాబాదులో జనాన్ని అవస్థలు పెట్టి, ప్రిరిలీజ్ ఫంక్షన్ చేసి చంద్రబాబుకు థాంక్స్ చెబుతాడు తను…
- ప్రిరిలీజ్, బెనిఫిట్ షోలు వద్దని చెప్పింది సర్కారే… ఈ ఫ్యానిజం తాలూకు దుర్ఘటనలు సంధ్య తొక్కిసలాటలో చూశాం… ఇక నుంచీ వాటికి అనుమతి ఇవ్వబోం అని చెప్పిందీ సర్కారే, టికెట్ రేట్ల హైక్ కావాలంటే డ్రగ్ వ్యతిరేక వీడియోలు చేయాలన్నారు… అవేమీ లేకుండా ప్రిరిలీజ్ అనుమతులు ఇస్తూనే ఉన్నారు… ఎందుకలా సాగిలబడాలి ప్రభుత్వం..?
డిప్యూటీ సీఎంగా తనకు సెక్యూరిటీ ఉంది… తోడుగా తెలంగాణ పోలీసుల మొహరింపు, ట్రాఫిక్ ఆంక్షలు… భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు హైదరాబాద్ రోడ్లు ఓ నరకం… అలాంటప్పుడు రద్దీ ఉండే ఎల్బీ స్టేడియంలో ఈ ప్రోగ్రామ్‌కు అనుమతి దేనికి…? మరీ దిల్ రాజును నమ్మితే… ఎప్పుడో తను ముంచేస్తాడు పాలకా..? బహుపరాక్…
అది ఓ ప్రైవేటు ప్రోగ్రాం, సినిమా అంటేనే ఓ దందా… ఆ ప్రమోషన్ కోసం, హైప్, బజ్ క్రియేషన్ కోసం వెంపర్లాట… తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ సమాజానికి వచ్చేదేముంది..? అనవసరంగా జనంలో వ్యతిరేకత పెంచుకోవడం కాకపోతే..!!
Share this Article