.
నిజంగానేే డౌట్ వచ్చింది… రేఖా గుప్తా, ఢిల్లీ సీఎం… ఏబీవీపీ, మహిళా మోర్చాల నుంచి బీజేపీ నాయకురాలిగా ఎమర్జయింది ఆమె… రాజకీయాల్లోకి కొత్త కాదు… పైగా న్యాయవిద్య చదివింది… అన్నింటికీ మించి పలుసార్లు ఢిల్లీ ఆప్, కాంగ్రెస్ వర్గాల నుంచి డిజిటల్ వక్రీకరణలు, తప్పుడు బాష్యాలు, వక్రీకరణలకు బాధితురాలే…
మరి అలాంటప్పుడు అంత అనాలోచితంగా… బీజేపీ ఈవీఎంల ట్యాపరింగు ద్వారానే గెలుస్తోంది అని ఎలా మాట్లాడింది..? ఈ డిజిటల్ తప్పుడు ప్రచారాలు, ఎఐ సాయాలు, ఎడిటెడ్ వీడియోలు, మార్ఫ్‌డ్ ఫోటోలు రోజూ చూస్తున్నవే కదా… ఇందులో ఏం జరిగింది అని చూస్తే…
Ads
సెప్టెంబరు 20… ఎన్డీటీవీ ఇంటర్వ్యూ… ఇంటర్వ్యూయర్ ఆమెను ఏమడిగిందీ అంటే… ‘‘ABVP లేదా BJP గెలవడానికి కారణం EVMల హ్యాకింగ్, ఎలక్షన్ కమిషన్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తోంది అని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నాడు కదా… ఏమంటారు..?’’
దానికి ఆమె ‘‘70 ఏళ్లుగా వాళ్లు చేస్తే సమస్య లేదు, మేం చేస్తే తప్పు అంటున్నారు’’ అని సమాధానం చెప్పినట్టుగా కాంగ్రెస్, ఆప్ విస్తృతంగా వైరల్ చేస్తున్న వీడియోల్లో కనిపిస్తోంది… మొత్తం మీడియా కూడా కవర్ చేసింది అదే వీడియోను నమ్మి…
నిజానికి ఆమె ఏమన్నదంటే… (పలు మీడియా సంస్థలు ఫ్యాక్ట్ చెక్ చేసి బయటపెట్టిందే…) ‘‘అవును, 70 ఏళ్లుగా వాళ్లు చేస్తే సమస్య లేదు, మేము చేస్తే తప్పు… వాళ్లు గెలిస్తే ప్రజల తీర్పు అంటారు… మేము గెలిస్తే మాత్రం హ్యాకింగ్ అంటారా..? ఈ ఫార్ములా ఏ పుస్తకంలో రాసుంది..? రాహుల్ గాంధీ ఎక్కడ చదివారు..?” అని వ్యాఖ్యానించింది…
అందులో ఆమె ఉద్దేశం… 70 ఏళ్లు వాళ్లు గెలిస్తే ఏమీ ఉండదు, కానీ మేం గెలిస్తే ఈవీఎంలు హ్యాక్ చేసినట్టా అని చెప్పడం… ఈ డిజిటల్ మాఫియాలు, మాయల కాలంలో ఏ నాయకుడైనా సరే, చెప్పదలుచుకున్న విషయాన్ని, సమాధానాన్ని సూటిగా చెప్పాలి… ఈమెకు ఇంకా తత్వం బోధపడినట్టు లేదు…
తన జవాబులో అటూఇటూ ఉన్న పార్ట్ కట్ చేసి, కేవలం ఓ చిన్న బిట్ చేసి, దాన్నే వైరల్ చేశాయి ఆప్, కాంగ్రెస్… చూశారా సాక్షాత్తూ ఓ బీజేపీ సీఎం స్వయంగా ఈవీఎంల ట్యాంపరింగు చేస్తున్నట్టుగా అంగీకరిస్తోంది అని ప్రచారం చేశాయి… కేజ్రీవాల్ కూడా ఈ ఎడిటెడ్ వీడియోను తన ట్వీట్‌కు జతచేశాడు… అసలే రాహుల్ గాంధీ వోట్ చోరీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంతో ఈ ఎడిటెడ్ వీడియో బాగా పాపులర్ అయిపోయింది హఠాత్తుగా…
‘‘చెప్పొచ్చారులే … మీరు నిజాయితీపరులు, మేమే దొంగలం, ఇదేనా మీ ప్రచారం, అంతేలే మీ నలుపు మీకెలా కనిపిస్తుంది…’’ అని చెప్పాం అనుకొండి… అందులో ‘‘మీరు నిజాయితీపరులు, మేమే దొంగలం’’ అనే పార్ట్ మాత్రం కట్ చేసి, ఆ వీడియోను వైరల్ చేసి… చూశారా, దొంగలం అని అంగీకరిస్తున్నారు అని ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది..,? ఓ ఉదాహరణ… అవును, రేఖా గుప్తా ఇంటర్వ్యూ బాపతు ఎడిటెడ్ వీడియో కూడా అంతే…
ఇంటర్వ్యూ పూర్తి వెర్షన్ జత చేస్తూ బీజేపీ ఐటీ సెల్ కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది… కానీ ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది…
గతంలో ఆప్ బ్రహ్మాండమైన విజయాల్ని సాధించింది ఢిల్లీలో… కాంగ్రెస్ మట్టిగరిచింది… తరువాత బీజేపీ కోలుకుని, మొన్నటి ఎన్నికల్లో మెజారిటీ సాధించి రేఖా గుప్తా సీఎం అయ్యింది… మరి ఆప్ గెలిచినప్పుడు ఏమీ లేదు గానీ బీజేపీ గెలిస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్టా..? నిజంగా బీజేపీకి ఆ ట్యాంపరింగే చేతనైతే అప్పట్లో ఆప్‌కు అంత బంపర్ గెలుపు ఎలా సాధ్యమవుతుంది..? బీజేపీయే గెలిచేది కదా…!!
Share this Article